Information About CA Chartered Accountancy Course in Detail
సీఏ
ప్రస్తుతం ఇంటర్ తో పాటుగా CA కోర్సు చదవటం ప్రారంభించవచ్చు.
ఇంటర్ లో MPC/BiPC/CEC/HEC/MEC ఏ గ్రూప్ చదివిన వారు ఐనా CA చేయవచ్చు.
*CA కోర్సులోని దశలు*
*మొదటి దశ--ఫౌండేషన్*
*CA చదవాలి అనుకునే వారు మొదట CA ఫౌండేషన్ ప్రవేశ పరీక్ష రాయాలి.*
*ఇంటర్ విద్యార్థులు నమోదు చేసుకోవచ్చు.*
*రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 నెలలకు CA ఫౌండేషన్ రాయవచ్చు.*
*50% మార్కులకి ఆబ్జెక్టివ్, 50% మార్కులకి డిస్క్రిప్టివ్ పేపర్లు ఉంటాయి.*
*ఫౌండేషన్ పరీక్ష కి 4 పేపర్లు ఉంటాయి.*
*పరీక్ష 4 రోజులు జరుగుతుంది.*
*పేపర్ 1&2 లు డిస్క్రిప్టివ్ పద్ధతిలో మరియు పేపర్ 3&4లు ఆబ్జెక్టివ్ పద్దతిలో జరుగుతాయి.*
*ఈ పరీక్ష ప్రతి ఏడాది మే, నవంబర్ లలో నిర్వహిస్తారు.*
*ప్రతి పేపర్ లో 40% మార్కులు సాధించాలి.*
*సిలబస్--మార్కులు*
*పేపర్-1*
*ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ అకౌన్టింగ్*
*100 మార్కులు 3 గంటలు*
*పేపర్-2*
*బిజినెస్ లాస్--60మార్కులు మరియు బిజినెస్ కరస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్--40మార్కులు*
*100మార్కులు 3 గంటలు*
*పేపర్-3*
*బిజినెస్ మేథమాటిక్స్-40మార్కులు,లాజికల్ రీజనింగ్-20మార్కులు,స్టాటిస్టిక్స్-40మార్కులు*
*100మార్కులు 3గంటలు*
*పేపర్-4*
*బిజినెస్ ఎకనమిక్స్-60మార్కులు, బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జి-40మార్కులు*
*100మార్కులు 3గంటలు*
Information about CA Chartered Accountancy Course in Detail |
*రెండవ దశ--ఇంటర్*
*CA ఫౌండేషన్ పూర్తి చేసిన వారు CA ఇంటర్ కి అర్హులు*
*గ్రూప్-1 లో 4 పేపర్లు, గ్రూప్-2 ,లో 4 పేపర్లు ఉంటాయి.*
*విద్యార్థి వీలును బట్టి రెండు గ్రూప్ లు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు.*
*సిలబస్--మార్కులు*
*గ్రూప్--1*
*పేపర్-1*
*అకౌన్టింగ్ --100మార్కులు --3 గంటలు*
*పేపర్--2*
* కార్పొరేట్ లా--60 మార్కులు, అదర్ లా-- 40 మార్కులు*
*100 మార్కులు 3 గంటలు*
*పేపర్-3*
*కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌన్టింగ్--100 మార్కులు--3 గంటలు*
*పేపర్-4*
*ఇన్కమ్ టాక్స్--60 మార్కులు, ఇన్ డైరెక్ట్ టాక్స్-- 40 మార్కులు*
*100 మార్కులు 3 గంటలు*
*గ్రూప్--2*
*పేపర్--5*
*అడ్వాన్సుడ్ అకౌన్టింగ్--100 మార్కులు 3 గంటలు*
*పేపర్--6*
* ఆడిటింగ్&ఇన్సూరెన్స్ --100 మార్కులు 3 గంటలు*
*పేపర్--7*
* ఎంటర్ప్రైజె ఇన్ఫర్మేషన్ సిస్టం--50మార్కులు, స్ట్రాటెజిక్ మేనేజ్మెంట్--50మార్కులు*
*100 మార్కులు 3 గంటలు*
*ఫైనాన్షియల్ మేనేజ్మెంట్--60 మార్కులు, ఎకనమిక్స్ ఫర్ ఫైనాన్స్--40 మార్కులు*
*100 మార్కులు 3 గంటలు*
*ప్రాక్టీకల్ ట్రైనింగ్*
*CA ఇంటర్ పూర్తి చేసిన వారు మూడేళ్ళ ప్రాక్టీకల్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది.*
*CA ఇంటర్ పూర్తి చేసిన వారు ఒక ప్రాక్టీసింగ్ CA వద్ద ఆడిట్ సంస్థ లో మూడేళ్ళ పాటు ప్రాక్టీకల్ ట్రైనింగ్ పొందాలి.*
*ఏడాది ట్రైనింగ్ ముగిశాక, CA ఫైనల్ పరీక్ష రాసేలోగా CA ఇనిస్టిట్యూట్ నుంచి 4 వారాల aicitss శిక్షణ కూడా తీసుకోవాలి.*
*ట్రైనింగ్ సమయంలో 2000రూ నుండి 7000రూ వరకు ఉపకార వేతనం లభించే అవకాశం ఉంది.*
*రెండున్నర ఏళ్ళ ప్రాక్టీకల్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు CA ఫైనల్ పరీక్ష రాయటానికి అర్హులు.*
*మూడో దశ--ఫైనల్*
*మొత్తం 8 పేపర్లు ఉంటాయి.*
*రెండు గ్రూపులుగా ఉంటాయి.*
*విద్యార్థి వీలును బట్టి 8 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో గ్రూపు విడివిడిగా రాయవచ్చు.*
*ఏడాదికి రెండుసార్లు మే, నవంబర్ నెలలో నిర్వహిస్తారు.*
*సబ్జెక్టులు--మార్కులు*
*పేపర్1:*
*ఫైనాన్షియల్ అకౌంట్--100 మార్కులు --3 గంటలు*
*పేపర్2:*
*స్ట్రాటెజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ -- 100మార్కులు- -3గంటలు*
*పేపర్ 3:*
* అడ్వాన్సుడ్ ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్--100 మార్కులు --3గంటలు*
*పేపర్4:*
* కార్పొరేట్ (70మార్కులు), ఎకనామిక్ లాస్(30మార్కులు)--100మార్కులు--3గంటలు*
*గ్రూప్--2*
*పేపర్ 5:*
*స్ట్రాటెజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ పెర్ఫార్మన్స్ ఎవల్యూషన్--100మార్కులు--3గంటలు*
*పేపర్ 6:*
*ఎలక్టివ్ పేపర్, రిస్క్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ టాక్సీషన్, ఎకనామిక్ లాస్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్,మల్టీ డేసిపిలినరీ కేస్ స్టడీ--100 మార్కులు--3గంటలు*
*పేపర్7:*
* డైరెక్ట్ టాక్స్ లాస్ (70మార్కులు), ఇంటర్నేషనల్ ట్యాక్సీషన్ (30మార్కులు) --100మార్కులు- -3గంటలు*
*పేపర్8:*
* ఇన్ డైరెక్ట్ టాక్స్ లాస్,గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(75మార్కులు), కస్టమ్స్ అండ్ ఎఫ్టీపి (25మార్కులు)--100మార్కులు--3గంటలు*
*గమనిక*
*పేపర్ 6లో విద్యార్థి 1 సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి.*