Monday, September 14, 2020

Government of Andhra Pradesh has Launched the apcareerportal.in for Students to Provide Information on Education, Job Creation and Various Courses


Government of Andhra Pradesh has Launched the apcareerportal.in for Students to Provide Information on Education, Job Creation and Various Courses

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ ను అందుబాటులోకి తెచ్చింది ప్రతి విద్యార్థి వివరాలు ఇందులో నమోదు చేసుకోండి

విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల వివరాల్ని తెలిపేందుకు ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Government Andhra Pradesh has launched the apcareerportal.in for students made available now. It focuses on the issue of providing job and employment opportunities to the youth. As part of this ... CM Jaganmohan Reddy has made the AP Career Portal.in (apcareerportal.in) available to students to inform them about education, job creation and courses. APSCERT, UNICEF, Osman Foundation have worked hard to bring this portal.

Through this portal, students can find out the details of the employment courses to be selected in the future along with the studies of the secondary level students studying from 9th to 12th class in Andhra Pradesh. It will benefit 20 lakh students in the state. Enter the details of each student in this portal.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ ను. అందుబాటులోకి తెచ్చింది ఇప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా... ఏపీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ కల్పన, కోర్సుల వివరాల్ని తెలిపేందుకు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ (apcareerportal.in)ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చారు. ఏపీ ఎస్ సీ  ఈ ఆర్  టి, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ ఈ పోర్టల్ వచ్చేందుకు కృషి చేశాయి.

            

విద్యార్థులు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న సెకెండరీ స్థాయి  చదువులతో పాటు భవిష్యత్‌లో ఎంచుకోబోయే ఉపాధి కోర్సులను, వాటి ద్వారా పొందే ఉద్యోగాల వివరాల్ని ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు పూర్తి వివరాలు తెలుసు కోగలరు. ఇది రాష్ట్రంలోని 20 లక్షల మంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

విద్యార్థులు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
  1. ముందుగా ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ లో విద్యార్థి తమ చైల్డ్‌.ఇన్‌ఫో ద్వారా రిజిస్టర్‌ కావాల్సి ఉంటుంది.
  2. పాస్‌వర్డ్‌గా 123456 ఉంటుంది. అది ఎంటర్ చెయ్యాలి.
  3. మరియు 9 భాషల్లో మీ వివరాల్ని నమోదు చేసుకోవచ్చు.
  4. విద్యార్థి తనకు నచ్చిన భాషను ఎంచుకొని లాగిన్‌ అవ్వాలి.- డాష్‌కోడ్‌లో... మై కెరీర్‌లో... డెమోలో ప్రొఫైల్‌ నింపాలి.
  5. మీ చదువు, కుటుంబ వివరాలు, ఫోన్‌ నంబర్‌తో సహా ఎంటర్‌ చెయ్యాలి.
  6. మొత్తం వివరాలన్నీ ఇస్తే... నమోదు పూర్తైనట్లు లెక్క.

ఇందులో ఏయే కోర్సులు ఉంటాయి తెలుసుకోండి :

ఆంధ్రప్రదేశ్‌లోని కాలేజీల నుంచి స్కాలర్ షిప్‌లు పొందే వీలుంది. ఇందులో 550 క్లస్టర్లతో ఉన్న 672 రకాల కోర్సులు, ఉద్యోగాలు, ఉపాధి వివరాలు ఉంటాయి. వ్యవసాయం/అందం/ఆరోగ్యం/వృత్తి నైపుణ్యం/64 కళలకు సంబంధించిన కోర్సులు/బయోలాజికల్, ఆర్టిఫీషియల్, ఎనర్జీ, మెరైన్, సోలార్‌ రబ్బర్ వంటి ఇంజినీరింగ్‌ కోర్సుల వివరాలుంటాయి. ఒక్కో కోర్సుకు అయ్యే ఖర్చు, కోర్సు తర్వాత కెరీర్, జీతాలు వంటి వివరాలు ఉంటాయి.  (సంతూర్, గ్లో అండ్‌ లవ్లీ, రమణ్‌కుమార్‌ ముంజల్, ఆర్‌కేఎం ఫౌండేషన్‌ వంటి సంస్థలు ఇచ్చే స్కాలర్ షిప్‌ల వివరాలు ఆంధ్రప్రదేశ్‌ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌లో ఉంటాయి. వాటిని మొత్తం చెక్ చేసుకొని విద్యార్థులు తమ కెరీర్ డిసైడ్ చేసుకోవచ్చు.

వివిధ రకాల పరీక్షల సమయం, మరియు కోర్సుల వివరాలు:

ఇందులో వివిధ రకాల నోటిఫికేషన్లు, కోర్సుల వివరాలు, ఫీజులు, పరీక్షలు, చివరి తేదీ, వాటికయ్యే ఖర్చు, శాలరీ వంటి వివరాలు ఆంధ్రప్రదేశ్‌ కెరీర్‌ పోర్టల్‌. వివరాలు https://apcareerportal.in/ ‌లో ఉంటాయి. వాటిని మొత్తం చెక్ చేసుకొని విద్యార్థులు తమ కెరీర్ డిసైడ్ చేసుకోవచ్చు. 9, 10, ఇంటర్‌ చదివే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్, లైఫ్‌స్కిల్స్‌పై దీన్ని రూపొందించారు. 672 రకాల జాబ్ అవకాశాల్లో విద్యార్థులు నచ్చిన దాన్ని ఎంచుకొని పూర్తిగా తెలుసుకోవచ్చు. తమ ఫ్యూచర్‌ని తామే కరెక్టుగా నిర్మించుకోవచ్చు.

Click Here
Click Here for apcareeportal Website