Know the Process How to Apply Aadhaar Card for Children
భారతదేశంలోని ప్రజలకు ప్రతిఒక్కరికి ఆధార్ కార్డు యంతో అవసరం. అయితే, కేవలం పెద్దలకు మాత్రమే ఆధార్ కార్డు అవసరం కాదు. పిల్లలకు కూడా అవసరం ఉంటుంది మీ ప్రభుత్వ ఉద్యోగం లేదా పాస్‌పోర్ట్ సృష్టించడానికి, బ్యాంకు ఖాతా తెరవడానికి, మరియు వివిధ ప్రభుత్వ పథకాలలో పిల్లల పేర్లను చేర్చడానికి ఆధార్ కార్డు ఎంతగానో అవసరం ఉంటుంది . ముఖ్యంగా, మరియు ఆధార్ కార్డు పిల్లల గుర్తింపు కార్డుగా కూడా పనిచేస్తుంది.
మీరు మీ యొక్క పిల్లల ఆధార్ కార్డును పొందాలనుకుంటే, మీరు కొన్ని సాధారణ దశలతో సులభంగా చేయవచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి, మరియు డొమినికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీ పిల్లల ఆధార్ కార్డు కొరకు ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ తెలుసుకోండి
5 నుండి 15 సంవత్సరాల పిల్లలకు ఆధార్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- పిల్లల ఆధార్ కోసం ముందు UIDAI అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/)కు వెళ్లి, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. లేదా మీ సమీప ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి
- పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్.. వంటి వివరాలను ఇక్కడ నమోదు చేయాలి.
- పూర్తి వివరాలతో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను నింపాలి.
- అనంతరం అపాయింట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసి, ఆధార్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ తేదీని ఎంపిక చేసుకోవాలి.
- దగ్గర్లో ఉండే ఆధార్ కేంద్రాన్నితల్లిదండ్రులు ఎంచుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీన.. పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటో కాపీలు, అన్ని పత్రాలతో నమోదు కేంద్రానికి వెళ్లాలి.
- ఆధార్ అధికారి అన్ని పత్రాలను సరిచూస్తారు.
- పిల్లలకు ఐదేళ్ల లోపు వయసు ఉంటే, కేవలం వారి ఫోటో మాత్రమే ఆధార్ కార్డు కోసం తీసుకుంటారు.
- వీరి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయరు.
- పిల్లలకి 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉంటే, వేలిముద్ర రిజిస్టర్ మరియు ఫేస్ స్కాన్ అవసరం.
- అయితే, దీనితో పాటు, పాఠశాల యొక్క ఐ-కార్డ్ మరియు పాఠశాల లెటర్‌హెడ్ పై బోన ఫైడ్ సర్టిఫికేట్ సమర్పించాలి.
- ఈ పత్రాలన్నింటికీ గెజిటెడ్ అధికారి గుర్తింపు అవసరం అని గమనించండి.
- అన్ని వివరాలను ధ్రువీకరించిన తరువాత దరఖాస్తుదారునికి ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్ ఇస్తారు.
- దీని ద్వారా అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
- నమోదు చేసుకున్న 60 రోజుల్లో దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది.
- నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత 90 రోజుల్లో బాల ఆధార్ కార్డును పంపిస్తారు.
ఐదేళ్ల లోపు పిల్లలకు ఆధార్ కార్డు ఎలా దరఖాస్తు చేయాలి ఇక్కడ తెలుసుకోండి
- ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, మీరు సమీప ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.
- అక్కడ మీరు పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.పిల్లల ఆధార్ కార్డు నమోదుకు సంబంధించిన ఫారాన్ని నింపాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి అధికారులకు దరఖాస్తు ఫారాన్ని సమర్పించాలి.
- తల్లిదండ్రుల ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా ఫారంలో తప్పనిసరిగా నింపాలి.
- వెరిఫికేషన్ పూర్తయిన తరువాత పిల్లలను ఫోటో తీస్తారు.
- ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నవారి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయరు.
- ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉంటే, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను సేకరిస్తారు.
- పూర్తి వివరాలను ధ్రువీకరించిన తరువాత మీకు ఒక రసీదు ఇస్తారు. మరియు ఇక్కడ మీరు నమోదు సంఖ్య ఇవ్వాలి.
- ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, 60 రోజుల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
- ఈ ఎస్ఎంఎస్ వచ్చిన 60 రోజుల్లో బాల ఆధార్ కార్డు జారీ చేస్తారు.