Tuesday, December 25, 2018

10వ తరగతి విద్యార్థులకు సూచనలు జీవశాస్త్రంలో

10వ తరగతి విద్యార్థులకు సూచనలు జీవశాస్త్రంలో





10వ తరగతి విద్యార్థులకు సూచనలు జీవశాస్త్రంలో /2018/12/SSC-10th-class-instructions-to-students-in-biology-subject-to-get-good-marks.html



  1. *జీవశాస్త్రంలో పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి విద్యాప్రమాణాలపై అవగాహన పెంచుకోవాలి. వీటి ఆధారంగానే ప్రశ్నలు రూపొందించుకోవాలి. అంతర్గత ప్రశ్నలు, కీలక పదాలను ఆకళింపు చేసుకొని విశ్లేషించగలిగే సామర్థ్యాన్ని పెంచుకోవాలి.*
  2. * *విద్యా ప్రమాణం-1 విషయ అవగాహనలో విశ్లేషణాత్మక ప్రశ్నలు, ఉదాహరణలు ఇచ్చే ప్రశ్నలు, భేదాలను తెలిపే ప్రశ్నలు, పోల్చే ప్రశ్నలు, కారణాలు తెలిపే ప్రశ్నలుంటాయి. విషయ అవగాహనలో దాదాపు 16 మార్కుల ప్రశ్నలు వస్తాయి.*
  3. * *విద్యా ప్రమాణం-2లో ఆలోచించే ప్రశ్నలు, వూహించి సమాధానాలు రాసే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. ఇవి 4 మార్కులకు ఉంటాయి.*
  4. * *విద్యా ప్రమాణం-3లో ప్రయోగ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ప్రతీ ప్రయోగం, కృత్యం, ఉద్దేశం, విధానం పరిశీలనకు అవసరమైన పరికరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఇవి 6 మార్కులకుంటాయి.*
  5. * *విద్యా ప్రమాణం-4లో ఇచ్చిన సమాచారాన్ని పట్టిక రూపంలో లేదా గ్రాఫ్‌ రూపంలో ప్రశ్నల ఆధారంగా విశ్లేషించగలగాలి. ఇందులో ఎక్కువగా సమాచార విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. దాదాపు 6 మార్కుల ప్రశ్నలుంటాయి.*
  6. * *విద్యా ప్రమాణం-5లో భావనను బొమ్మల రూపంలో లేదా ఫ్లోచార్ట్‌గా ప్రదర్శించగలగాలి. ప్రతీ బొమ్మలో భావనను ప్రతిబింబించాలి. ప్రతీ బొమ్మ భాగాలు, విధులపై అవగాహన కలిగిఉండాలి. 4 మార్కులకు ప్రశ్నలిస్తారు.*
  7. * *విద్యా ప్రమాణం-6లో అన్ని నిత్య జీవిత అనుప్రయోక్త పర్యావరణానికి సంబంధించి అన్వయించుకునేలా ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. జీవశాస్త్రంలోని అంశాలు నిత్య జీవితంలో ఎలా వినియోగిస్తామో అవగాహన కలిగి ఉండాలి. 4 మార్కులకు ప్రశ్నలడుగుతారు.*