Tuesday, April 30, 2019

6 common mistakes to avoid while filing income tax returns

6 Common Mistakes To Avoid While Filing Income Tax ReturnsTop 6 Common Mistakes To Avoid When Filing IT Returns | ITR filing: 6 most common mistakes and their solutions | 6 common mistakes to avoid while filing income tax returns

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చేసే 6 పొరపాట్లు: తప్పు చేస్తే ఈ సమస్యలు తప్పవు!


ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేందుకు సమయం దగ్గర పడుతోంది. జూలై 31, 2019లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంది. 90 రోజుల గడువు ఉంది. కానీ చాలామంది చివరి నిమిషంలో హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేస్తారు. అలాంటి సమయంలో తప్పులు దొర్లే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ డాక్యుమెంటేషన్, కన్ఫ్యూజన్, ఐటీఆర్ గురించి అంతగా తెలియకపోవడం వంటి కారణాలు కూడా తోడు కావడంతో పొరపాట్లు జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ముందుగానే ఇందుకు ప్రిపేర్ కావడం మంచిది. అప్పుడు హాయిగా ఉండొచ్చు. తెలిసో, తెలియకో చిన్న మిస్టేక్ జరిగినా అది సమస్యలకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో ఐటీ డిపార్టుమెంట్ నుంచి నోటీసులు కూడా రావొచ్చు. భారీగా ఫైన్ పడొచ్చు. సాధారణంగా ఎక్కువ మంది చేసే పొరపాట్లు, వాటి వల్ల వచ్చే నష్టం ఇలా ఉంటుంది.


6 Common Mistakes To Avoid While Filing Income Tax Returns Top 6 Common Mistakes To Avoid When Filing IT Returns | ITR filing: 6 most common mistakes and their solutions | 6 common mistakes to avoid while filing income tax returns ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చేసే 6 పొరపాట్లు: తప్పు చేస్తే ఈ సమస్యలు తప్పవు!2019/04/top-6-common-mistakes-to-avoid-while-filing-income-tax-returns.html
6 common mistakes to avoid while filing income tax returns

1 బ్యాంక్ వివరాలు తప్పుగా నింపితే...


మీ బ్యాంకు వివరాలు సరిగ్గా నింపండి. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్ (ఐఎఫ్ఎస్సీ) వివరాలు కూడా చూసుకోండి. బ్యాంకు వివరాలు సరిగ్గా లేకుంటే కనుక చాలా సీరియస్ సమస్య అవుతుంది. ఇలాంటి పొరపాట్లు దొర్లినప్పుడు మీ రీఫండ్ అమౌంట్‌కు చాలా సమయం తీసుకుంటుంది. లేదా రీఫండ్ అమౌంట్ ఆగిపోవడం లేదా తప్పుడు అకౌంట్‌కు వెళ్లే అవకాశముంటుంది.

2 ఐటీఆర్ ఫారంలో తప్పులు


ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ ఎనిమిది ఫామ్‌లు అందిస్తుంది. అందులో ప్రతి ఫామ్ ఒక్కో పర్పస్ కలిగి ఉంటుంది. అంటే వివిధ రకాల ట్యాక్స్ పేయర్లకు ఇవి వర్తిస్తాయి. ITR-1, ITR-2, ITR-3, ITR-4, ITR-5, ITR-6, ITR-7 and ITR-V ఉంటాయి. ఏం ఫాం ఎవరికి వర్తిస్తుందో తెలుసుకొని ఫిల్ చేయండి.


3 ఐటీఆర్ పాంలో వ్యక్తిగత వివరాల్లో తేడా


ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్స్‌లో చాలామంది చేసే మరో పెద్ద పొరపాటు వ్యక్తిగత వివరాలు తప్పుగా నింపడం. ఇలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరి నిమిషంలో కన్ఫ్యూజన్‌లో ఇలాంటి వివరాల్లో తప్పు చేసేవారు చాలామంది ఉంటారు. పేరు, అడ్రస్, పాన్, ఈ-మెయిల్ తదితర వాటిల్లో పొరపాటు దొర్లుతుంటుంది. ఇలా చేస్తే ఐటీఆర్ రిజక్ట్ చేసే పరిస్థితిని కూడా కొట్టి పారేయలేం. ఇలా చేస్తే రీఫండ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నింటిని సరిగా నింపాలి.

4 ఇన్‌కం సోర్స్‌ల డిక్లరేషన్


ట్యాక్స్ తప్పించుకోవాలనే ఉద్దేశ్యంతో కొందరు వివిధ మార్గాల్లో తమకు వచ్చే మొత్తం ఆదాయాన్ని చూపించరు. ఇది చాలామంది చేసే తప్పు. ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం వడ్డీ, సేవింగ్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, ఇన్సురెన్స్, పబ్లికి ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. ఇలా అన్నింటి ద్వారా వచ్చే వివరాలు ఇవ్వాలి. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పది శాతం టీడీఎస్ అప్లై అవుతుంది.5 మరో రెండు అంశాలు


ఐటీ రిటర్న్స్ ఫిల్ చేసే సమయంలో కొందరు ఇయర్‌ను తప్పుగా వేస్తారు. ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ గుర్తు పెట్టుకోండి. ఆరో అంశం ప్రాపర్టీ డిక్లరేషన్. మీకు ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉంటే దీనిపై మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇంట్లో ఎవరైనా అద్దెకు ఉన్నా లేదా బంధువులు ఉన్నా ట్యాక్స్ పేయర్ మాత్రం ఈ ప్రాపర్టీ పైన పన్ను చెల్లించాలి. కాబట్టి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో దానిని తెలియజేయాలి.