Monday, August 24, 2020

How to Apply for New Ration Card Know the Procedure Here


How to Apply for New Ration Card Know the Procedure Here

కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి
మీ సేవా కేంద్రాల్లో నిర్దేశిత ధృవపత్రాలు, ఇతర వివరాలతో కూడిన దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏయే పత్రాలు అవసరమో తెలుసుకోండి.      

మీ సేవా ద్వారా దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు మొదట పామ్ తీసుకోవాలి. ఇవి మీకు సమీపంలోని మీసేవా కేంద్రాల్లో లభిస్తాయి. మీసేవా (Meeseva) అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. - పామ్‌లో అవసరమైన సమాచారం నింపండి. సూచించిన చోట సంతకం చేయాలి. - ఎక్కడ కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. అలా చేస్తే కనుక మీ ఫామ్‌ను రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి - అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి. ఫీజును, దరఖాస్తు ఫాంను మీసేవలో సబ్‌మిట్ చేయండి. అక్కడ మీరు అక్నాలెడ్జ్ స్లిప్ తీసుకోవడం మరిచిపోవద్దు. - కుటుంబ యజమాని సంవత్సర ఆదాయం, వృత్తి వివరాలను దరఖాస్తులో పొందుపర్చాలి. గ్రామీణ ప్రాంతం వారి ఆదాయం రూ.ఒక లక్ష 60 వేలు, పట్టణ ప్రాంత ప్రజల ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు. - గ్రౌండ్ లెవల్ వెరిఫికేషన్ అనంతరం కొంతకాలానికి మీసేవ మీకు రేషన్ కార్డు అందిస్తుంది. నిబంధనలకు లోబడి అర్హత కలిగిన వారికి ఆహార భద్రత కార్డు జారీ చేస్తారు.

కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి
అర్హత - దరఖాస్తుదారు ఇండియన్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రంలో ఉండాలి. - ఇతర రాష్ట్రాలలో ఫ్యామిలీ మెంబర్స్‌కు కార్డు ఉండరాదు. - దరఖాస్తులో అందరు కుటుంబ సభ్యులు ఉండాలి.

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం
  1. అవసరమైన డాక్యుమెంట్లు - 
  2. దరఖాస్తు ఫారం. 
  3. రెసిడెన్షియల్ ప్రూఫ్  
  4. యజమాని వయస్సు ధృవీకరణ పత్రం
  5. ఫ్యామిలీ ఇన్‌కం ప్రూఫ్. ఫ్యామిలీ ఆదాయం సూచించిన మేరకు ఉండాలి. యజమాని ఆదాయ వివరాలు. గ్రామీణ ప్రాంతాల వారైతే 1,60,000, పట్టణ ప్రాంతాలవారైతే 2,00,000 మించకూడదు.
  6. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వంటి ఐడెంటిటీ ప్రూఫ్ అవసరం - 
  7. దరఖాస్తుదారు పాస్‌పోర్టు ఫోటోలు -
  8. ప్రధాన్/కౌన్సెలిర్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ అండ్ సర్టిఫికేట్ ఫారం - 
  9. మొబైల్ నెంబర్ లేదా ఈ-మెయిల్ అడ్రస్. - 
  10. మీరు అద్దెకు ఉంటున్నట్లయితే టెనెన్సీ అగ్రిమెంట్

దగ్గరలోని మీసేవా కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న డాక్యుమెంట్లతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. మీసేవలో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక దరఖాస్తుదారులకు నెంబర్ కేటాయిస్తారు.

మీ సేవా ఇచ్చే దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన జిరాక్స్ పత్రాలను అటాచ్ చేసి ఎమ్మార్వో ఆఫీసులో సమర్పించాలి. ఎమ్మార్వో కార్యాలయం పరిశీలించి నిబంధనలకు లోబడి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.