TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Friday, December 27, 2019

10వ తరగతి విద్యార్థులకు సూచనలు in Telugu Subject

10వ తరగతి విద్యార్థులకు సూచనలు Telugu Subject


తెలుగు పరీక్షలో ఒక్కో పేపరులో ఎ, బి విభాగాలుగా విభజన ఉంటుంది.
‘బి’ విభాగం పేపర్లు చివరి అరగంటలో ఇస్తారు.
తెలుగులో ఉత్తమ గ్రేడ్‌ సాధనకు అయిదు అంశాలపై దృష్టి సారించి సాధన చేయాల్సి ఉంటుంది.



10వ తరగతి విద్యార్థులకు సూచనలు Telugu Subject/2019/12/suggetions-to-get-10-points-in-telugu-subject.html

అవగాహన- ప్రతిస్పందన: ఈ విభాగంలో పరిచిత గద్యం, అపరిచిత గద్యం, పరిచిత పద్యం, అపరిచిత పద్యం అంశాలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. అపరిచిత పద్యం, గద్యంపై ఎక్కువ సాధన చేయాలి. అపరిచిత పద్యాలను వేమన, సుమతి మొదలైన నీతి శతకాల నుంచి ఎక్కువగా అడుగుతారు. విద్యార్థులు ఆయా పద్యాలను చదివి అర్థం చేసుకోవాలి. పరిచిత గద్యం, అపరిచిత గద్యం, అపరిచిత పద్యం/గేయం/కవిత అంశాలకు సంబంధించి ఎప్పుడూ ఒకే రకంగా ప్రశ్నలు అడగరు. ప్రశ్నలు-జవాబులు, ప్రశ్నల తయారీ, ఖాళీలను పూరించడం, తప్పొప్పులను, కీలక పదాలను, వ్యాక్యాలను గుర్తించడం తదితర విధాలుగా అడుగుతారు. విద్యార్థులు విషయ అవగాహన చేసుకుంటే ఎలా అడిగినా రాసేందుకు అస్కారముంటుంది.


స్వీయ రచన: *అభ్యాసంలోని ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లుగా రావు. అలాంటి స్వభావం గలవి మాత్రమే వస్తాయి. అందుకే విద్యార్థులు పాఠం చదివి సొంతంగా ప్రశ్నలను తయారుచేసుకోవాలి. వాటికి జవాబులు రాసి ఉపాధ్యాయుడి సమక్షంలో తరగతి గదిలో చర్చించాలి. తద్వారా దోషాలను సరిదిద్దుకునేందుకు అవకాశముంటుంది. పుస్తకంలోని అంశాలపై, వాక్యాలపై అభిప్రాయాలు రాయడం, వివరించడం, విశ్లేషించడం, సమర్థించడం, విభేదించడం, తగిన కారణాలు రాయడం వంటివి అభ్యాసం చేయాలి.

సృజనాత్మకత: పాఠ్యపుస్తకంలో నినాదాలు, సూక్తులు, కరపత్రం, సంభాషణ తదితర 13 వ్యవహార రూపాలున్నాయి. వీటిని ఎలా రాయాలో ఉపాధ్యాయుడి సహాయంతో అభ్యసించాలి. ఒక ప్రక్రియలో ఉన్న అంశాన్ని మరొక వ్యవహార రూపంలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి. పాఠ్యపుస్తకంలోని వ్యవహార రూపాలను అడుగుతారు. వాటిలోని అంశాన్న
For More Telugu Materials  Click Here