Thursday, August 22, 2019

SBI SUKANYA SAMRIDDHI YOJANA SCHEME



SBI SUKANYA SAMRIDDHI YOJANA SCHEME

GENERAL INFORMATION, Latest Information, Star

SBI ‘సుకన్య సమృద్ది’ అకౌంట్.. పూర్తి వివరాలు!



SBI SUKANYA SAMRIDDHI YOJANA SCHEME /2019/08/SBI-Sukanya-Samriddhi-Yojana-Scheme-General-Information-at-apedu.in.html

ప్రధానాంశాలు:

  1. స్టేట్ బ్యాంకులో సుకన్య సమృద్ది ఖాతా ప్రారంభించొచ్చు
  2. వడ్డీ రేటు ఇప్పుడు 8.4 శాతంగా ఉంది
  3. కనీసం రూ.1,000 అకౌంట్ తెరవొచ్చు
  4. ఆడ పిల్ల ఉన్నత చదువు, పెళ్లికి ఉత్తమమైన పొదుపు పథకం ఇది
  5. సుకన్య సమృద్ది స్కీమ్ గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఒక చిన్న మొత్తాల పొదుపు స్కీమ్.
  6.  ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఆడ పిల్లల పేరుపై ఈ ఖాతాను వీలైనంత త్వరగా తెరిచి ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే.. అందులోని డబ్బులు వారి చదువుకు, పెళ్లికి ఉపయోగపడతాయి.
  7. గతంలో తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ) చేసేవారు.
  8.  ఈ డబ్బును వారి పెళ్లి, చదువు కోసం ఉపయోగించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం సుకన్య సమృద్ది అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. 
  9. సుకన్య సమృద్ది అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేసే డబ్బుపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంది.


ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్ ప్రయోజనాలు..
  1. పదేళ్ల వయసులోపు ఉన్న ఆడ పిల్ల పేరుపై ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షులు సుకన్య సమృద్ది అకౌంట్‌ను తెరవొచ్చు.
  2.  ఒక కుటుంబంలో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై రెండు ఖాతాలు ప్రారంభించొచ్చు. 
  3. ఒక్కోసారి కవలలు పుడితే ముగ్గురి పేరుపై కూడా ఈ అకౌంట్‌ను తెరవొచ్చు.
  4.  కనీసం రూ.1,000తో సుకన్య సమృద్ది అకౌంట్‌ను ప్రారంభించాల్సి ఉంటుంది.
  5.  ఒక ఆర్థిక సంవత్సరంలో అకౌంట్‌లో గరిష్టంగా 1,50,000 వరకు మాత్రమే డిపాజిట్ చేయగలం.
  6. సుకన్య సమృద్ది అకౌంట్ ప్రారంభించిన దగ్గరి నాటి నుంచి 21 ఏళ్లు వరకు కొనసాగుతుంది. 
  7. ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు వరకు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  8.  ఎస్‌బీఐ సుకన్య సమృద్ది అకౌంట్‌పై 8.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.
  9.  గత త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతంగా ఉంది. అంటే వడ్డీ రేటు ఇప్పుడు 0.1 శాతం తగ్గింది. వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతుంది.
  10.  ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సుకన్య సమృద్ది ఖాతాలో డిపాజిట్ చేసిన, అర్జించిన వడ్డీ, విత్‌డ్రా మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. 
  11. తీవ్రమైన అనారోగ్యం, డిపాజిటర్ మరణించడం వంటి అనూహ్య పరిస్థితుల్లో అకౌంట్‌లోని డబ్బులు ముందుగానే వెనక్కు తీసుకోవచ్చు.
  12.  ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఉన్నత చదువులు లేదా పెళ్లి కోసం అకౌంట్ నుంచి 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. 
  13. మిగతా మొత్తాన్ని అకౌంట్ మెచ్యూరిటీ (21 ఏళ్లు) తర్వాత తీసుకోవాలి.