Friday, 1 February 2019

Indian Union Budget 2019 Highlights

Indian Union Budget 2019 Highlights
v 2019-20 మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు
ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయుష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని మరిన్ని ముఖ్యాంశాలు...

Indian Union Budget 2019 Highlightshttp://www.paatashaala.in/2019/02/indian-union-budget-2019-highlights.html

* 12 కోట్ల మంది రైతులకు లబ్ది కలిగించేలా సరికొత్త సంక్షేమ పథకం.
* పూర్తి పారదర్శకంగా ఏడాదికి రూ. 6 వేలను పంటసాయంగా చెల్లిస్తాం.
* 2018 డిసెంబర్ నుంచి కార్యక్రమం అమలులోకి వచ్చినట్టు.
* గోకుల్ మిషన్ కు ఈ సంవత్సరం రూ. 750 కోట్ల కేటాయింపులు.
* గో ఉత్పాదకతను పెంచడం కోసం సరికొత్త 'రాష్ట్రీయ కామ్ ధేన్ ఆయోగ్'
* పెన్షన్ విధానానికి మార్పులు.
* పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
* ఈఎస్ఐ లిమిట్ రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు.
* ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట మరో సరికొత్త స్కీమ్.
* నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
* రూ. 15 వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
* కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు అందిస్తాం.
* కొత్త పెన్షన్ విధానానికి రూ. 500 కోట్ల  కేటాయింపు.
* 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ స్కీమ్ తో లాభం.
* గ్రాట్యుటీ లిమిట్ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు.
* బ్యాంకుల రుణాలు రూ. 35,984 కోట్లకు పెరుగుదల.
* కిసాన్ క్రెడిట్ కార్డులపై 2 శాతం వడ్డీ రాయితీ.
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
* ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
* రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
* అవసరమనిపిస్తే అదనపు నిధుల కేటాయింపుకు సిద్ధం.
* కార్మికుల ప్రమాద బీమా రూ. 1.50 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు.
* 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులే.
* కొత్తగా 10 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి.
* వన్ ర్యాంక్ - వన్య పెన్షన్ కోసం రూ. 35 వేల కోట్లు.
* త్వరలోనే 'వందే భారత్' ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు.
* కేంద్ర స్థాయిలో ప్రత్యేక మత్స్య శాఖ ఏర్పాటు.
* పశు సంవర్థక, మత్స్య పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ.
* ప్రధానమంత్రి కౌశల్ యూజన ద్వారా కోటి మంది యువతకు లబ్ది.
* రైల్వేలకు బడ్జెటరీ సపోర్ట్ కింద రూ. 64,587 కోట్లు.
* మిజోరం, మేఘాలయా రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం.
* బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఇప్పటికే తొలగిపోయిన కాపలాలేని లెవల్ క్రాసింగ్ లు.
* ఈశాన్య భారతావని కూడా మౌలికరంగ అభివృద్ధిని చూస్తోంది.
* ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ. 15,166 కోట్ల కేటాయింపు.
* గడచిన ఐదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగింది.
* గడచిన ఐదేళ్లలో 34 కోట్ల జన్ ధన్ అకౌంట్ల ప్రారంభం.
* ప్రత్యక్ష పన్నుల ద్వారా ఆదాయం రూ. 12 లక్షల కోట్లు.
* 80 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య.
* ఆదాయపు పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.
* ఇప్పటివరకూ ఉన్న పన్ను పరిమితి రూ. 2.50 లక్షలు
* సెక్షన్ 80సీ పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షలకు పెంపు.
* ఇక పేద, మధ్యతరగతి ప్రజలంతా 0 నుంచి 5 శాతం పన్ను పరిధిలో మాత్రమే.
* సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
* సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
* రోజుకు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం.
* దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వదిలే సమస్యే లాదు.
* అందరినీ ఇండియాకు రప్పించి బకాయిలు వసూలు చేస్తాం.
* బినామీ ఆస్తుల వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వాటిని అటాచ్ చేశాం.
* 3 లక్షలకు పైగా బినామీ కంపెనీలను డీ రిజిస్టర్ చేశాం.
* గడచిన సంవత్సరం కోటి మందికి పైగా పన్ను చెల్లించారు.
* స్వతంత్ర భారతావనిలో ఇంతమంది నుంచి రిటర్నులు దాఖలు కావడం ఇదే తొలిసారి.
* వచ్చే ఐదేళ్లలో ఇండియా 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రూపాంతరం చెందుతుంది.
* 'ఈజ్ ఆఫ్ బిజినెస్' తో పాటే 'ఈజ్ ఆఫ్ లివింగ్'
* మరిన్ని విమానాశ్రయాలు రానున్నాయి.

* ఇన్ లాండ్ వాటర్ వేస్ కు పెద్దపీట.
* పట్టణాలను మరింత పరిశుభ్రం చేస్తాం.
* శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలకు మరిన్ని కేటాయింపులు.
* డిజిటల్ ఇండియా కలను సాకారం చేసి చూపిస్తాం.
* అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక లావాదేవీలను డిజిటల్ మాధ్యమంగానే సాగేలా చర్యలు.
* ఇండియాను కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు.
* ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
* ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
* సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
* ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తాం.
* గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణకు సమయం ఆసన్నమైంది.
* మేకిన్ ఇండియాలో భాగంగా గ్రామాలకు భారీ పరిశ్రమలను దగ్గర చేస్తాం.
* గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా ఇప్పటికే మారిపోయిన ఇండియా.
* గంగానదిని కాలుష్య రహితంగా మార్చి చూపుతాం.
* ఇందుకోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేయనున్నాం.
* అంతరిక్ష కార్యక్రమాలకు మరిన్ని నిధులను కేటాయిస్తాం.
* ప్రపంచ దేశాల శాటిలైట్లను నింగిలోకి చేర్చడంలో మనమే ముందున్నాం.
* ఆహార ఉత్పత్తులను మరింత సేంధ్రీకరిస్తాం.
* పురుగు మందులు వాడని పంటతో మరింత ఆరోగ్యం.
* 2025 నాటికి ప్రతి దేశ పౌరుడికీ ఆరోగ్య బీమా ఉంటుంది.
* వైద్య ఖర్చులకు ఒక్క రూపాయి కూడా పెట్టని పరిస్థితిని తీసుకు వస్తాం.
* ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపులో అతి త్వరలోనే నిర్ణయం.
* మంత్రివర్గ ఉపసంఘం నివేదికను జీఎస్టీ మండలి ముందు ప్రవేశపెట్టి చర్చించనున్నాం.
* జాతీయ విద్యా మిషన్ కు రూ. 38,572 కోట్లు.
* చైల్డ్ డెవలప్ మెంట్ స్కీమ్ కు రూ. 27,584 కోట్లు.
* ఎస్సీ, ఎస్టీల అభ్యన్నతికి రూ. 76 వేల కోట్లు.
* నెలకు వసూలవుతున్న పన్ను మొత్తం రూ. 97,100 కోట్లు.
* గడచిన ఐదేళ్లలో రాష్ట్రాల పన్ను వసూళ్లు సాలీనా 14 శాతం మేరకు పెరిగాయి.
* జీఎస్టీ అమలుతో వినియోగదారులపై రూ. 80 వేల కోట్ల భారం తగ్గింది.
* చాలా నిత్యావసర వస్తువులు 5 శాతంలోపు పన్ను పరిధిలోనే ఉన్నాయి.
* రూ. 5 లక్షలలోపు సంవత్సరాదాయం ఉన్న వారికి ఫుల్ టాక్స్ రిబేట్.
* వారు కేవలం రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది.
* రూ. 6.50 లక్షల వరకూ వార్షికవేతనం ఉంటే, పీఎఫ్, బీమా, సేవింగ్స్ తదితర స్కీముల్లో పెట్టుబడులు పెట్టి ఒక్క రూపాయి కూడా చెల్లించనక్కర్లేదు.
* మూడు కోట్ల మంది టాక్స్ ప్లేయర్లకు లబ్ది.
* పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు.
* టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
* స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు.
* ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 180 లక్షల నుంచి రూ. 2.40 లక్షలకు పెంపు.
* కేంద్ర ప్రాయోజిత పథకాలకు  రూ. 3.27 లక్షల కోట్లు.
* ప్రణాళికా వ్యయం రూ. 3.36 లక్షల కోట్లు.
* గత సంవత్సరంతో పోలిస్తే 13.3 శాతం పెరిగిన ప్రభుత్వ ఖర్చు.

AP Latest Information

Recruitment Updates

Academic Information

Academic Information

We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.

Title 11

CETS-2016
AP
TS
GOs
AP
TS
GLIs
AP
TS
DEO Websites
AP
TS
Health Cards
AP
TS
PRC GOs
AP
TS
Top