Reliance Foundation Scholarship 2024-25 Invites Applications for UG & PG Students Apply Online
Applications invited from undergraduate and postgraduate students enrolled in the first year of their respective programme in any location across India
Reliance Foundation Scholarship 2024-25 : The Reliance Foundation Scholarship seek to foster brilliance and empower young people to play a leading role in India's growth story. Scholarships assists students achieve their academic and professional goals by providing comprehensive support and a large financial grant, First-year under graduate and post graduates students studying full-time regular degree courses at Institutes across India are eligible to apply.
The Reliance Foundation Undergraduate Scholarships aim to help talented students become successful professionals and contribute India's socio-economic growth. 5000 students will get merit based awards for their under graduate, college education, allow them to continue their studies without financial stress.5000 merit-based undergraduate scholarships up to Rs. 2 lakhs each, and 100 postgraduate scholarships for excellence up to Rs. 6 lakhs each. The Reliance Foundation Scholarship includes a robust capacity-building program throughout the scholar's journey.
Selected scholars will receive a stipend of up to 2 lakhs for the duration of their degree study. In addition to the scholarship, the Reliance Foundation Undergraduate Scholarships will allow scholars to join a thriving alumni network and an enabling support system, which will have a long-term impact on their lives and career paths.
The Reliance Foundation is committed to enabling students to pursue their education without financial hardship. The Reliance Foundation seeks applications from qualified applicants interested in pursuing undergraduate degrees in any field. The application process for the Reliance Foundation Scholarship for Undergraduates typically finishes in October.
Eligibility Criteria :
You must fulfill the following eligibility criteria in order to apply.
Application Last Date : 06.10.2024
Click Here for Official Website
రిలయెన్స్ ఫౌండేషన్ ఆహ్వానం
స్కాలర్‌షిప్పులకు సిద్ధమేనా?
మీరు ఏదైనా యూజీ లేదా పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక నేపథ్యం చదువుకు అవరోధమవుతోందా? అయితే మీ కోసమే రిలయెన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా చేయడానికి గత రెండేళ్ల నుంచి ఈ సంస్థ ఏటా 5100 ప్రోత్సాహకాలు అందిస్తోంది. పరీక్షలో ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, ఇంటర్వ్యూలతో అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు, పరీక్షల నిమిత్తం ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు.
పదేళ్లలో యాభై వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించాలని రిలయన్స్ ఫౌండేషన్ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా.. 2022, 2023ల్లో ఏడాదికి ఐదు వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పించింది. అలాగే ఏడాదికి వంద మంది చొప్పున నిర్దేశిత పీజీ కోర్సుల్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ ఈ స్కాలర్‌షిప్పు అందిస్తోంది. ఈ ఏడాది 2024-2025 విద్యా సంవత్సరానికి మరో 5000 మంది యూజీ, వంద మంది పీజీలకు అవకాశమివ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకు ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్ కమ్ మీన్స్ ప్రాతిపదికన వీటిని అందిస్తున్నారు.
ఇలా అవకాశం వచ్చినవారు యూజీ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. పీజీ వాళ్లైతే రూ.6 లక్షల వరకు దక్కుతుంది. స్కాలర్‌షిప్పును ట్యూషన్/హాస్టల్ ఫీజు, ల్యాప్‌టాప్, అకడమిక్ పుస్తకాలు, కోర్సుల కోసం వినియోగించుకోవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరమైన సహకారమూ లభిస్తుంది. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నగదు ప్రోత్సాహకంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, వర్క్‌షాపులు, అలమ్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవన్నీ అదనంగా లభిస్తాయి. ఇతర స్కాలర్‌షిప్పులు పొందుతున్నవారూ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా?
యూజీ లేదా పీజీ ప్రథమ ఏడాది విద్యార్థులు రిలయెన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్టు సైజు ఫొటో, అడ్రస్ ప్రూఫ్, పది, ఇంటర్ మార్కుల పత్రాలు, ప్రస్తుత కళాశాల/సంస్థ నుంచి బోనఫైడ్ సర్టిఫికెట్, కుటుంబ వార్షికాదాయ వివరాలు, దివ్యాంగులైతే సంబంధిత రుజువు పత్రాలు ఇవన్నీ అప్‌లోడ్ చేయాలి. విజయవంతంగా దరఖాస్తు పూర్తిచేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహిస్తారో సమాచారం అందుతుంది.
అర్హతలేమిటి?
ఏదైనా యూజీ కోర్సు మొదటి సంవత్సరం రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆన్‌లైన్, దూరవిద్య, రిమోట్ విధానంలో
చదువుతున్నవారికి, ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సుల వారికి అవకాశం లేదు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.
ఇంటర్/ప్లస్ 2లో 60 శాతం మార్కులు ఉండాలి. పది తర్వాత డిప్లొమా పూర్తిచేసుకున్నవారికి అవకాశం లేదు.
పీజీ స్థాయిలో..
దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు. ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్‌మెంట్... తదితర ఖర్చుల కోసం చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం ఈ స్కాలర్‌షిప్పులో భాగం.
వివరాల నమోదు
రిలయన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి అకడమిక్ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేది కావాలి. రెండు ఎస్సేల్లో.. ఒకటి పర్సనల్ స్టేట్‌మెంట్, రెండోది స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ రాసివ్వాలి. వీరికి ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షనూ నిర్వహిస్తారు. గంట వ్యవధిలో 60 మల్టిపుల్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీల నుంచి వీటిని అడుగుతారు (యూజీ పరీక్ష మాదిరిగానే దీన్నీ నిర్వహిస్తారు). ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలనలో నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. నిపుణుల బృందం వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో మేటి వంద మందికి స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
అర్హత
పీజీ తొలి సంవత్సరం కోర్సు చదువుతుండాలి. గేట్ స్కోరు 550-1000 మధ్య ఉండాలి. ఈ పరీక్ష రాయనివాళ్లైతే యూజీలో 7.5 సీజీపీఏ అవసరం. (గేట్‌లో 550 కంటే తక్కువ స్కోరు పొంది, యూజీలో 7.5 కంటే ఎక్కువ సీజీపీఏ ఉన్నప్పటికీ అనర్హులే)
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 6 (యూజీ, పీజీ రెండింటికీ)
వెబ్‌సైట్: https://scholarships.reliancefoundation.org/RF_Scholarship.aspx
యూజీ పరీక్ష
ఇది రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతో కంప్యూటర్/ల్యాప్‌టాప్ ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఈ ఆన్‌లైన్ పరీక్ష రాసుకోవచ్చు లేనివారు ఏదైనా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి పూర్తిచేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్ ఆన్‌లో ఉంచాలి. వాటిద్వారా పర్యవేక్షణ ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నలకు ఒక మార్కు. వెర్బల్, అనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి. ప్రతి సెక్షన్‌నూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్ ఎబిలిటీలో.. స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వస్తాయి.
అనలిటిక్ అండ్ లాజికల్ ఎబిలిటీలో.. సమస్యనువిశ్లేషించడం, కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్ సీక్వెన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ నుంచి అడుగుతారు. పరీక్షకు వారం మందు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులో ఉంచుతారు. ఆప్టిట్యూడ్ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.