Kakatiya University Distance Education Degree, PG Admissions Application Deadline Extension
Kakatiya University Admissions 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు - దరఖాస్తుల గడువు పొడిగింపు
కాకతీయ వర్శటీ దూర విద్యలో ప్రవేశాలు :
Telangana / Kakatiya University Distance Education 2024 :
వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ దూర విద్యలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది, దూర విద్యలో అడ్మిషన్లకు(డిగ్రీ, పీజీ) సంబంధించి కాకతీయ యూనివర్శిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం దరఖాస్తుల గడువు ముగియటంతో అధికారుల కీలక నిర్ణయం తీసుకున్నారు, దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించారు.. ఇందులో భాగంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో చేరవచ్చు.అర్హులైన అభ్యర్థులు http://sdlceku.co.in/ వెబ్ సైట్ లోకి అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యూకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో పాటు మరికొన్ని కోర్సులు ఉన్నాయి.
Kakatiya University distance education admission process in Warangal is going on, Kakatiya University has given important update regarding distance education admissions (Degree, PG). A key decision was taken by the authorities as the deadline for applications expired as per earlier, It has been announced that the deadline for applications has been extended till September 30. Eligible candidates can apply till 30th September. . As part of this, candidates can join degree, PG as well as diploma courses. Officials suggest that eligible candidates should apply through http://sdlceku.co.in/ website.
Application can be processed by visiting the website of Center for Distance and Online Education, Kakatiya University. Admissions in UG/PG/Diploma/Certificate courses through distance education for the academic year 2024-25. BA, BCom, BSC, BLIC courses are available in the degree. In PG, there are Telugu, English, Mathematics, Physics, Chemistry, Sociology, Economics, Political Science, Public Administration, Zoology and some other courses.
కేయూ దూర విద్యలో ప్రవేశాలు - ముఖ్య వివరాలు:
ప్రవేశాల ప్రకటన - స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ, వరంగల్.
యూజీ కోర్సులు: బీకాం(జనరల్)/ బీకాం (కంప్యూటర్స్)/ బీబీఏ/ బీఎస్సీ(మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్/ కంప్యూటర్ సైన్స్)/ BLIsc (వ్యవధి: మూడేళ్లు.)
పీజీ కోర్సులు - ఎంఏ (ఇంగ్లిష్/ హిందీ/ సంస్కృతం/ చరిత్ర/ ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ ఆర్‌డీ/ సోషియాలజీ), ఎంఏ హెచ్‌ఆర్‌ఎం/ ఎంకాం/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంఏ జేఎంసీ/ ఎంఎస్సీ (బోటనీ/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్). (వ్యవధి: )రెండేళ్లు.
డిప్లొమా కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్/ రిటైల్ మార్కెటింగ్/ ట్యాలీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్/ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్/ పీడీ అండ్ సి స్కిల్స్ (వ్యవధి: ఒక ఏడాది)
దరఖాస్తుకు చివరి తేదీ: 30-09-2024.
దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/UG-PG-Notification.php
యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి.
అధికారిక వెబ్ సైట్ - http://sdlceku.co.in/index.php
మెయిల్ - info@sdlceku.co.in
సంప్రదించాల్సిన ఫొన్ నెంబర్లు - 0870 - 2461480, 0870 -2461490
డిగ్రీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ - http://sdlceku.co.in/pdf/UG-2024.pdf
పీజీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ -http://sdlceku.co.in/pdf/PG-2024.pdf
అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో ప్రవేశాలు:
మరోవైపు 2024- 25 విద్యా సంవత్సరానికి సంబంధించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇటీవలే తుది గడువును కూడా పొడిగించారు. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అభ్యర్థులు డిగ్రీ, పీజీతో పాటు డిప్లోమా కోర్సుల్లో చేరవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు https://online.braou.ac.in / వెబ్ సైట్ లోకి వెళ్లి నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు, ట్యూషన్ ఫీజు వివరాలు కూడా వెబ్ సైట్ లో పొందుపరిచారు. మీ విద్యా అర్హతలు బట్టి కోర్సులను ఎంచుకోవచ్చు.
Admissions in Ambedkar Open University:
On the other hand, the admissions in Dr. BR Ambedkar Open University for the academic year 2024-25 are going on. Recently the deadline has also been extended. Eligible candidates can apply till 30th September. As part of this, candidates can join degree, PG and diploma courses.
Eligible candidates can go to https://online.braou.ac.in/ website and apply directly. Details of courses and tuition fees are also included in the website. You can choose courses depending on your educational qualifications.
Important Links :
Click Below Links
Official Website B.R.Ambedkar University
Registration for admissions in PG courses
Registration for admissions in degree courses
Registration for admission to diploma courses