Friday, 20 March 2020

Sukanya Samriddhi Yojana (SSY) Account Know Scheme Details


Sukanya Samriddhi Yojana (SSY) Account Know Scheme Details


Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన సేవింగ్స్ స్కీమ్‌... ఈ అకౌంట్‌తో ఎన్నో లాభాలు తెలుసుకోండి.

మీకు చిన్న పాప ఉందా? ఆమె పేరుమీద కొంత మొత్తాన్ని పొదుపు చేయాలను కుంటున్నారా? అయితే మీరు మీ పాప కోసం సుకన్య సమృద్ధి యోజనా ఖాతాను ప్రారంభించవచ్చు. 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వం 'సుకన్య సమృద్ది యోజనా' పొదుపు పథకాన్ని ఆరంభించింది. సుకన్య సమృద్ధి యోజన... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు పథకం ఇది. అమ్మాయి ఉన్నత చదువులకు, పెళ్లిళ్లకు డబ్బు పొదుపు చేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తోంది. మరి ఈ స్కీమ్‌తో లాభాలు ఏంటో తెలుసుకోండి.Sukanya Samriddhi Yojana (SSY) Account Know Scheme Details /2020/03/Sukanya-Samriddhi-Yojana-Account-Know-Scheme-Details.html


'సుకన్య సంవృద్ది ఖాతా అనేది ఆడపిల్ల సంపద పథకం. అడ పిల్లల కోసం 22 జనవరి 2015 న ప్రధాని నరేంద్రమోడిచే ప్రారంభించబడింది ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 9.1 వడ్డీ అందించబడుతుంది- దీనికి ఏటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్ ఖాతా. దీనిని ప్రారంబించడనికి పోస్టాఫీసులో కాని అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం రూ 250/- (ఇదివరకు 1,000/- ఉంది) చేయాలి. ఈ పథకం క్రింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ వున్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ద్వారా ఈ ఖాతా తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరు వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చులు నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న డిపాజిట్ 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరణ చేసుకోనవచ్చును. ఈ ఖాతా బాలిక వివాహం వరకు లేదా ప్రారంభ తేదీ నుండి 21 సంవత్సరాలు వరుకు ఆపరేట్ అవుతుంది.ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాలి.తల్లి దండ్రులు గరిష్ఠంగా ఇద్దరు అమ్మాయిలకు కోసం ఈ ఖాతా తెరవ వచ్చు. కవలల విషయంలో ఈ సౌకర్యం మూడవ అమ్మాయికి కూడా ఈ ఖాతా తెరవ వచ్చు.

ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/- మరియు గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వరుకు డిపాజిట్ చేయావచ్చు.

ఈ ఖాతాలో డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి వుంటుంది.

ఈ ఖాతా కోసం సంవత్సరానికి ఉన్న డబ్బుని, సంవత్సరానికి వడ్డీ రేటు 8.1% వార్షికమును బట్టి మారును.

సుకన్య సంవృద్ది ఖాతాకి పాస్ బుక్ సౌకర్యం ఉంది.

ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి అదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గరిష్ఠంగా రూ.1,50,000/- వరకు పన్ను మినహాయింపు ఉంది.

అర్హతలు -
ఈ ఖాతా అమ్మాయి పేరుమీద తల్లి లేదా తండ్రి ప్రారంభించవచ్చు. - ఖాతా ప్రారంభించే నాటికీ అమ్మాయి వయసు పదేళ్ల లోపు ఉండాలి. - ఒక అమ్మాయి పేరుమీద ఒకటికి మించి ఖాతాలు ప్రారంభించరాదు. - ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా కూడా వారికోసం ఈ ఖాతాను తెరవ వచ్చు.

ఖాతా ప్రారంభం -
ఈ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ, ప్రయివేట్ భ్యాంకుల వద్ద ప్రారంభించవచ్చు. - 
ఖాతా కోసం అమ్మాయి ఆధార్ కార్డు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, తండ్రి లేదా తల్లి ఆధార్ కార్డు తదితర చిరునామా ధ్రువీకరణ పత్రాల అవసరం ఉంటుంది. అమ్మాయికి సంభందించిన పూర్తి వివరాలతో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. - రెండు చొప్పున పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది. 

ఒక ఆర్ధిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ.1,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కనీస మొత్తం జమచేయక పోతే కొంత జరిమానా విధిస్తారు. డిపాజిట్ సమయంలో ఏదైనా అకౌంటింగ్ ఎర్రర్ ఉంటే అకౌంట్‌లో వడ్డీ జమ కాదు. డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసిననాటి నుంచి 15 ఏళ్ల వరకు డబ్బులు జమ చేస్తూ ఉండాలి. ఒకవేళ కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్ డిఫాల్ట్ అవుతుంది. 15 ఏళ్ల లోపు ఎప్పుడైనా అకౌంట్ తిరిగి రెగ్యులరైజ్ చేయొచ్చు. ఇందుకోసం ప్రతీ ఏడాదికి రూ.50 చొప్పున పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిన తర్వాత డబ్బులు వడ్డీతో తిరిగి వస్తాయి.

డిపాజిట్లపై వడ్డీ: 
ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌కు వార్షికంగా 8.4 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతీ నెల ఐదో తేదీ నుంచి నెలాఖరు లోపు వడ్డీని లెక్కిస్తారు. అంటే ఐదో తేదీలోపు అకౌంట్‌లో ఎంత ఉంటే అంత మొత్తానికే వడ్డీ లభిస్తుంది. ప్రస్తుత వడ్డీ లెక్కన చూస్తే ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున 15 ఏళ్లు జమ చేస్తే సుమారు రూ.45 లక్షలు అకౌంట్‌లో ఉంటాయి. అకౌంట్ 21 ఏళ్లకు మెచ్యూర్ అవుతుంది కాబట్టి సుమారు రూ.73 లక్షలు తిరిగొస్తాయి.

కనీసం 15 ఏళ్ళ వరకు ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాలకు ఖాతా నిలిపి వేస్తారు. అప్పుడు జమచేసిన సొమ్ముకు చక్రవడ్డీ కలిపి అందజేస్తారు. - 

అయితే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత విద్యకు అవసరమయ్యే వ్యయాలకు సగం వరకు సొమ్ము తీసుకోవచ్చు. - 

18 ఏళ్ళ తర్వాత పెళ్లి ఖర్చులకు అవసరం అనుకుంటే ఖాతాను ముందుగానే ముగించుకోవచ్చు.

ఈ ఖాతాను అవసరం అనుకుంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోని శాఖకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

అకౌంట్ ఆపరేషన్: 
అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేవరకు తండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే అకౌంట్‌ను ఆపరేట్ చేస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాత సొంతగా అకంట్ ఆపరేట్ చేయొచ్చు.

ప్రీమెచ్యూర్ క్లోజర్: 
అకౌంట్ హోల్డర్ చనిపోతే డెత్ సర్టిఫికెట్ సమర్పించి అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. జమ చేసిన మొత్తం వడ్డీతో సహా తండ్రి లేదా సంరక్షకుడికి అందుతాయి. అకౌంట్ హోల్డర్ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నా, తండ్రి లేదా సంరక్షకుడు చనిపోయినా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి.

 విత్‌డ్రాయల్: 
అమ్మాయికి 18 ఏళ్లు పూర్తైన తర్వాత లేదా 10వ తరగతి పాసైన తర్వాత ఉన్నత విద్య కోసం అకౌంట్‌లో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం విద్యాసంస్థలో అడ్మిషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. జమ చేసిన డబ్బుల్లో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాల పద్ధతిలో తీసుకోవచ్చు.

మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ క్లోజర్: 
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 21 ఏళ్లకు అకౌంట్ మెచ్యూర్ అవుతుంది. 21 ఏళ్ల లోపు కూడా అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు దాటిన తర్వాత అమ్మాయి పెళ్లి చేస్తున్నటైతే సరైన ఆధారాలు చూపించి డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. పెళ్లికి నెల ముందు లేదా పెళ్లికి మూడు నెలల తర్వాత అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌తో పాటు వడ్డీ లభిస్తాయి. 


వడ్డీ రేటు ఎంత?
సుకన్య సమృద్ధి యోజనా ఖాతాపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ వడ్డీ రేటును సమీక్షిస్తారు. గరిష్టంగా వడ్డీ రేటు 8.5 శాతం వరకు ఉంటుంది.

పన్ను ప్రయోజనం : 
ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని 80 సి కింద గరిష్టంగా వార్షికంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు ఈ ఖాతా ద్వారా ఉన్నాయి. అందుకే వెంటనే ఈ ఖాతాని ప్రారంభించేందుకు సిద్ధం అయితే బాగుంటుందేమో... ఆలోచించండి.

సుకన్య సంవృద్ది ఖాతాని తెరావడానికి కావలసిన పత్రాలు
బాలిక బర్త్ సర్టిఫికేట్
తల్లిదండ్రుల చిరునామా రుజువు
తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
తల్లిదండ్రుల aadhar card
తల్లిదండ్రుల ration card

Latest Updates TS & AP

Recruitment Updates

Lastest Jobs Details

Academic Information

  • Snehitha TV for Academic Videos
  • SSC Material

    AP Latest Information

    TS Latest Information

    We are the team of passionate bloggers. Every day we research latest information on the current education, jobs information.
    Top