Thursday, January 3, 2019

మారుతున్న కేబుల్ TV ధరలు.. దేనికెంత TRAI New rates / Cost for TV Channels DTH and Cable Operators Details

మారుతున్న కేబుల్ TV ధరలు.. దేనికెంత TRAI New rates / Cost for TV Channels DTH and Cable Operators Details


TRAI New rates for TV Channels DTH and Cable Operators

Telecom Regulatory Authority of India TRAI launched trai-new-rates-cost-for-tv-channels-dth-and-cable-operators-details-download

TELECOM REGULATORY AUTHORITYOF INDIA

Migration to the New Regulatory Framework for Broadcasting & Cable Services

New Delhi,26th December, 2018: Telecom Regulatory Authority of India (TRAIl, in March, 2017, notified the new regulatory framework for Broadcasting and Cable services. The framework comprises of:

1. The Telecommunication (Broadcasting and Cable) Services (Eighth)(Addressable Systems) Tariff Order, 2017

11. The Telecommunication (Broadcasting and Cable) Services Interconnection (Addressable Systems) Regulations, 2017

111. The Telecommunication (Broadcasting and Cable) Services Standards of Quality of Service and Subscriber Protection (Addressable Systems) Regulations, 2017

2. The framework was duly re-notified vide press release no. 71/2018 dated 3rd July 2018 prescribing implementation schedule. Accordingly, all the timelines in the above-mentioned framework commenced from 3rd July 2018. As per the implementation schedule all the service providers were required to complete the preparation for migration to new framework by December 28, 2018.

3. The Authority has noticed that there are messages circulating in the media that there may be a black-out of existing subscribed channels on TV screens after December 29, 2018. The Authority is seized of the matter and hereby advises that all Broadcasters/DPOs/LCOs will ensure that any channel that a consumer is watching today is not discontinued on 1

29.12.2018. Hence, there will be no disruption of TV Services due to implementation of the new regulatory framework. Keeping in view the interest of the subscribers and to enable a smooth transition, the Authority is preparing a detailed Migration Plan for all the existing subscribers. The migration plan will provide ample opportunity to each and every subscriber for making informed choice. This will also enable service providers in carrying out the various activities as stipulated in the new regulatory framework in a time-bound manner.



4. In case any further clarification or the detail of new framework is needed, please feel free to contact following officers of Broadcasting and Cable Services Division of the Authority:



(a) Shri Anil Bhardwaj, Advisor (B&CS)-II,TRAIat 011-23237922 or email at advbcs-2@trai.gov.in; or

(b) Shri Arvind Kumar, Advisor(B&CS)I&III,TRAIat 011-23220209 or email atarvind@gov.in .

మారుతున్న కేబుల్ TV ధరలు.. దేనికెంత TRAI New rates / Cost for TV Channels DTH and Cable Operators Details TRAI New rates for TV Channels DTH and Cable Operators Telecom Regulatory Authority of India TRAI launched trai-new-rates-cost-for-tv-channels-dth-and-cable-operators-details-download/2019/01/trai-new-rates-cost-for-tv-channels-dth-and-cable-operators-details-download.html


చూడాలనుకునే ఛానళ్లకే చెల్లింపు నెలకు రూ.130తో 100 ఉచిత ఛానళ్లు ఆపై ఎంచుకునే వాటికే చెల్లించాలి. ఛానళ్ల వారీగా వేర్వేరు ధరలు



♦ టీవీ ముందు కూర్చుని రిమోట్‌ నొక్కుతూ ఉంటే వందల కొద్దీ ఛానళ్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అందులో ఓ పదీ ఇరవై తప్ప మిగతావన్నీ మనకి పరిచయం లేనివి, ఆసక్తి అంతకన్నా లేనివే వస్తుంటాయి. పరాయి భాషల్లో రకరకాల ఛానళ్లు వస్తుంటాయి. ఒక్కరోజూ నిమిషంపాటు వాటిని చూసే అవసరం రాదు. చాలాభాగం కుటుంబ సభ్యుల్లో ఎవరూ చూడనివే. కొత్త కేబుల్‌ ఛానళ్ల విధానంతో ఈ పద్ధతి మారనుంది. ఇష్టమైన ఛానళ్లకే డబ్బు చెల్లించి వాటిని వీక్షించే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంలో వంద దాకా ఉచిత ఛానళ్లకుతోడు, మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారమవుతాయి. ఇందులో కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం ఉంది.



ఇకపై టెలివిజన్‌ ప్రేక్షకులు తాము ఏయే ఛానళ్లు చూడాలనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే సరికొత్త విధానాన్ని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) అమల్లోకి తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ఈనెల 29 నుంచి (శనివారం) ప్రారంభం కానుంది. దీని ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా చెల్లింపు ఛానళ్ల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. చెల్లింపు ఛానళ్లకు ఒక్కోదానికి ఒక్కోధర ఉంది. ఏ ఛానల్‌ కావాలని కోరుకుంటే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించి చూడొచ్చు. చెల్లింపు టీవీ ఛానళ్లకు గరిష్ఠ చిల్లర ధర ఎంతనేది తెలుసుకునేందుకు ట్రాయ్‌ వెబ్‌సైట్‌ ‌www.trai.gov.in లో పరిశీలించుకోవచ్చు. లేదా ఇప్పటికే పలు ఛానళ్లలో ధరల వివరాల్ని ప్రసారం చేస్తుండటాన్ని గమనించవచ్చు. డిసెంబర్‌ 28 అర్ధరాత్రి తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. దేశవ్యాప్తంగా డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్లు అన్నింటికీ ఈనెల 28వ తేదీయే తుది గడువు. 28వ తేదీతో ఛానళ్ల ప్రసారం ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి వల్ల సగటు వినియోగదారుడు ప్రస్తుతం తాను చెల్లిస్తున్నదానికన్నా రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తుందనేది కేబుల్‌ ఆపరేటర్ల వాదన. అయితే, ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే వందకుపైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృథాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని చూసే అవకాశం దక్కుతుందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.



 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మంది ప్రేక్షకులు తెలుగు ఛానళ్లు మాత్రమే వీక్షిస్తారని, కేబుల్‌ టీవీలో వచ్చే ఇతర ఛానళ్లన్నీ ఇతర భాషలకు, అంశాలకు సంబంధించినవేనని, వాటిని చూసే అవసరం ఎప్పుడో తప్ప రాదని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వృద్ధులు, యుక్తవయస్కులకు అభిరుచుల వారీగా అవసరమైన ఛానళ్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానంలో వందదాకా ఉచిత ఛానళ్లు ప్రసారమవుతూనే, అదనపు చెల్లింపుతో అవసరమైన చెల్లింపు ఛానళ్లు మాత్రమే రావడం వల్ల అనవసరపు ఖర్చుల భారం ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.



మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత

         కొత్త కేబుల్ ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకూ పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలకు తగిన సమయం ఇవ్వడానికి వీలుగా గడువు సడలించారు. తొలుత 2018 డిసెంబర్ 29 నుంచే అమలు చేయాలని నిర్ణయించినా తాజాగా ఫిబ్రవరి 1కి మార్చారు. అయితే బిల్లులు పెరగడంపైనా, కేబుల్ కనెక్షన్ విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులపైనా అనేక మంది సందేహాలున్నాయి.

        కేబుల్ విషయంలో వినియోగదారునికి ఉన్న ముఖ్యమైన హక్కులను ఇక్కడ అందిస్తున్నాం.



గరిష్ఠ ధర రూ.19

           కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకుంటుంటే, సెట్ టాప్ బాక్సును వాయిదా పద్ధతిలో లేదా అద్దె పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. కచ్చితంగా కొనాలన్న నిబంధన లేదు. ఏ పే చానల్ అయినా గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయగలదు. అంత కంటే తక్కువ కూడా చేయవచ్చు. ఎక్కువ చేయకూడదు. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18 శాతం జీఎస్టీ అంటే మొత్తం 153.40 రూపాయలు చెల్లించాలి. ఈ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. సాధారణంగా ఈ అవసరం ఎక్కువ మందికి రాదు. ప్రతీ చానల్ కీ విడివిడి ధర ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపుకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు. ప్రతీ ఆపరేటరూ మీ దగ్గరకు ఒక చానళ్ల లిస్టు తేవాలి. అందులో తాను అందిస్తోన్న చానళ్ల పేర్లు, వాటి ధరలూ ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. ఈ కాపీ మీ దగ్గర ఒకటి, ఆపరేటర్ దగ్గర ఒకటీ ఉండాలి.

       కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా. మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపికను మీ నెలవారీ బిల్లూ - మొత్తం ఉండాలి. ఈ కార్డు ఒక కాపీ వినియోగదారుడి దగ్గరా, ఇంకో కాపీ ఆపరేటర్ దగ్గరా ఉండాలి. అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించలి. ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కానీ దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ కావాలంటే ఇవ్వవచ్చు లేదా తీసుకోవచ్చు. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి.నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల మందే ఆపరేటర్ కి చెప్పాలి. కానీ మళ్లీ రీ కనెక్షన్ కి మూడు నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి. ఈ ఏర్పాట్లు కేబుల్ ఆపరేటర్ లేదా ఎమ్మెస్వో (ఎమ్మెస్వో అంటే చానల్ కీ కేబుల్ ఆపరేటర్ కీ మధ్యలో ఉండే డిస్ట్రిబ్యూటర్ వంటి వారు)లు చేయాలి.

ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్చేస్తోన్న ధరలు (రూ.ల్లో):



1) జెమినీ టీవీ19.00
2) జెమినీ మూవీస్17.00
3) జెమినీ కామెడీ5.00
4) జెమినీ లైఫ్5.00
5) జెమిని మ్యూజిక్4.00
6) ఖుషి టీవీ4.00
7) జెమిని న్యూస్ 0.10

పాకేజ్/బొకే ధర 30.00
ఈటీవీ పాకేజ్ (ధర రూ.ల్లో)
సంఖ్యచానల్ధర (రూ)



1) ఈటీవీ17.00
2) ఈటీవీ ప్లస్7.00
3) ఈటీవీ సినిమా6.00
4) ఈటీవీ అభిరుచి2.00
5) ఈటీవీ లైఫ్1.00
6) ఈటీవీ ఆంధ్రప్రదేశ్1.00
7) ఈటీవీ తెలంగాణ1.00

పాకేజ్/బొకే ధర 24.00
స్టార్ తెలుగు వాల్యూ పాక్ (రూ.ల్లో)

1) మా టీవీ19.00
2) మా మూవీస్10.00
3) మా గోల్డ్2.00
4) మా మ్యూజిక్1.00
5) స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు19.00
6) స్టార్ స్పోర్ట్స్ 26.00
7) స్టార్ స్పోర్ట్స్ 34.00



😎 నేషనల్ జాగ్రఫిక్2.00



9) నాట్ జియో వైల్డ్1.00
10) స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్1.00

📺పాకేజ్/బొకే ధర 39.00

📡జీ ప్రైమ్ పాక్

1) జీ తెలుగు19.00
2) జీ సినిమాలు10.00
3) లివింగ్ ఫుడ్జ్4.00
4) జీ యాక్షన్1.00
5) జీ ఇటిసి1.00
6) వియాన్1.00
7) జీ న్యూస్0.50

😎 జీ హిందుస్తాన్0.50
9) జీ కేరళమ్0.10

📺పాకేజ్/బొకే ధర 20.00

నెలవారీ బిల్లు పాకేజ్ధర  18%  జిఎస్టీ   మొత్తం




  1. 100 ఉచిత చానల్స్130.00  23.40 153.40
  2. జెమినీ బొకే30.00  05.40  35.40
  3. ఈటీవీ బొకే 24.00 4.32  28.32
  4. స్టార్ తెలుగు బొకే 39.00  7.02  46.02
  5. జీ ప్రైమ్ పాక్ బొకే 20.00  3.60  23.60
  6. మొత్తం బిల్లు243.00 43.74 286.74


Click Here toDownload

Notification
Channel wise Cost per Month