Wednesday, June 9, 2021

How to correct mistakes in the Covid vaccination certificate?

How to correct mistakes in the vaccination certificate?

You can rectify errors in your Covid vaccine certificate. Here is how

On Wednesday The Union Health Ministry  said that Covid-19 vaccine beneficiaries from now can rectify errors in their COVID 19 Vaccine inoculation certificate through the CoWin Official website/portal. A special feature by name  "Raise an Issue" has been added to the CoWin platform to make the Covid-19 vaccine beneficiaries easy to correct their personal details. Users can now make corrections to their name, year of birth, and gender on their Covid-19 vaccination certificates if there is an error. 

Note :However, the certificate can only be edited only once.

How to correct mistakes in the Covid vaccination certificate

 Vaccine: టీకా ధ్రువపత్రంలో తప్పులా?

కరోనా టీకా ధ్రువపత్రంలో పేరు, పుట్టినతేదీ వంటి వివరాల్లో తప్పులొచ్చాయా? అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. కొవిన్‌ వెబ్‌సైట్‌ ద్వారా వాటిని సరిచేసుకునే వీలు కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌లో మార్పులు చేసుకునేలా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసినట్లు బుధవారం వెల్లడించింది.

"కొవిన్‌ నమోదు సమయంలో పేరు, పుట్టినతేదీ, లింగం వంటి వివరాలను పొరబాటుగా తప్పుగా ఇస్తే టీకా ధ్రువపత్రంలో వాటిని సరిచేసుకోవచ్చు’ అని ఆరోగ్యసేతు ట్విటర్‌ ఖాతాలో కేంద్రం ట్వీట్ చేసింది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో ‘రైజ్‌ యాన్‌ ఇష్యూ’ అనే ఫీచర్‌ను యాడ్‌ చేసింది. దేశీయ, విదేశీ ప్రయాణాల సమయంలో ఈ టీకా ధ్రువపత్రాల అవసరం ఏర్పడుతుంది.

తప్పులు ఎలా సరిచేసుకోవాలంటే..

1. www.cowin.gov.in పోర్టల్‌ను ఓపెన్‌ చేయాలి.

2 మీ పది అంకెల మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి.

3. ఆ తర్వాత మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీ ఖాతా ఓపెన్‌ అవుతుంది.

4. ఆ తర్వాత Account Details అనే బటన్‌ని క్లిక్‌ చేయాలి. మీరు వ్యాక్సిన్‌ వేయించుకుంటే మీకు Raise an Issue అనే బటన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయాలి.

5. అప్పుడు Correction In Certificate(ధ్రువపత్రంలో కరెక్షన్‌) ఆప్షన్‌ కన్పిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే పేరు, పుట్టినతేదీ, జెండర్‌లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఆప్షన్స్‌ కన్పిస్తాయి.

గమనిక: అయితే యూజర్లు తమ టీకా ధ్రువపత్రాన్ని ఒకేసారి ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అప్‌డేట్‌ చేసిన సమాచారం తుది ధ్రువపత్రంపై కన్పిస్తుంది.


.                        

Click Here for Login to Correct Mistakes