TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Saturday, June 3, 2023

How to apply for lost aadhar card online

 మ‌న ఆధార్ కార్డు పోగొట్టుకుపోయిన‌ప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు ఎలా పొందాల‌నే ప్ర‌క్రియ‌ను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం

How to apply for lost aadhar card online

 మనం పోగొట్టుకున్న ఆధార్ కార్డు ఆన్‌లైన్‌లో  అప్లై చేయ‌డం ఎలా! 

Aadhaar Card డౌన్‌లోడ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌:

1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్:

 ( https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html )

2. UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.

3. మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.

4. ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

5. అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.

6. లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీకు కార్డు ఓపెన్ అవుతుంది.

7. అక్క‌డే డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

8. అయితే, ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. డౌన్‌లోడ్ అయిన ఆధార్ ఫైల్ ను మీరు ఓపెన్ చేయ‌డానికి పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది.

9. ఆ పాస్‌వ‌ర్డ్‌ ఏంటంటే.. మీ పేరులోని నాలుగు అక్ష‌రాలు, మీరు పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు టైప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది.

ఉదాహ‌ర‌ణ‌కు.. మీ పేరు AVINASH, పుట్టిన సంవ‌త్స‌రం 1990 అనుకుంటే, పాస్ వ‌ర్డ్ వ‌చ్చేసి.. పేరులో మొద‌టి 4 అక్ష‌రాలు.. పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు క‌లిపి AVIN1990 అని టైప్ చేయాలి. ఇక మీ ఆధార్ మీకు క‌నిపిస్తుంది.

* ఇలా ఈ ప‌ద్ద‌తిని ఉప‌యోగించి ఎవ‌రైనా త‌మ ఆధార్‌కార్డు పోతే.. కొత్త‌ది మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.