Friday, October 25, 2019

How to change your Bank ATM pin if you forgot the old one


How to change your Bank  ATM pin if you forgot the old one

ఎటిఎం పిన్ మర్చిపోతే మార్చుకోవడం ఎలా ?

ఇప్పుడున్న ప్రస్తుత కాలానికి చేతిలో స్మార్ట్ ఫోన్ లేనివాళ్లు వ్యాలెట్ లో ఎటిఎం కార్డు లేని వాళ్ళు ఎవరు ఉండరు.ఎందుకంటే ప్రతిఒక్కరికి ఇవి రెండు తప్పనిసరి. అయితే ఒక్కోసారి మనం డెబిట్ కార్డు పిన్ మర్చిపోయి 3 సార్లు రాంగ్ పిన్ ఎంటర్ చేస్తుంటాం. ఆలా రాంగ్ పిన్ ఎంటర్ చేసినప్పుడు డెబిట్ కార్డు వెంటనే బ్లాక్ అయిపోతుంది మల్లి డెబిట్ కార్డు తిరిగి పని చేయడానికి 24 గంటల సమయం పడుతుంది.అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి కొత్త పిన్ యాక్టివేట్ చేసుకోవడానికి పెద్ద సమయం పట్టదు వెంటనే యాక్టివేట్ చేసుకోవచ్చు . ఈ శీర్షికలో భాగంగా ఎటిఎం కార్డు పిన్ మర్చిపోతే తిరిగి కొత్త పిన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.




ఎటిఎం కార్డు పిన్ తెలుసుకోవడనికి.... ఎటిఎం కార్డు పిన్ తెలుసుకోవడానికి డెబిట్ కార్డు బ్యాంకు అకౌంట్ నెంబర్ అలాగే బ్యాంకు అకౌంట్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కచ్చితంగా ఉండాలి.

BANKING అనే ఆప్షన్: ATM మెషిన్ లోATM కార్డు పెట్టిన వెంటనే మీకు BANKING అనే ఆప్షన్ కనిపిస్తుంది. వెంటనే BANKING ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.

PIN CHANGE /ATM PIN RESET.: బ్యాంకింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే PIN CHANGE లేదా ATM PIN RESET అనే ఆప్షన్ కనిపిస్తుంది అది సెలెక్ట్ చేయండి.

ENTER BANK ACCOUNT NUMBER: PIN CHANGE లేదా ATM PIN RESET ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ENTER BANK ACCOUNT NUMBER అని మిమ్మల్ని అడుగుతుంది వెంటనే బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయండి.



PHONE NUMBER: బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేసాక మీ PHONE NUMBER ను కూడా అడుగుతుంది వెంటనే బ్యాంకు అకౌంట్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ను ఎంటర్ చేయండి

ENTER OTP : ఫోన్ నెంబర్ ఎంటర్ చేసాక మీ ఫోన్ నెంబర్ కు OTP రావడం జరుగుతుంది. ఆ OTP ను ATM లో ఎంటర్ చేసాక PIN CHANGE అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ లోకి వెళ్ళి ఎటిఎం కార్డు పిన్ ను చేంజ్ చేసుకోవచ్చు. ఆలా చేసుకోవడం ద్వారా పాత ఎటిఎం పిన్ డిలీట్ అయ్యిపోయి కొత్త ఎటిఎం పిన్ యాక్టివేట్ అవుతుంది.


How can I change my Bank  ATM pin if I forgot the old one

  1. Swipe your card
  2. Select “Generate green PIN” which is second option.
  3. Select “Generate OTP”. (First Option) You will receive OTP on your registered Mobile No.
  4. Now again Swipe your card
  5. Select “Generate green PIN” which is second option.
  6. Then choose “Validate OTP” (Second Option). Enter OTP received.
  7. Now Enter the NEW PIN you want to set.
  8. Confirm the PIN by re-entering it again.
  9. It's done….!