Thursday, August 29, 2019

Know, at what time the train arrives, through an SMS to your phone

Know, at what time the train arrives, through an SMS to your phone

రైలు ఏ టైం కి వస్తుందో మీ ఫోన్ కు మెసేజ్


      మీరు ఎక్కువగా రైలు ప్రయాణం చేస్తుంటారా? అయితే మీకు ఒక శుభవార్త. ఇండియన్ రైల్వేస్ కొత్తగా ఎస్ఎంఎస్ సర్వీసులను లాంచ్ చేసింది. దీంతో మీరు రైలు ఎవ్పుడు వస్తుందా.. అని ప్లాట్ ఫామ్పై గంటల తరబడి వేచిచూడాల్సిన పనిలేదు. ఇండియన్ రైల్వేస్ తన ఎస్ఎంఎస్ సర్వీసులతో ప్రయాణీకు లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది


Know, at what time the train arrives, through an SMS to your phone /2019/08/know-at-what-time-train-arrives-through-an-sms-to-your-phone.html
Know, at what time the train arrives, through an SMS to your phone

బెర్త్ కన్ఫర్మేషన్ దగ్గరి నుంచి రైలు ట్రావెల్ స్టేటస్ వరకు అన్ని వివరాలు రియల్ టైమ్లో ఆందిస్తుంది. ఇది రైలు ప్యాసింజర్లకు ఎంతో ప్రయోజనం కలిగించే అంశం. ప్యాసింజర్లకు ఎస్ఎం ఎస్ సర్వీసులు అందించడంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సిఆర్ఐఎస్) కీలక పాత్ర పోషించనుంది. ప్యాసింజర్ టిక్కెటింగ్, రవాణ సర్వీసులు, ట్రైన్ డిస్పాచింగ్ అండ్ కంట్రోల్, మేనేజిమెంట్ ఆఫ్ రైల్వేస్ వంటి పలు విధులు నిర్వర్తిస్తుంది. సిఆర్ఐఎస్ కేవలం రైలు సరైన సమయానికే వస్తుందా? లేదా? అని మాత్రమే కాకుండా రైలు క్యాన్సిల్ అయితే ఆ వివరా లను కూడా ఎస్ఎంఎస్ రూపంలో ప్రయాణీకులకు చేరవేస్తుంది.


రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ సేవల గురించి తెలియ చేశారు. ఎస్ఎంఎస్ సర్వీస్ వల్ల రైలు ప్రయాణం మరింత సుఖవంత మవుతుంది. బుకింగ్ స్టేటస్, ఆలస్యం, ట్రైన్ రద్దు వంటి వివరాలను ముందుగానే తెలుసుకో వచ్చు అనీ పీయూష్ గోయెల్ ట్వీట్ చేశారు. రైల్వే ఎస్ఎంఎస్ సర్వీసులు పొందాలంటే టిక్కెట్ రిజర్వేషన్ గానీ, టిక్కెట్ బుకింగ్ సమయంలో మొబైల్ నంబర్ కచ్చితంగా అంద చేయాలి. ఐఆర్ సిటిసి వెబ్ సైట్లో ఆన్లైన్ ద్వారా టిక్కెట్ బుకింగ్ చేసుకున్నా కూడా ఎస్ ఎంఎస్ సేవలు పొందవచ్చు. టిక్కెట్ బుకింగ్ సమయంలో ఫోన్ నంబర్ఇస్తే, ప్రీచార్ట్, పోస్ట్ చార్ట్, రీషెడ్యూల్, క్యాన్సలేషన్, డిలే, రీస్టోరేషన్, డైవర్షన్, షార్ట్ టర్మినేషన్, రిజర్వేషన్ కన్ఫార్మేషన్ వంటి అలర్ట్ ల ను పొందవచ్చు.


CLICK HERE FOR


UTS Mobile Ticketing