Wednesday, May 3, 2023

How to Activate SBI Net Banking Online?

 ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్టివేషన్ బ్రాంచ్ కు వెళ్లకుండానే..

ఈరోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు సర్వసాధారణంగా మారాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింలు కనిపిస్తుంటాయి. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కస్టమర్లు ఆన్లైన్లో, ఎప్పుడైనా ఎక్కడైనా వివిధ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే మీ ఆన్లైన్ నెట్ బ్యాం కింగ్ ఖాతాను బ్రాంచ్క వెళ్లకుండానే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్లోనే చేయవచ్చు. ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని మొబైల్లు, కంప్యూటర్లు, ట్యాబ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

How to Activate SBI Net Banking Online?

స్టెప్ 1: ఎస్ బీ ఐ నెట్ బ్యాంకింగ్ ను ఆన్లైన్లో యాక్టివ్ చేయడానికి మొదటి స్టెప్ ఎస్ బీఐ నెట్ బ్యాంకింగ్ అధికారిక వెబ్సైట్ https://retail.onlinesbi.sbi/retail/login.htm. కు వెళ్లాలి.

స్టెప్ 2: ఇప్పుడు అందులో పర్సనల్ బ్యాంకింగ్ విభాగం" ఓపెన్ చేసి "కంటిన్యూ లాగిన్ ' ఆప్షన్ను ఎంచుకోండి. ఈ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకానికి సంబం ధించిన సేవా నిబంధనలను అంగీకరించినట్టుగా భావించాలి.

స్టెప్ 3: ఈ దశలో "న్యూ కస్టమర్ రిజిస్ట్రేషన్"పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లడానికి ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: రిజిస్ట్రేషన్ పేజీలో, మీ ఖాతా నంబర్, సీ ఐ ఫ్ నంబర్, బ్రాంచ్ కోడ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇతర వివరాలను ఇవ్వాలి. ఏవైనా సమస్యలు రాకుండా చూ సుకోవడానికి అన్ని వివరాలను కచ్చితంగా ఇవ్వాలి.

స్టెప్ 5: వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, మీరు ఓటీపీ (వన్లైమ్ పాస్వర్డ్)ని క్రియేట్ చేసుకోవాలనే మెసేజ్ కనిపిస్తుంది. ఈ ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వస్తుంది. అక్కడ కనిపించే ఫీల్డ్ లో ఓటీపీని ఎంటర్ చేసి, “సబ్మిట్” బటన్పై క్లిక్ చేయండి.

స్టెప్ 6: వెబ్సైట్ ఇప్పుడు రెండు చాయిస్ లను చూపుతుంది. అవి... 'నా దగ్గర నా ఏటీఎం కార్డ్ ఉంది' 'నా ఏటీఎం కార్డ్ నా దగ్గర లేదు”. మొదటి ఎంపికను ఎంచుకుని, ఏటీఎం కార్డ్ వివరాలను నింపాలి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ రిజిస్ట్రే షన్.. ఏటీఎం కార్డ్లో మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే, మీరు నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కోసం బ్యాంక్ శాఖకు వెళ్లాలి.

స్టెప్ 7: ఇప్పుడు 'సబ్మిట్ ' బటన్ పై క్లిక్ చేయండి.వెంటనే టెంపరరీ యూజర్ నేమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

స్టెప్ 8: ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కోసం లాగిన్ పాస్వర్డ్ను క్రియేట్ చేసుకో వాలని కోరుతుంది. గుర్తుంచుకోవడానికి వీలుకాని, ఇతరులు ఊహించడానికి కష్టతరమైన పాస్వర్డ్ను ఎంపిక చేసుకోవాలి

స్టెప్ 9: మీరు మీ లాగిన్ పాస్వర్డ్ని సృష్టించిన తర్వాత, మీరు లాగిన్ పేజీకి వెళ్తారు. మీ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ కావడానికి యూజర్ నేమ్,పాస్వర్డ్ను ఎంటర్ చేయండి.

స్టెప్ 10: మీ ఖాతాకు లాగిన్ అయిన తర్వాత, రిజిస్ట్రే షన్ను పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చే యడానికి మీ ఈ-మెయిల్, సెక్యూరిటీ ప్రశ్నలు వంటి అదనపు సమాచారాన్ని అందించాల్సి రావచ్చు. మీకు ఏటీఎం కార్డ్ లేకపోతే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎస్బీఐ వెబ్సైట్ నుంచి నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

How to Activate SBI Net Banking Online?

1. Go to the SBI official website (https://www.onlinesbi.com) and click on “New User Registration” in the personal banking section.

2. Once you click on the “New User Registration” option a popup box will open. Here you have to click on “OK” to proceed further.

3.Next page, select the “New User Registration” option from the drop-down menu. Click on the “Next” tab.

4. Now a new screen will be open, here you have to fill the following account related details.

a) Account Number

b) CIF Number

c)  Branch code

d) Country

e) Registered Mobile number

f) Facility Required

Now type captcha code and click on the “Submit” tab.

5. After submitting the account details, you will receive an OTP (One-time password) on the mobile number entered by you. Enter the OTP and click on the “Confirm” tab.

6. Next screen you have two options:

a) I have my ATM Card (online registration without branch visit)

b) I do not have my ATM Card (Activation by branch only).

Select the first option if you have an ATM card and click on the “Submit” tab. Note that if you do not have an ATM card, SBI online services will be activated by the branch.

7. In the next screen, you can complete the registration and activate SBI Internet banking services for your account using your ATM card.

8.Next screen you are displayed your temporary username. Note down your username. Here you have to create your login password. Note that it is 8 characters long and is a combination of upper and lower case alphabets, and contains at least one number and one special character. Reenter your password and click on the “Submit” tab.

9. Your SBI online personal banking registration is successful. Now visit the login page and log in to SBI Internet banking services with the temporary username and password.

10. Next screen you have to create a user Id of your choice to override the temporary username. Here you also need to set a login password and profile password for State Bank of India Net  banking. The login password should be a combination of alphabets, number and special characters at least 8 characters long.

Click Here for SBI Official Website