Sunday, September 29, 2019

Reliance Jio Job Mela to be conducted on 30.09.2019




Reliance Jio Job Mela for Asst Technicians 300 Posts to be conduct on 30.09.2019 at Hyderabad

'Jio'లో ఉద్యోగాలు..'Job Mela'కు వచ్చేయండి..

Jio లో ఉద్యోగాలు, రిలయన్స్ జియో ఆధ్వర్యంలో జాబ్ మేళా.

భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, పుణె నగరాల్లో సెప్టెంబరు 30న జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.


నిరుద్యోగ యువతకు శుభవార్త . రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ రీజియల్ డైరెక్టర్ వెంటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐ.టి.ఐ లో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సి.ఐ.టి.ఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళా కు హాజరుకావచ్చు.  హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆవరణలో ఈ ఉద్యోగ మేళా జరుగుతుందని ఆయన వెల్లడించారు.



Reliance Jio Job Mela for Asst Technicians to be conduct on 30.09.2019 at Hyderabad /2019/09/Reliance-Jio-Job-Mela-for-Asst-Technician-to-be-conduct-on-30.09.2019.html



ఐటీఐ/ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
సెప్టెంబరు 30న ఉ. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా నిర్వహణ

భారత ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంగణంలో జరిగే ఈ జాబ్ మేళాలో రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఐటిఐతో పాటు అప్రెంటిస్ చేసిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐటిఐలో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సిఐటిఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళా కు హాజరుకావచ్చు అని ఆయన తెలిపారు.



స్కిల్ ఇండియాలో భాగంగా డైరక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ విభాగం పలు నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుందని, పలు రంగాలకు సంబంధించి ఆయా కంపెనీలకు అవసరమైన అభ్యర్ధులకు సరైన శిక్షణ ఇచ్చి నైపుణ్యాల మెరుగుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.