Tuesday, September 17, 2019

AP YSR Pelli Kanuka Scheme 2019 – 20 for SC/ST/BC Bride Marriage



AP YSR Pelli Kanuka Scheme 2019 – 20 for SC/ST/BC Bride Marriage

గుడ్‌న్యూస్: వైఎస్ఆర్ పెళ్లి కానుక రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపు

వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు


ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. జగన్ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, వికలాంగులు, అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తోన్న ఆర్థిక సహాయాన్ని రెట్టింపు చేస్తామంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చారు. ఆ హామీని నిలుపుకొంది ప్రభుత్వం. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.



AP YSR Pelli Kanuka Scheme 2019 – 20 for SC/ST/BC Bride Marriage /2019/09/AP-YSR-Pelli-Kanuka-Scheme-Apply-Online-Application-Form.html


ఎస్సీలకు ఇప్పటిదాకా ప్రభుత్వం 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తోండగా..ఈ మొత్తాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాన్ని చేసుకున్న ఎస్సీలకు చెల్లించే మొత్తాన్ని 75 వేల నుంచి 1,20,000 రూపాయలకు పెంచింది. ఎస్టీలకు చెల్లించే 50 వేల రూపాయలను లక్ష రూపాయలకు, కులాంతర వివాహాన్ని చేసుకునే ఎస్టీలకు 1,20,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. అంతకుముందు ఈ మొత్తం 75 వేల రూపాయలే.

వెనుక బడిన వర్గాల కుటుంబాలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం అందజేసే మొత్తం ఇప్పటిదాకా 30 వేల రూపాయలు. దీన్ని 50 వేల రూపాయలకు పెంచారు. బీసీలు కులాంతర వివాహం చేసుకుంటే.. 74 వేల రూపాయలను చెల్లిస్తుంది ప్రభుత్వం. పెళ్లికానుక కింద మైనారిటీ కుటుంబాలకు చెల్లించే 50 వేల నగదు మొత్తాన్ని లక్ష రూపాయలకు పెంచారు. అలాగే వికలాంగుల వివాహానికి ఇప్పటి దాకా లక్ష రూపాయలను ఇస్తుండగా..ఈ మొత్తాన్ని లక్షన్నరకు పెంచుతున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే- భవనాలు, ఇతర నిర్మాణ రంగానికి చెందిన అసంఘిటిత కార్మికులకు ఇప్పటిదాకా ఇస్తూ వచ్చిన 20 వేల రూపాయల నగదును లక్ష రూపాయలకు పెంచారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ పెంపుదల వర్తిస్తుంది.



పెంచిన పెళ్లి కానుక వివరాలు:

  1. ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
  2. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంపు.
  3. ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.
  4. బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు పెంపు.
  5. బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు.
  6. మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
  7. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు.
  8. భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంపు.
పథకానికి మార్గదర్శకాలు.. 
► వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
► వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.
► ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి.
► వివాహం ఏపీలోనే చేసుకోవాలి.
► ఇద్దరికీ ఆధార్‌కార్డు,  వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.
► వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం   చేసి ఉండాలి.
► వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
► తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.
► వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.

నమోదు ఇలా.. 

మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాల్లో పెళ్లి కానుక దరఖాస్తును నమోదు చేస్తున్నారు. నమోదుచేసిన వెంటనే అప్లికేషన్‌ ఐడీ నంబర్‌ అభ్యర్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అనంతరం కళ్యాణమిత్రలు వచ్చి వివరాలు సేకరించి, దర్యాప్తుచేస్తారు. ఆ తర్వాత ముందుగా రావాల్సిన 20శాతం నగదును పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 

తప్పనిసరిగా ఉండాల్సిన పత్రాలు 

♦ మీసేవా జారీ చేసిన నేటివిటి, కమ్యూనిటీ, జనన ధ్రువీకరణ పత్రం.
♦ వయస్సు నిర్ధారణకు పదో తరగతి లేదా ఇంటిగ్రేటెడ్‌ మీ–సేవా సర్టిఫికెట్‌.
♦ కుల ధ్రువీకరణ పత్రం, వివాహ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌
♦ తెల్లరేషన్‌ కార్డు లేదా మీ–సేవా ఆదాయ ధ్రువీకరణ పత్రం.
♦ పెళ్లికూతురు బ్యాంకు ఖాతా జిరాక్స్‌ను ఇవ్వాలి.
♦ దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్‌ (కనీసం 40 శాతంగా ఉండి శాశ్వత అంగవైకల్యం కలిగిఉండాలి).
♦ భవన నిర్మాణ కార్మికులైతే కార్మిక శాఖ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా గుర్తింపు కార్డు.
♦ ‘వెలుగు’లోనే దరఖాస్తు చేయాలి

జగనన్న భరోసా ఇలా..
  
కేటగిరి  గత ప్రభుత్వం    ప్రస్తుతం
ఎస్సీ రూ. 40 వేలు రూ.లక్ష
ఎస్టీ రూ. 50 వేలు రూ.లక్ష
బీసీరూ. 35 వేలు రూ.లక్ష
మైనార్టీలు రూ. 50 వేలు రూ.లక్ష
భవన నిర్మాణ కార్మికులకు రూ. 20వేలురూ. 20వేలు
ఎస్సీ కులాంతర వివాహం  రూ. 75 వేలు రూ. లక్ష
ఎస్టీ కులాంతర వివాహంరూ. 50 వేలురూ. లక్ష
బీసీ కులాంతర వివాహం రూ. 50 వేలురూ. 50 వేలు
దివ్యాంగులకు రూ. లక్ష  రూ. లక్ష