Tuesday, February 16, 2021

Online TS Medical Reimbursement Proposal Submission & Medical Bill Claim Process Details

 TS Medical Reimbursement Proposal Submission Online schooledu.telangana.gov.in

MEDICAL REMBURESEMENT (మెడికల్ రీయంబర్స్మెంట్)
 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును.
( G.O.Ms.No.74 తేది:15-03-2005 )
 ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును.
( G.O.Ms.No.397 తేది:13-11-2008 )
 కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
 ( G.O.Ms.No.346 dt: 17.12.2011 )
 ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.

Online TS Medical Reimbursement Proposal Submission & Medical Bill Claim Process Details
( G.O.Ms.No.68 తేది:28-03-2011 )
 కీమోథేరపీ, రేడియోథేరపీ,డయాలసిస్,క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
( G.O.Ms.No.105 dt: 9.4.2007 ) 
 రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు  మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
(G.O.Ms.No.175 తేది:29-05-1997)
40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.  గరిష్టంగా రూ . 3000/- చెల్లిస్తారు.
( G.O.Ms.No.105 తేది:09-04-2007 )
 మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
( DSE Rc.No.350/D2-4/2008 తేది:15-04-2008 )
కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
( G.O.Ms.No.87 తేది:28-02-2004 )
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ లకు జీవిత కాలంలో ఒకే వ్యాధికి 3 పర్యాయాల వరకు రీయింబర్స్మెంట్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును.
( G.O.Ms.No.601 M&H Dt:15-10-2003 )
 నిర్ణీత పదవీ విరమణ వయస్సు పూర్తి చేసి(సూపరాన్యుయేషన్) పై రిటైరైన వారికి మాత్రమే రీయింబర్స్మంట్ సౌకర్యం వర్తింపచేసారు.నిర్బంధ పదవీ విరమణ,వాలంటరీ రిటైర్మెంట్,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైర్మెంట్ పొందిన వారికి ఈ సౌకర్యం వర్తించదు.
(G.O.Ms.No.401 Dt:25-06-1991)
 హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది  నుండి 6 నెలలలోపు, చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.
 రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No. *8878/D2-4/09 తేది:02-09-2009* ద్వారా వివరించారు.
 రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లపై MEO/HM తప్పక సంతకం చేయాలి .

Medical Reimbursement proposals 0nline process for teachers.

(  మెడికల్ రేయింబర్సుమెంట్(MR)ఆన్లైన్ విధానం  )
  వైద్య ఖర్చులు 50,000రూ పైబడిన టీచర్లు అందరూ విద్యాశాఖ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 ముందుగా మన MR కి సంబంధించిన డిశ్చార్జి సమ్మరీ, ఎమర్జెన్సీ సర్టిఫికెట్, essentiality సర్టిఫికెట్, డిపెండెంట్ సర్టిఫికెట్ పిడిఎఫ్ ఫార్మాట్ లో 6kb నుండి 1mb సైజు లోపు ఉండేటట్లు స్కాన్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.
 ఇపుడు  https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి.
 Online Service   పై క్లిక్ చేయగానే Medical Reimbursement ( MR ) కనబడుతుంది.దీనిపై క్లిక్ చేయాలి.
వెంటనే స్క్రీన్ పై
 Online Services :
 Medical Reimbursement(Service Employee) Claim Form
 MR - Check Claim Status
 MR - Know Your Application Number
 Medical Reimbursement(Retired Employee) Claim Form.  కనబడుతాయి .
@  Medical Reimbursement(Service Employee) Claim Form పై క్లిక్ చేయగానే Enter Treasury Id వస్తుంది .
@  Treasury Id Enter చేయగానే మన Registered మొబైల్ నెంబర్ కి OTP ( One Time Password ) వస్తుంది .
@  OTP Enter చేయగానే MEDICAL REIMBURSEMENT - CLAIM REGISTRATION FORM వస్తుంది
@ ఇందులో మన School Details & Personal Details ఢీ  ఫాల్ట్ గా ఉంటాయి.
@  మరియు క్లెయిమ్ ఫారం లో అడ్రస్, పేషెంట్ వివరాలు, హాస్పిటల్ వివరాలు పూర్తిచేయాలి.
@  Documents ( proof in support of the claim) లో Emergency, Essentiality, Discharge or Death Summary, Appendix II Form, Non-drawl declaration attested by DDO, IP Details, Abstract of Bills Genuinity Certificate, Hospital Recognition copy మరియు Other Documents లను scan చేసి విడివిడిగా  6kb  నుండి  1 mb మధ్య లోని సైజు వరకు pdf format లో కి మార్చవలెను . తదనంతరం ప్రతి pdf ఫైల్ ను Individual గా   అప్లోడ్ చేయాలి.
@  అనంతరం సబ్మిట్ నొక్కాలి.వెంటనే స్క్రీన్ పై successfully అని వస్తుంది.
@  దీనిని ప్రింట్ తీసుకొని దానిని DDO ద్వారా Medical Reimbursement  క్లెయిమ్ దరఖాస్తు కి జతచేసి DSE కి 3 sets పంపాలి.
DSE - Address:
The Director of School Education, Near Telephone Bhavan, Saifabad, Hyderabad - 500004. ( Through Registered Post or Speed Post.)
 Required Certificates (we have take these certificates from the Hospitals )
Genuinity certificate
Referral GO copy from the hospital
Emergency certificate
Essentiality certificate
Discharge Summary
Final bill
Medicine bills
Consolidated bills
Proceeding order copy given by DME to the particular hospital
User Manual for Online Medical Reimbursement Submission
Medical Reimbursement Clain Registration Form