Friday, December 13, 2019

UIDAI launches mAadhaar app Now you can carry your aadhaar on mobile that is more secure than the old Aadhaar app. Users can also avail personalised services by using the mAadhaar app



UIDAI launches mAadhaar app Now you can carry your aadhaar on mobile that is more secure than the old Aadhaar app. Users can also avail personalised services by using the mAadhaar app

కొత్త ‘ఎం-ఆధార్’ యాప్‌ వచ్చేసింది దీంతో ఎన్నో లాభాలు. యూఐడీఏఐ తాజాగా కొత్త ఎంఆధార్ యాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది

If you are using the old Aadhaar app, it's time that you delete it. The Unique Identification Authority of India (UIDAI) has launched a new version of the Aadhaar app that much more secure than the older version of the app. The new mAadhaar app is available for download on both Apple's App Store and Google's Play Store. As per reports UIDAI is asking the users of the old Aadhaar app to delete the previous version and install the new mAadhaar app, which does not support third-party apps, immediately.




UIDAI launches mAadhaar app Now you can carry your aadhaar on mobile that is more secure than the old Aadhaar app. Users can also avail personalised services by using the mAadhaar app /2019/12/mAadhaar-android-app-download.html

  1. mAadhaar app is more secure than the old Aadhaar app.
  2. mAadhaar app features support for 13 Indian languages.
  3. Users can lock or unlock their biometric authentication using mAadhaar app.

యూఐడీఏఐ తాజాగా కొత్త ఎంఆధార్ యాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్‌ కావాలి‌. పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా ఆధార్‌ తప్పనిసరి. అలా అని ఏదైనా పథకానికిగానీ దరఖాస్తుకుగానీ ఆధార్‌ కార్డు సమర్పిస్తే వేరొకరు దుర్వినియోగం చేస్తారనే భయమూ ఉంది.

ఈ ఇబ్బంది లేకుండా mAadhaar యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దీంట్లో మార్పులు చేసి కొత్త వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఉన్న పాత యాప్‌ను తొలగించి mAadhaar కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించింది.  

ఎంఆధార్ యాప్ 13 భాషల్లో ఉపయోగించొచ్చు. అందులో 12 భారతీయ భాషలు కాగా, మరో భాష ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, మళయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ భాషల్లో ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది. ఇంగ్లీష్‌లో టైప్ చేస్తేనే ఇతర భాషల్లో కనిపిస్తుంది. పర్సనలైజ్డ్ ఆధార్ సర్వీసెస్ పొందేందుకు ఆధార్ ప్రొఫైల్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఉన్నవారు మాత్రమే కాదు లేనివాళ్లు కూడా తమ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆధార్ యాప్‌ను ఓపెన్ చేయగానే 'Main Service Dashboard', 'Request Status Services', 'My Aadhaar' లాంటి సేవలుంటాయి. ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రీప్రింట్, అడ్రస్ అప్‌డేట్, ఇకేవైసీ డౌన్‌లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ / ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి.
మీ పాత యాప్‌ను డిలేట్ చేయండి : ఇదివరకు ఎంఆధార్ యాప్‌ను కలిగి ఉంటే వాటికి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని యూఐడీఏఐ ఆధార్ వినియోగదారులకు సూచిస్తోంది. కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. యూఐడీఏఐ కొత్త యాప్‌లో పలు రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ యాప్‌తో కొత్త ఆధార్ పొందొచ్చు: ఎంఆధార్ యాప్‌తో ఆధార్ వినియోగదారులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కనిపించకుండాపోతే, లేదంటే పాడైపోయింటే రిప్రింట్ కోసం రిక్వెస్ట్ ఇవ్వొచ్చు. దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
అడ్రస్ మార్చుకోవచ్చు: ఇంకా ఆన్‌లైన్‌లోనే అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇకేవైసీ పూర్తి చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంది. వర్చువల్ ఐడీని నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను కూడా వెరిఫై చేసుకోవచ్చు.
మీ ఆధార్ వివరాలు లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు: అలాగే ఈఐడీ, యూఐడీ తిరిగి పొందొచ్చు. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ చూసుకోవచ్చు. అడ్రస్ వాలిడేషన్ లెటర్‌‌ కోసం రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఆధార్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్స్‌ కూడా ఇదే వర్తిస్తుంది. ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఎక్కడుంతో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌ కూడా చూడొచ్చు.

ఎక్కడెక్కడ ఆధార్ వాడారో తెలుసుకోవచ్చు: ఒకవేళ మీ ఆధార్ వివరాలను ఎవరో చట్టవిరుద్ధంగా మీ అనుమతి లేకుండా ఉపయోగించారని భావిస్తే.. అప్పుడు యాప్‌లోని అథంటికేషన్ హిస్టరీకి వెళ్లి మీ ఆధార్ వివరాలు ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. యాప్ నుంచే మీ ఆధార్ వివరాలను డైరెక్ట్‌గా ఇతరుకు పంపొచ్చు.
వర్చువల్ ఐడీ తప్పనిసరి : ఆధార్ లాక్ ఓపెన్ చేయాలంటే వర్చువల్ ఐడీ అవసరం. అందువల్ల దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ ఐడీని మరిచిపోతే 1947కు మెసేజ్ పంపడం వల్ల తిరిగి పొందొచ్చు. ఆర్‌వీఐడీ అని టైపు చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెలను ఎంటర్ చేయాలి. తర్వాత దీన్ని 1947కు ఎస్ఎంఎస్ పంపాలి. ఇప్పుడు మీ వర్చువల్ ఐడీ మీకు వస్తుంది.
mAadhaar యాప్‌ను ప్లే స్టోర్ / యాప్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవాలి. 
  1. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి (ఆధార్‌ కార్డుపై ఏ నెంబర్ ఉందో అదే ఇవ్వాలి)
  2. వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేయాలి. 
  3. తర్వాత యాప్‌లోకి వెళ్లి..ఆధార్ కార్డును నమోదు చేయాలి. 
  4. మళ్లా వచ్చిన ఓటీపిని ఎంటర్ చేయాలి. 
  5. ఆధార్‌కు అనుసంధానం చేసినట్లు చూపిస్తుంది. 
  6. ఆధార్‌కు లాక్ క్రియేట్ చేయడం కోసం ముందుగా my aadharr అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
  7. మై ఆధార్‌ను ఓపెన్ చేయాలంటే..లాక్ కోడ్ అవసరం ఉంటుంది. నాలుగు అంకెలతో కొత్త పాస్ వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. 
  8. సెట్ ఆధార్ లాక్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని..పర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవాలి. 
  9. సెక్యూర్టీ క్యాప్షన్ ఎంటర్ చేసిన అనంతరం వచ్చిన ఓటీపీ నమోదు చేయాలి. అప్పుడు పర్చువల్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ లాక్‌ను ఓపెన్ చేయాలంటే పర్చువల్ ఐడీ తప్పనిసరి.
  10. mAadhaar యాప్ ద్వారా అందించే సేవలన్నీ కనిపిస్తాయి. 

ముందుగా రిజిస్టర్ చేసుకోండి: యాప్‌ను ఉపయోగించాలని భావిస్తే ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై చేసుకోవాలి. దీని కోసం యాప్‌లో రిజిస్టర్ యువర్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. దీంతో మీ ఆధార్ నెంబర్‌ యాప్‌తో లింక్ అవుతుంది. దీంతో ఫోన్‌లోకి మీ ఆధార్ కార్డు వచ్చేస్తుంది.

CLICK HERE FOR mAadhaar Android App