Thursday, February 20, 2020

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా..

🌈హైదరాబాద్‌ : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డుతో పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి.. వ్యాపారానికి లోన్ కూడా ఇస్తుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. నిరుపేదలు, నిరుద్యోగులు, ఉన్నత విద్యను అభ్యసించలేని వారికి బాసటగా నిలుస్తూ ఈ శిక్షణ కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చింది ఎస్‌బీఐ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి.. యువతకు తోడ్పాటుగా నిలుస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 587 శిక్షణా సంస్థలను ప్రారంభించింది. ఇప్పుడు మరో 151 గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణలు ప్రారంభించనుంది. ఉపాధి లేక బాధపడుతోన్న యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది ఎస్‌బీఐ.


నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా../2020/02/SBI-State-Bank-Of-India-Rural-Self-Employment-Training-Institutes-RSETIs.html


ఉచిత శిక్షణే కాకుండా ఫ్రీగా భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నది. ఎన్నో డబ్బులు పోగేసి నేర్చుకునే కోర్సులను ఉచితంగా అందిస్తుండటంతో యువతీ, యువకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్రైనింగ్ తర్వాత వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం అవకాశాలు కూడా కల్పిస్తోంది ఎస్‌బీఐ సంస్థ.


 ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఆయా జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌ని కలిసి శిక్షణ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు. 

ఈ శిక్షణ పొందేందుకు అర్హతలేంటంటే.. 

18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. కనీసం 10వ తరగతైనా పాస్ అయి ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డ్, 3 పాస్ పోర్టు సైజ్ ఫొటోలు కావాలి.



కోర్సుల వివరాలు:

కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, వ్యవసాయ అనుబంధ వృత్తులు, టైలరింగ్, బ్యూటీ పార్లర్, ఎలక్ట్రికల్ మోటార్
రివైండింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎంబ్రాయిడరీ, కొవ్వొత్తులు, అగరుబత్తుల తయరీ, టూవీలర్ మెకానిజం, సెల్
ఫోన్ రిపేరింగ్ స్కిల్స్, పచ్చళ్లు, మసాలా పౌడర్ల తయరీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.