TSPSC GROUP-1 HALL TICKET DOWNLOAD
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 16, 2022న నిర్వహించే గ్రూప్–1 సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు సర్వం సిద్ధం చేసింది. రేపటి నుంచి (అక్టోబర్ 09) నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.కింది లింక్ ఓపెన్ చేసి హాల్‌టికెట్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
https://websitenew.tspsc.gov.in/searchHallTicket
అక్టోబర్ 16 ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలకు అబ్టెక్టివ్టైపులో పరీక్ష నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్–1 లో 503 పోస్టుల కోసం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా..
ఒక్కో పోస్టుకు 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో అర్హత సాధించిన వారికి జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్–1లో ఇంటర్వ్యూలను ఎత్తివేసిన విషయం తెలిసిందే..
Click Here to Download