Thursday, April 2, 2020

'ఆరోగ్య సేతు' కేంద్రం తీసుకువచ్చిన ఈ యాప్ కరోనా బాధితుడు మీ సమీపానికి వస్తే చెప్పేస్తుంది!



'ఆరోగ్య సేతు'కేంద్రం తీసుకువచ్చిన ఈ యాప్ కరోనా బాధితుడు మీ సమీపానికి వస్తే చెప్పేస్తుంది!

Aarogya Setu is a mobile application developed by the Government of India to connect essential health services with the people of India in our combined fight against COVID-19. The App is aimed at augmenting the initiatives of the Government of India, particularly the Department of Health, in proactively reaching out to and informing the users of the app regarding risks, best practices and relevant advisories pertaining to the containment of COVID-19.


కరోనాపై అధికారిక యాప్ తీసుకువచ్చిన కేంద్రం
'ఆరోగ్య సేతు' యాప్ కు రూపకల్పన చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఉచితం




కరోనా దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు 1,964 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50 మంది మరణించారు. కాగా, కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. దీనిపేరు 'ఆరోగ్య సేతు'. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు.

'ఆరోగ్య సేతు'కేంద్రం తీసుకువచ్చిన ఈ యాప్ కరోనా బాధితుడు మీ సమీపానికి వస్తే చెప్పేస్తుంది! /2020/04/aarogya-setu-andriod-app-fight-against-corona-covid19-govt-of-india-download.html


ఇక దీని ప్రత్యేకత ఏంటంటే... ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్ గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది ఈ యాప్. ఇందులో ఉండే ఛాట్ బాట్ మీ సందేహాలకు సమాధానాలను అందిస్తుంది. మీకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయో లేదో చెబుతుంది. ఫోన్ లొకేషన్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది.  ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.



కరోనా వైరస్ బాధితులు మీకు దగ్గర్లో ఉంటే ఈ యాప్ వెంటనే అలర్ట్ చేస్తుంది. లొకేషన్ డేటా, బ్లూటూక్ కనెక్టివిటీ ద్వారా ఇది పనిచేస్తుంది. కరోనా వైరస్ బారినపడ్డ బాధితులు మీకు ఆరు అడుగుల దూరంలోకి వస్తే వెంటనే యాప్ అప్రమత్తం చేస్తుంది. మీరు హై రిస్క్‌లో ఉన్నారో లేదో కూడా చెబుతుంది. ఒకవేళ మీరు హై రిస్క్ ఏరియాలో ఉంటే టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తుంది. 1075 నెంబర్‌కు కాల్ చేసి దగ్గర్లోని టెస్టింగ్ సెంటర్‌లో అపాయింట్‌మెంట్ కూడా తీసుకోవచ్చు.

ఇక దీని ప్రత్యేకత ఏంటంటే... ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ఒకవేళ మీకు సమీపంలోకి ఎవరైనా కరోనా బాధితుడు వస్తే వెంటనే అప్రమత్తం చేస్తుంది. తద్వారా కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్ గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది.

ఈ యాప్ లో యూజర్ డేటా కేవలం కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే పంచుకుంటారని, థర్డ్ పార్టీతో పంచుకోవడం ఉండదని, అందువల్ల ఇది సురక్షితం అని అధికారవర్గాలు చెబుతున్నాయి. 'ఆరోగ్య సేతు' యాప్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. వినియోగదారులు దీని ద్వారా ఆయా రాష్ట్రాల తాజా కరోనా సమాచారం ఎప్పటికప్పుడు  తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్ లపై ఉచితంగా లభించే ఈ ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో సేవలు అందిస్తుంది.

Click Here for