TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Friday, April 26, 2024

FLN TLM Ideas

 FLN TLM Ideas

టీఎల్ఎం మేళాల నిర్వహణపై నేడు టెలికాన్ఫరెన్స్

ఐదో తరగతిలోపు విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాల సాధనకు చేపట్టిన తొలిమెట్టును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాఠశాల విద్యాశాఖ.. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాలను నిర్వహించనున్నది. మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఈ మేళాల నిర్వహణపై సబ్జెక్టుల వారీగా టీచర్లకు అవగాహన కల్పించడానికి బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీశాట్ విద్య చానల్లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టుఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల టీచర్లంతా ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొనాలని సూచించారు.

*💥TLM Melas General Guidelines లోని ముఖ్యాంశాలు...👇*


*🍁మండల, జిల్లా స్థాయిలో మేళా నిర్వహణ*


 *♦️మండల స్థాయిలో డిసెంబర్ 28వ తేదీన/ జిల్లా స్థాయిలో జనవరి మొదటి వారంలో, రాష్ట్రస్థాయిలో సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తారు.*


*♦️మండలస్థాయిలో ఆ మండలములోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు TLM మేళాలో పాల్గొనాలి.*


 *👉ప్రతీ పాఠశాల నుండి ఉపాధ్యాయులు, తాము* *బోధిస్తున్న సబ్జెక్టులో లేదా అన్ని సబ్జెక్టులకు కలిపి 4* *మించకుండా TLM ప్రదర్శనకు తీసుకుని రావాలి.ఏకోపాధ్యాయుడు ఐతే ఒక సబ్జెక్ట్ కు ఒకటి చొప్పున 3 లేదా 4 TLM తీసుకొని రావాలి.*


*💥TLM మేళా చక్కటి నిర్వహణకు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి.*


*1. అవసరాల కమిటీ* (టెంట్, కుర్చీలు, బల్లలు, బానర్లు, తాగునీరు, మైకు,భోజనాలు, మరియు ఇతర అవసరమగు సామాగ్రి)


*2.ఆహ్వాన కమిటీ* (M.E.O., Mandal Nodel officer (FLN), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు


*3. ఆర్గనైజింగ్ కమిటీ* (సబ్జెక్టు వారీగా సామాగ్రిని అమర్చడానికి, ఉపాధ్యాయులకు సహకరించడానికి)


*4. న్యాయ నిర్ణేతల కమిటీ* (ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున రిసోర్స్ సభ్యులు)


*5. డాక్యుమెంటేషన్ కమిటీ* 

(నివేదిక తయారీ, డిజిటల్ డాక్యుమెంటేషన్ కోసం)

FLN TLM Ideas























TSAT-Vidya - Bridge Course

13 నుంచే బడుల రీఓపెన్‌.. జూలై 1 నుంచి రెగ్యులర్‌ పాఠాలు

కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై కసరత్తు పూర్తిచేసిన పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. జూలై 1 నుంచి విద్యార్థులకు రెగ్యులర్‌ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 30 వరకు బ్రిడ్జికోర్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బ్రిడ్జికోర్సులో భాగంగా పై తరగతులకు ప్రమోట్‌ అయిన విద్యార్థి, కింది తరగతుల్లో చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలను ఈ రోజుల్లో చదవాల్సి ఉంటుంది.

బ్రిడ్జి కోర్సులో భాగంగా డిజిటల్‌ పాఠ్యాంశాలతో పాటు, ముఖాముఖి తరగతులు రెండింటిని నిర్వహిస్తారు. ఈ కోర్సు కోసం ఒకటి, రెండు తరగతులను మినహాయించి, 3 నుంచి 10వ తరగతి వరకు నాలుగుస్థాయిలుగా విభజించారు. నాలుగు లెవల్స్‌గా విభజించి, రోజుకు ఆరు పీరియడ్స్‌ చొప్పున విద్యార్థులు గతంలో చదివిన పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలు బోధిస్తారు.

తరగతుల వారిగా బోధించాల్సిన పాఠ్యాంశాల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. టీశాట్‌ విద్యచానల్‌ ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. జులై 1 నుంచి టీచర్లు ఆయా పాఠ్యాంశాలను త‌ర‌గ‌తి గ‌దిలోనే బోధిస్తారని అధికారులు వెల్లడించారు.

Transmission Schedule of Bridge Course Digital Lessons in TSAT Vidya from 13.06.2022 to 30.06.2022 : Click Here

Download T-SAT App Here