Saturday, 4 April 2020

How to solve work stress? Ways to combat stress

How To Control Stress In Telugu | ఒత్తిడిని ఎదుర్కోవడానికి మార్గాలు. | stress control in telugu
How to solve work stress? Ways to combat stress
స్ట్రెస్ బస్టర్స్ తో ఒత్తిడిని ఎదుర్కోని సంతోషంగా ఉండవచ్చు
పని ఒత్తిడిని ఎలా పరిష్కరించాలి? ఒత్తిడిని ఎదుర్కోవడానికి మార్గాలు

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి మీకు వివరిస్తాం. వాటిలో కొన్ని మార్గాలను మీకు అందిస్తున్నాం.

ఒత్తిడిని ఎదుర్కోవడానికి మార్గాలు watch Video Here


1) మీ పనిని, ఇంటి పరిస్థితులను తిరిగి సమతుల్యం చేసుకోండి
మీరు మీ పనిలో పడి ఎక్కువ సమయం గడిపినట్లు భావిస్తే, మీకు ఒంటరిగా ఉన్నామనే భావన కలిగితే.. వెంటనే పనిని పక్కన పెట్టి మీ స్నేహితులను కలవండి. మీ కుటుంబ సభ్యులతో సరదాగా ఉండండి. అప్పుడే మీ వ్యక్తిగత జీవితం సమతుల్యం అవుతుంది.
2) థెరపిస్ట్ లేదా సలహాదారుతో మాట్లాడండి
థెరపిస్ట్ లేదా సలహాదారుతో మాట్లాడండి: ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. జీవితంలో జరిగే మార్పులను, ఇబ్బందులను తట్టుకోలేని పరిస్థితులు మీకు ఎదురుకావొచ్చు. అలాంటి సమయంలో థెరపిస్ట్ లేదా సలహాదారుతో మాట్లాడితే మీ వృత్తిపర జీవితంలో అనేక మార్పులు వస్తాయి. దీనిని మీరు కూడా గమనించవచ్చు.
3) క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. మీరు ఒక రోజు 20 నిమిషాలు నడవడం వల్ల మీ దైనందిక జీవితంలో అనేక మార్పులు కనిపిస్తాయి.
4) ఒక సెలవు తీసుకోండి
మీరు సెలవు తీసుకున్నప్పుడు మీ ల్యాప్ టాప్ ను, సెల్ ఫోన్ ను దూరం పెట్టండి. సెలవు తీసుకుని విశ్రాంతి తీసుకున్నప్పుడు మీ ఒత్తిడి అనేది తగ్గిపోతుంది. దీని వల్ల మీరు సంతోషంగా ఉండటంతో పాటు తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి ఉపయోగపడుతుంది.
5) చుట్టుపక్కల వారితో, పెంపుడు జంతువులతో అనుబంధం
పెంపుడు జంతువులతో సరదాగా కొద్ది సమయం గడిపితే మీలో ఆందోళన తగ్గిపోతుందని అనేక పరిశోధనల్లో తేలింది. దీంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారితో అనుంబంధం పెరగడం వల్ల కూడా మనిషిలో మార్పు రావడంతో పాటు.. సమాజంలో మనం ఒంటరి కాదనే భావన కలుగుతుంది.

6) సపోర్ట్ గా ఉండే వారితో టచ్ లో ఉండండి
ఇతర వ్యక్తులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు విడుదల అవ్వడానికి సహాయపడుతుంది. మీ జీవితంలో గొప్ప మాటలు చెప్పే వారితో ఎక్కువ టచ్ లో ఉండండి.
7) బాగా తినండి కానీ మత్తుపదార్థాలు, ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉండండి
మీరు సహజసిద్ధంగా పండించిన పండ్లు, కూరగాయలు తినేందుకు ఆసక్తి చూపించండి. ఫ్రై, వేపుడు, బయటి ఆహారంతో పాటు తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. సరైన మోతాదులో నీళ్లను తాగండి. ఆల్కహాల్, పొగాకు, మత్తు పదార్థాలు మీ ఒత్తిడిని దూరం చేస్తాయి.. కానీ వాటివల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది.
8) ఒక మంచి అలవాటును మొదలు పెట్టండి
మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఏదైన ఒక కార్యక్రమంలో పాల్గొనండి. దీని వల్ల మీ పని ఒత్తిడి తగ్గడంతో పాటు మీ యొక్క ఆలోచన విధానం కూడా మారుతుంది. పుస్తకాలు చదవండి, పాటలు వినండి, తోట పని చేయండి. వీటితో పాటు ఏదో ఒక కాలక్షేపం చేయండి.
9) సరిగ్గా నిద్రపోండి
మీరు రోజుకు 7-8 గంటల కన్నా తక్కువ నిద్రపోతే మీ శరీరం ఒత్తిడిని తట్టుకోలేదు. మీరు సరైన సమయంలో రాత్రిపూట నిద్రపోతే.. ఉదయం లేచే సరికి మీ ఒత్తిడి దూరం అవ్వడంతో పాటు శరీరం ఉత్తేజంగా  ఉంటుంది.
10) ధ్యానం, యోగాను ప్రాక్టీస్ చేయండి
మీ శరీరం అలిసిపోయి పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు.. తిరిగి ఉత్తేజంగా మారి ఒత్తిడిని జయించడానికి కొన్ని చిట్కాలు పాటించండి. యోగా, ధ్యానం చేయడం వల్ల హార్మోన్లు విడుదలవుతాయి.
ఇక చివరిగా...
    మీ జీవితంలో ఒత్తిడిని తొలగించడం ఎలాగో నేర్చుకోండి. దీని వల్ల మెరుగైన ఫలితాలు సాధించడానికి, భవిష్యత్ లో మరింత ఎత్తుకు వెళ్లడానికి సహాయ పడుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడం నేర్చుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, చాలా శక్తివంతంగా కూడా మారుతారు. దీని వల్ల మీకు ఎదురయ్యే ఎలాంటి సమస్యను అయినా ఈజీగా ఎదుర్కొంటారు.
For more General Information Click the Link BelowLatest Updates TS & AP

Recruitment Updates

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top