Monday, May 15, 2023

10 BENEFITS OF RAW MANGOES

పచ్చి మామిడి యొక్క ప్రయోజనాలు


ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా వేస‌వి మండే ఎండ‌ల‌ను మోసుకుని వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే వేస‌వి తాపానికి ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల వైపు చూస్తున్నారు. ఇక వేస‌విలో మ‌న‌కు ముందుగా ల‌భించేవి మామిడికాయ‌లు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్క‌డ చూసినా ఇవే క‌నిపిస్తాయి. ప‌సుపు, ఎరుపు రంగుల్లో ఉండే అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడి పండ్లు మ‌న‌కు ల‌భిస్తుంటాయి. అయితే కేవ‌లం మామిడి పండ్లే కాదు.. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిని తింటే ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వేస‌వి కాలంలో మ‌న శ‌రీరం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ప‌చ్చి మామిడి కాయ జ్యూస్ కాపాడుతుంది. మ‌న శ‌రీరం సోడియం క్లోరైడ్ , ఐర‌న్ ను కోల్పోకుండా ఇది స‌హాయ‌ప‌డుతుంది. వేప‌వి కాలంలో ఎండ దెబ్బ వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. వ్యాయామం చేసిన త‌రువాత మంచి రిఫ్రెష్‌మెంట్ డ్రింక్‌లా ప‌నిచేస్తుంది. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్‌ను తాగితే శరీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్‌, ఎండ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉంటారు. వేస‌వి తాపం త‌గ్గుతుంది.

2. ప‌చ్చి మామిడి కాయ‌ల్లో విట‌మిన్ సి, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

3. ప‌చ్చి మామిడి కాయ‌ల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గిస్తుంది. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

4. ప‌చ్చి మామిడికాయ‌ల్లో మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌తోపాటు మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తుంది. క‌నుక హార్ట్ ఎటాక్‌లు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

5. ప‌చ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి. క‌ణాలను సుర‌క్షితంగా ఉంచుతాయి.

6. ప‌చ్చి మామిడి కాయ‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. చిగుళ్ల నుంచి కారే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. అలాగే ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

7. ప‌చ్చి మామిడి కాయ‌ల్లో లుటీన్‌, జియాజాంతిన్ అనబ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క‌ళ్ల‌లోని రెటీనాను సంర‌క్షిస్తాయి. దీంతోపాటు కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. దీంతో క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

8. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో బ్ల‌డ్ క్లాట్స్ ఏర్ప‌డ‌కుండా నిరోధించ వ‌చ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. అలాగే చ‌ర్మానికి, జుట్టుకు మేలు చేసే పోష‌కాలు కూడా వీటిల్లో ఉంటాయి. దీని వ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా మారి చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.

9. ప‌చ్చి మామిడి కాయల‌ను తిన‌డం వ‌ల్ల లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. లివ‌ర్ లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గి లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లోని కొవ్వు క‌రుగుతుంది.

10. ప‌చ్చి మామిడికాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును తగ్గించ‌గ‌ల‌దు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునేవారు దీన్ని తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది.*BENEFITS OF RAW MANGOES

Like every year, this time too summer has brought scorching sun. It is in this order that the people are suffering from the summer heat. Looking for ways to cool down the body. Mangoes are the first thing we get in summer. Everywhere we look in this season we see these. We have many varieties of yellow and red mangoes available. But not just mangoes. Many people also like to eat raw mangoes. Eating raw mangoes also has many benefits. Now let's know the health benefits of eating these.

1. Raw mango juice protects our body from dehydration during summer. It helps our body not lose sodium chloride and iron. Reduces problems caused by sunstroke during hot season. Acts as a good post-workout refreshment drink. If you drink raw mango juice, the fluids in the body will be balanced. Prevents dehydration and sunburn. Summer heat will decrease.

2. Raw mangoes are rich in vitamin C, E and antioxidants. Therefore, if you eat them, your immune system will increase. Get relief from seasonal cough, cold and fever problems. Diseases and infections can be prevented.

3. Raw mangoes are rich in fiber. It reduces digestive problems. Problems like indigestion, constipation and gas are reduced.

4. Raw mangoes are rich in the antioxidant mangiferin and magnesium. It protects heart health. So heart attacks can be kept healthy.

5. Raw mangoes are rich in antioxidants called polyphenols. These prevent cancer. Reduces swelling. Keeps cells safe.

6. Raw mangoes are rich in vitamin C. It reduces teeth and gum problems. Bleeding from the gums is reduced. Also you can get out of anemia. Blood is well prepared.

7. Raw mangoes contain antioxidants called lutein and zeaxanthin. They protect the retina of the eyes. It also improves eyesight. This keeps the eyes healthy.

8. Eating raw mangoes can prevent the formation of blood clots in the body. This prevents heart attacks. They also contain nutrients that are good for skin and hair. This makes the skin brighter and reduces skin problems. Hair grows thick and strong.

9. Eating raw mangoes reduces liver problems. The wastes in the liver are eliminated. Cholesterol levels in the body are reduced and the liver is healthy. Improves liver function. The fat in the liver melts.

10. The fiber in raw mangoes can reduce excess weight. So those who want to lose weight can eat it very well.


Also read tips to stay healthy in summer