Have you forgotten your Aadhaar linked mobile number? Then Know Here
ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ మర్చిపోయారా..?
ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన నంబర్ ఏదో తెలియట్లేదా? అయితే ఈ కథనం మీ కోసమే..
ఆధార్.. ఆధార్.. ఆధార్.. నిత్యం అవసరమయ్యే డాక్యుమెంట్లలో ఎక్కువగా వినిపించే పదం ఇదే. రోజు వారీ జీవితంలో ఆధార్ కార్డ్ కీలకంగా మారిపోయింది. ఇలాంటి ముఖ్యమైన ఆధార్‌కార్డ్ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో ఒక మొబైల్ నంబర్ లింక్ చేసుంటారు. అయితే కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయడంతోనో లేదా లింక్ చేసే సమయంలో ఎవరో ఒకరిది అంటూ వేరే మొబైల్ నంబర్ ఇచ్చేస్తూ ఉంటాం. దీంతో ఓటీపీ తెలుసుకోవాంటే సదరు నంబర్ తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. అసలు ఏ నంబర్ ఇచ్చాను? ఎవరిది ఇచ్చాను? అని ప్రశ్నలతో సతమతమవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఉడాయ్ ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో ఏ నంబర్‌కు మీ ఆధార్- లింక్డ్ మొబైల్ నంబర్ తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో ఇలా..
♦️దీని కోసం ముందుగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
♦️స్క్రీన్‌పై కనిపించే ‘My Aadhaar’ వెబ్‌సైట్‌కు వెళ్లి ‘Aadhaar Services’ని ఎంచుకొని ‘Verify Email/Mobile Number’పై క్లిక్ చేయాలి.
♦️మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేసి ‘Enter’ పై క్లిక్ చేయాలి.
♦️ఒక వేళ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్‌కు లింక్ అయి ఉంటే నంబర్ లింక్ అయినట్లు సందేశం వస్తుంది. ఒక వేళ కాకపోతే లింక్ కాలేదని స్క్రీన్‌పైనే డిస్‌ప్లే అవుతుంది. ఇలా మీ వద్ద ఉన్న మొబైల్ నంబర్‌లో ఏ దానికి ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉండే తెలుసుకోవచ్చు.
Click Here for