Thursday, March 12, 2020

SSC invigilation Duty కి వెళ్లే ఉపాద్యాయులకు హెచ్చరిక


SSC invigilation Duty కి వెళ్లే ఉపాద్యాయులకు హెచ్చరిక


టీచర్లపై పిడుగు!!

    గతేడాది మార్చ్ లో జరిగిన SSC పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతుంటే పట్టించుకోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన *ఏడుగురు టీచర్లకు మూడేసి ఇంక్రిమెంట్లు క్యుములేటివ్ ప్రభావంతో నిలిపివేయడం... ఒక ఉపాధ్యాయురాలిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం*... రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతి కలిగిస్తోంది.  ఈ స్థాయి శిక్షలు ఎవరూ ఊహించనివి. దీంతో పరీక్షల నిర్వహణ డ్యూటీ అంటేనే టీచర్లు గజ్జున వణికిపోయే పరిస్థితి దాపురించింది. *ఇక్కడ బలి అయింది ముఖ్యంగా ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన ఎస్జీటీలు, ఎల్పీలు, పీఈటీలే.


SSC invigilation Duty కి వెళ్లే ఉపాద్యాయులకు హెచ్చరిక/2020/03/caution-to-ssc-invigilation-duty-teachers.html

 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ని ప్రోత్సహించే టీచర్లకు Telangana State Public Examinations Act 1997, Prevention of  Malpractices and Unfair Means Act 25/97 ప్రకారం.... *మేజర్ పెనాల్టీ ఐన సర్వీస్ నుంచి డిస్మిస్ పాటు మూడు సంవత్సరాలకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.*
 పాపం, ఈ విషయాలేవీ తెలియని... తెలిసినా సీరియస్ తీసుకోని టీచర్లు బలైపోయారు. మామూలు టీచర్లకు విద్యాశాఖకు సంబంధించిన జీవోల గురించే అంతగా తెలియదు. ఇక చట్టాలు, వాటి గ్రావిటీ గురించి ఎక్కడ తెలుస్తుంది! రెండేళ్ల క్రితం జగిత్యాల జిల్లాలో SSC పరీక్షల సందర్భంగా కాపీ ప్రోత్సహించారని అభియోగాలు మోపుతూ పలువురు టీచర్లపై కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి సదరు టీచర్లకు ఇంక్రిమెంట్లు లేవు. యాంత్రిక పదోన్నతి స్కేళ్ళూ ఇవ్వడంలేదు. ఆ జిల్లా అధికార యంత్రానికి టీచర్లపై సానుభూతి ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ కేసు ఎప్పుడు ముగుస్తుందో... టీచర్లు బయటపడేదెప్పుడో ఎవరికీ తెలియదు.
జాగ్రత్త!

  ఇంకో ఐదారు వారాల్లో  ఈ ఏడాది SSC పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో తీసుకున్న తీవ్ర చర్లను దృష్టిలో పెట్టుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి. ఎవరూ ఆషామాషీగా తీసుకొని... కొలువుకు ఎసరు తెచ్చుకోవద్దు! జైలు పాలుకావద్దు.
*పరీక్షల్లో కొంచెం చూసి చూడనట్టు వెళ్లండని చెప్పే వాళ్ళెవరూ మిమ్మల్ని కాపాడలేరని గుర్తు పెట్టుకోవాలి. నిక్కచ్చిగా వ్యవహరించండి*
ముఖ్యంగా  సెల్ ఫోన్ ని ఇంటివద్దే పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎస్, డీవోలు సహా *ఎవరూ సెల్ ఫోన్ ని పరీక్ష కేంద్రానికి తీసుకొని వెళ్లొద్దు.*

 రిజల్ట్ తక్కువ వస్తే కొంపలేమీ మునిగిపోవు. మహా ఎక్కువైతే సమావేశంలో అడుగుతారు. జవాబిస్తే సరిపోతుంది. అంతేగాని, రిజల్ట్ తక్కువ వచ్చిందని ఛార్జెస్ ఫ్రేమ్ చెయ్యరు. ఇంక్రిమెంట్ ఆపరు. సస్పెండ్ చెయ్యరు.  అదే మీరు SSC పరీక్షల డ్యూటీ చేస్తున్నప్పుడు దొరికితే మాత్రం Act 25/1997 ని మీపై అమలు చేస్తే... పరిణామాలు ఊహించడానికే భయంకరంగా కనబడుతున్నాయి. అందుకే.., జాగ్రత్త! జాగ్రత్త!!..