Sunday, August 6, 2023

Are you applying for new Passport? You must know few new rules before applying!

Are you applying for new Passport? You must know few new rules before applying!

The Indian Government will start requiring all passport applicants to have a Digi Locker from August 5th, 2023. For individuals who intend to use Aadhar for verification reasons, this is very crucial. You must register for a Digi Locker account if you present your Aadhar data to your Digi Locker account, passport applications will be processed more quickly and securely.


You must finish the Digi Locker procedure starting on August 5 if you intend to apply for an Indian passport.  On the official website for passport issuance, first upload your supporting papers to digi locker, then submit your passport application. In addition, you need to register a Digi locker account if you present your Aadhar during passport verification. By connecting your Digi Locker account to your Aadhar information, the procedure will be quicker and safer.

Are you applying for new Passport? You must know few new rules before applying!

The creation of a Digilocker account is now required across the whole nation by the government, following its launch in Mumbai and Chennai. The Ministry of External Affairs (MEA) wants to expedite and safeguard the processing of passport applications by trying your Aadhar data to your Digi Locker account.


When submitting your online application, you must choose the Digi Locker option if you intend to use Aadhar as documentation for your current home address or date of birth for your passport application. Aadhaar will not be recognized as a legitimate document for proof of current address or date of birth at Passport Seva Kendras (PSK) or Post Office Passport Seva Kendras (POPSKs), according to the official notice, if you do not exercise the option of DigiLocker for Aadhaar at the time of online submission of the passport application. 



మీరు కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేస్తున్నారా? దరఖాస్తు చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా కొన్ని కొత్త నియమాలను తెలుసుకోవాలి!

పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం భారత ప్రభుత్వం కొత్త నిబంధనను రూపొందించింది. ఆగస్టు 5 నుంచి పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు ప్రభుత్వం డిజిలాకర్ ప్రక్రియను తప్పనిసరి చేసింది.


www.passportindia.gov.inలో పాస్‌పోర్ట్ దరఖాస్తును సమర్పించే ముందు.. దరఖాస్తుదారులు డిజిలాకర్‌లో పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని ఈ నోటీసులో పేర్కొంది.


ప్రస్తుతం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఆధార్‌ను సమర్పించే దరఖాస్తుదారులు.. డిజిలాకర్ ఖాతాను ఓపెన్ చేయడం.. అధికారులు తప్పనిసరి చేసినట్లు ముంబై కార్యాలయం కూడా నోటీసు జారీ చేసింది. మొత్తం ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడానికి అవసరమైన సహాయక పత్రాలను అప్‌లోడ్ చేసే 'డిజిలాకర్' ప్రక్రియను పూర్తి చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) దరఖాస్తుదారులకు సూచించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించే ముందు.. దరఖాస్తుదారులు డిజిలాకర్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని చెబుతోంది.


దీంతో.. ప్రజలు తమ డిజిలాకర్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం యొక్క ధృవీకరణ, ప్రాసెసింగ్ సమయం మునుపటి కంటే తక్కువ ఉంటుందని చెబుతున్నారు.


ఆగస్టు 5, 2023 నుండి దరఖాస్తుదారులు తమ చిరునామాగా ఆధార్‌ను సమర్పించినప్పుడు.. వారు ఆన్‌లైన్ అప్లికేషన్‌లో డిజిలాకర్‌ని ఎంచుకోవాలి. దరఖాస్తుదారులు ఒకవేళ దీన్ని చేయకపోతే.. వారి ప్రస్తుత చిరునామా లేదా జనన ధృవీకరణ పత్రం మరణానికి ఆధార్ చెల్లుబాటు అయ్యే పత్రంగా పరిగణించబడదు.


దరఖాస్తుదారులు పోర్టల్‌లోనే డిజిలాకర్‌కు పత్రాలను అప్‌లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. డిజిలాకర్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత.. ప్లాట్‌ఫారమ్‌లో అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, దరఖాస్తుదారులు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అసలు పత్రాలను తీసుకురావాల్సిన అవసరం లేదు.


డిజిలాకర్‌ భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తోంది. ఇది డిజిటల్ ఇండియా చొరవ కింద అందించబడిన డిజిటలైజేషన్ సేవ. మీరు మీ అన్ని ముఖ్యమైన పత్రాలను డిజిలాకర్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, మార్క్‌షీట్‌ తదితరాలను సేవ్‌ చేసుకోవచ్చు.