Monday, September 30, 2019

బతుకమ్మ చరిత్ర

బతుకమ్మ చరిత్ర

తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు. వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులుగా ఉండేవారు. చోళులకు, రాష్ట్రకూటులకు యుద్దం జరిగినప్పుడు ఈ చాళుక్యలు రాష్ట్రకూటులకు మద్దతుగా నిలిచారు. క్రీస్తు శకం 973లో ఈ చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతంచేసి కల్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు. ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తైలపాడు రాజే పరిపాలించేవాడు. క్రీస్తు శకం 997లో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యాస్రాయుడు రాజపీఠాన్ని అధిష్టించాడు. అప్పటి వేములవాడ(ప్రస్తుత కరీంనగర్ జిల్లా)లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది.


Click Here to Download Bathukamma MP3 Songs and PDF
ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు. ప్రజలే కాదు చోళరాజు పరాంతక సుందరచోళా కూడా రాష్ట్రకూటుల నుంచి ఆపద తలెత్తినప్పుడు రాజరాజేశ్వరికి భక్తుడిగా మారిపోయాడు. రాజరాజేశ్వరే తనను కాపాడిందని నమ్మిన పరాంతక సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకరణం చేశాడు. ఆ రాజరాజ చోళానే క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజ్యాన్ని పరిపాలించాడని చరిత్ర చెబుతోంది. అతని కుమారుడైన రాజేంద్రచోళ సత్యాస్రాయపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించి విజయం సాధించాడు. ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి అందులోని భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం 1006లో ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ. క్రీస్తు శకం 1010లో నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేశ్వరాలయంలో ప్రతిష్టించాడు. తమ రాజ్యంపై దాడి చేసి దోచుకున్న సొమ్ముతోనే బ్రిహదేశ్వరాలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు కూడా తమిళ శిలాశాసనాల్లో చోళ రాజులు చెప్పారు. ఇప్పటికీ వేములవాడలోని భీమేశ్వరాలయ శివలింగానికి , బ్రిహదేశ్వరాలయంలోని శివలింగానికి మధ్య సారూప్యతను చూడచ్చు. వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివలింగాన్ని వేరుచేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు తెలంగాణవాసులు. అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు. దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణవాసులు జరుపుకుంటున్నారు. బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.


బతుకమ్మ చరిత్ర/2019/09/telangana-bathukamma-charitra-history-songs.html

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు "బొడ్డెమ్మ" (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

28 నుంచి 6 వరకు బతుకమ్మ వేడుకలు... ఇదీ ప్రాసస్థ్యం...


             *బతుకును ఇచ్చే అమ్మ పండుగే*... బతుకమ్మ. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచీ అక్టోబర్ 6 వరకూ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా... 28న శనివారం... వరంగ‌ల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఈ పండుగను నిర్వహించబోతోంది. తెలంగాణతోపాటూ... ముంబై, బెంగళూరు, కర్నాటకలోనూ బతుకమ్మ పండుగను జరుపుకునేందుకు కావాల్సిన సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చివరి రోజున అంటే అక్టోబర్ 6న ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్​బండ్​వరకు ర్యాలీ ఉండబోతోంది. ముగింపు వేడుకలు ట్యాంక్​బండ్​పై జరగనున్నాయి. ఇండియాతోపాటూ... మరో ఆరు దేశాల్లో బతుకమ్మ సంబురాలు జరగబోతున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, యూకే, ఖతార్‌‌‌‌, బహ్రైన్‌‌‌, కువైట్‌‌‌‌ దేశాల్లో ఉత్సవాలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మొత్తం తొమ్మిది రోజులపాటు కొనసాగే ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మను చేస్తారు.

1) ఎంగిలి పువ్వుల బతుకమ్మ. 28.09.2019

2) అటుకుల బతుకమ్మ. 29.09.2019

3) ముద్దపప్పు బతుకమ్మ. 30.09.2019.

4) నాన్న బియ్యం బతుకమ్మ .01.10.2019.

5) అట్ల బతుకమ్మ . 02.10.2019

6) అలిగిన బతుకమ్మ ( ఆరవ రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. నైవేద్యం పెట్టారు) .03.10.2019.

7) వేపకాయల బతుకమ్మ .04.10.2019.

8) వెన్నముద్దల బతుకమ్మ. 05.10.2019.

9) సద్దుల బతుకమ్మ . 06. 10.2019.

 తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు


9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

1.ఎంగిలి పూల బతుకమ్మ: మహా అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

2.అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

3.ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

4.నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

5.అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు..

6.అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు. బతుకమ్మ ఆడరు.

7.వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

8.వెన్నముద్దల బతుకమ్మ : \నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

9.సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం.

తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

....ముందస్తుగా మిత్రులందరికీ బతుకమ్మ & దసరా పండుగ శుభాకాంక్షలు 🙏