Income Tax e-Filing Process Step By Step Process @incometaxindiaefiling.gov.in
డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?
డిసెంబర్ 31 లోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే తరువాతి సంవత్సరాలకు మీ నష్టాన్ని కొనసాగించే హక్కును కోల్పోతారు
2019-2020 ఆర్థిక సంవత్సరానికి లేదా 2020-21 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయవలసిన గడువు తేదీ సాధారణంగా జులై 31 కాగా, కరోనా నేపథ్యంలో గడువును డిసెంబర్ 31 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. ఇది పన్ను చెల్లింపుదారుల సాధారణ వర్గానికి, వేతనజీవులకు వర్తిస్తుంది. డిసెంబర్ 31 లోపు మీ ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది? చర్చిద్దాం.
గడువు తేదీనే ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరి తేదీనా?
ప్రజలు సాధారణంగా చివరి తేదీనే గుడువుతేదీ అని అనుకుంటారు. ఇది సరైనది కాదు. ఐటిఆర్ ఫైలింగ్ కోసం రెండు తేదీలు ఉంటాయి. ఒకటి గడువు తేదీ, రెండోది చివరి తేదీ. ఒకవేళ మీరు మీ ఐటీఆర్‌ను నిర్ణీత తేదీలో సమర్పించడంలో విఫలమైతే, చివరి తేదీలోగా ఫైల్ చేయవచ్చు. 2020-2021 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించాల్సిన గడువు తేదీ జూలై 31, 2020 నుంచి డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. చివరి తేదీ 2021 మార్చి 31 వరకు ఉంది. అయితే ఐటీఆర్‌ను గడువు తేదీ తర్వాత సమర్పించకపోతే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మీరు గడువులోపు దాఖలు చేయకపోతే ఏమి జరుగుతుంది?
ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఐటీఆర్‌ను డిసెంబర్ 31, 2020 లోగా సమర్పించడంలో విఫలమైతే, మార్చి 31, 2021 వరకు చేయవచ్చు, కాని తరువాతి సంవత్సరాలకు మీ నష్టాన్ని కొనసాగించేందుకు వీలుండదు. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో మీ వ్యాపార ఆదాయం, మూలధన లాభాలు లేదా గృహ ఆస్తి కింద రెండు లక్షల రూపాయలకు మించి నష్టం ఉంటే తరువాతి సంవత్సరాల్లో దీనిని చూపించేందుకు వీలుంటుంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 31 లోపు రిటర్నులు దాఖలు చేయకపోతే తర్వాత సంవత్సరాల్లో మీ నష్టాన్ని చూపడానికి వీలుండదు.
అదేవిధంగా ఒకవేళ మీరు లేదా మీ తరపున చెల్లించే పన్నులు చెల్లించాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే, చెల్లించిన అదనపు పన్నులకు రీఫండ్ పొందటానికి వీలుండదు. దీంతోపాటు మీరు చెల్లించిన అదనపు పన్నులకు సంబంధించి వడ్డీని పొందలేరు. మరోవైపు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉంటే, ఆలస్యంగా చెల్లించిన కారణంగా దానిపై అదనపు వడ్డీ కూడా వర్తిస్తుంది.
గడువు తేదీ తర్వాత మీ ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం
పై పరిణామాలకు అదనంగా, నిర్ణీత తేదీ తర్వాత ఐటీఆర్ సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఆలస్య రుసుము చెల్లించాలి. సాధారణ పరిస్థితులలో, డిసెంబర్ 31 లోగా ఐటిఆర్ సమర్పించినట్లయితే మీరు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. అయితే ఇప్పుడు గడువు పొడిగించడంతో డిసెంబర్ 31 లోపు ఐటీఆర్ దాఖలు చేస్తే ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే డిసెంబర్ 31 తర్వాత , చివరి తేదా మార్చి 31 2021 వరకు దాఖలు చేస్తే… మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఐదు లక్షలకు మించి ఉంటే మీరు రూ. 10,000 ఆలస్య రుసుము చెల్లించాలి. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షల కన్నా తక్కువ ఉంటే ఆలస్య రుసుము రూ. 1,000 ఉంటుంది.
చివరి తేదీకి కూడా ఐటిఆర్ సమర్పించడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది?
మార్చి 31, 2021 లోగా కూడా మీరు ఐటీఆర్ దాఖలు చేయడంలో విఫలమైతే , ఆదాయపు పన్ను శాఖ కనీస జరిమానాను పన్నులో 50 శాతం వరకు విధించవచ్చు. ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులకు ప్రతిస్పందనగా మీరు చివరికి ఐటీఆర్ దాఖలు చేసిన తేదీ వరకు వడ్డీ భారం కూడా పడుతుంది.
మీ ఐటిఆర్ దాఖలు చేయకపోతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్ట ప్రకారం కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధిస్తుంది. ఐటిఆర్ దాఖలు చేయడంలో విఫలమైన ప్రతి సందర్భంలోనూ ఇలా జరగకపోవచ్చు. చెల్లించాల్సిన పన్ను మొత్తం రూ. 10,000 దాటితేనే ఇటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇంకా చెల్లించకపోతే ఇప్పటికైనా ఐటీఆర్ దాఖలు చేసేందుకు సిద్ధమవండి.
Income Tax e-Filing Process Step By Step Process @incometaxindiaefiling.gov.in
Income Tax E-Filing Step By Step Process
- Income Sources Details ( Salary and other Sources )
- Various Deductions Details ( 80C LIC PPF ELSS, Principal of House Interest )
- Bank Account Details
- Taxes Paid Details TDS Deducted etc
- Income Sources Details ( Salary and other Sources )
- Various Deductions Details ( 80C LIC PPF ELSS, Principal of House Interest )
- Bank Account Details
- Taxes Paid Details TDS Deducted etc
- ముందుగా form16 ను సిద్ధంగా ఉంచుకోవాలి.https://incometaxindiaefiling.gov.in/home
- వెబ్సైట్ క్లిక్ చేయండి..
- నోట్: financial year 2018-19 కు assessment year 2019-20 అవుతుంది.
- register yourself క్లిక్ చేసి యూజర్ ఐడి గా పాన్ కార్డ్ నెంబర్ , పేరు, చిరునామా, మొదలైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.. ఈమెయిల్ otp, మొబైల్ otp ఎంటర్ చేయాల్సి వుంటుంది.
- తర్వాత లాగిన్ కావాలి. Dashboard లో filling of income tax return ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు assesment year, ఫారం ITR-1, సబ్మిషన్ మోడ్ prepare and submit సెలెక్ట్ చేయాలి. తర్వాత aadhar OTP ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని continue క్లిక్ చేయాలి
- నోట్: ఆధార్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ అయి లేకపోతే వారు, i don't want e-verify ఆప్షన్ ఎంటర్ చేసుకొని, పూర్తిచేసిన ఫారం ను బెంగళూర్ అడ్రస్ కు పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది..
- ఆధార్ otp ద్వారా అయితే ఎవరికీ ఫారం పంపాల్సిన అవసరం లేదు
- instructions పేజీలో చదివి next క్లిక్ చేయాలి,
- Part A -General Information పేజీ లో వ్యక్తిగత వివరాలలో ఏమైనా తేడా ఉంటే సరి చేసుకొని తర్వాత save draft క్లిక్ చేయాలి..తర్వాత next చేయాలి.
- income details పేజీ లో ఆదాయం వివరాలు, save draft క్లిక్ చేసి next క్లిక్ చేయాలి.
- tax details పేజీలో డిదక్షన్ వివరాలు సెక్షన్ వారీగా నమోదు చేయాలి
- తర్వాత taxes paid and verification పేజీలో TDS వివరాలు , బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.
- 80G పేజీలో ఏదైనా విరాళాలు ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే వదిలేయాలి.
- preview and submit ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీ e-ఫైలింగ్ పూర్తి అయినట్టు మెసేజ్ వస్తుంది. dashboard లో view returns ఆప్షన్ ద్వారా మన ITR FORM మరియు ACKNOWLEDGEMENT ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌లో అందుబాటులో ఏడు ఐటీ రిటర్న్స్ దరఖాస్తు ఫారాలు
- ఆదాయం పన్ను చెల్లింపులకు సంబంధించి మొత్తం ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్త్ఫురాలను ఈ-ఫైలింగ్ ద్వారా దాఖలు చేసే ప్రక్రియను ఆదాయం పన్ను శాఖ శనివారం ప్రారంభించింది.
- ఈ ఏడు ఐటి రిటర్న్స్ దరఖాస్తు ఫారాలను ఐటి శాఖ నెల రోజుల క్రితం నోటిఫై చేసిం ది. ఈ ఏడాదికి సంబంధించి కొత్త ఆదాయం పన్నురిటర్న్స్ ఫారాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించింది.
- పన్ను చెల్లింపుదారులు ఈ ఏడాది జూలై 31వ తేదీలోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎలక్రానిక్ విధానంలో ఈ ఫారాలు ఆదాయ యం పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
- కొత్త దరఖాస్తు ఫారాల్లో వేతన జీవులు వేతనం బ్రేకప్ వివరాలు, వర్తకులు జిఎస్‌టి నంబర్, టర్నోవర్‌ను పొం దుపరచాల్సి ఉంటుంది.
- రూ. 50 లక్షల వరకు వేతనం పొందే వారు సహజ్ ఐటిఆర్-1 ద్వారా ఆదాయం వివరాలను పొందుపరచాల్సి ఉం టుంది. ఐటిఆర్-2ను అవిభక్త హిం దూ కుటుంబాలకు చెందిన ఆదా యంపన్ను చెల్లింపుదారులు దాఖలు చేయాలి. వ్యక్తులు, వృత్తులు, వాణి జ్యం అకౌంట్ల పరిధిలోనికి వచ్చే హిందూ అవిభక్తకుటుంబాల పన్ను చెల్లింపుదారులు ఐటిఆర్ 3, ఐటిఆర్ 4 ద్వారా పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.
- కొత్త దరఖాస్త్ఫురాలను హేతుబద్ధీకరించనట్లు సిబిడిటి పేర్కొంది. కొత్త ఫారాల్లో 12 డిజిట్ల ఆదార్ నంబర్ లేదా 28 డిజిట్ల ఆధార్ నమోదు నంబర్‌ను ఆదాయం పన్ను చెల్లింపుదార్లు పేర్కొనాల్సి ఉంటుంది.
For Assessment Year 2019-20 E filing complete Process in Telugu with Live e -Filing Video Demo click below link
Click Here for