TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Sunday, April 25, 2021

Summer Holidays to TS Schools from April 27th to May 31th 2021

Summer Holidays to TS Schools from April 27th to May 31th 2021

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రములో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.  కరోనా విస్తరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ - 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న  ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Summer Holidays to TS Schools from April 27th to May 31th
Click Here to Download Rc No 52 Summer Holidays to TS Schools from April 27th to May 31th


Click Here to Download C and DSE Clarification on Prefix and Suffix