Saturday, January 5, 2019

TS నిరుద్యోగభృతి విధి విధానాలు - డిగ్రీ ఉందా ..ఉపాధి లేదా.. ఐతే మీకే నిరుద్యోగ భృతి


TS Nirudyoga Bruthi Scheme 2018 Online Registration | Apply for TS KCR Unemployment Allowance Scheme/ Yuva nestham Application form | ts nirudyoga bruthi online registration | ts nirudyoga bruthi website | Telangana ts nirudyoga bruthi registration | Telangana ts nirudyoga bruthi apply Online | ts nirudyoga bruthi Scheme 2019 | Telangana ts nirudyoga bruthi Scheme Online Registration www.telangana.gov.in




డిగ్రీ ఉందా ..ఉపాధి లేదా.. ఐతే మీకే నిరుద్యోగ భృతి..

విధి విధానాలు


  1. 35 ఏళ్ల వయోపరిమితి
  2. వ్యాపారం ఉండరాదు
  3. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేయరాదు
  4. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగమూ ఉండకూడదు
  5. నిరుద్యోగి కుటుంబానికి మూడెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు
  6. ఎలాంటి ప్రభుత్వ సహకారం పొంది ఉండరాదు


తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉపాధి లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్‌ ఉంది. డిగ్రీ పూర్తయి.. ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వడం కాకుండా ఎటువంటి ప్రైవేటు ఉద్యోగం లేకుండా.. సొంత వ్యాపారం లేకుండా ఉన్న వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో ఉపాధి కల్పన శాఖను వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఉపాధి కల్పన శాఖ ఇచ్చే ఆధారాలే ప్రామాణికంగా సర్కార్‌ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు తమ పేర్లను ఎంప్లాయీమెంట్‌ ఎక్చేంజ్‌ల్లో నమోదు చేసుకోవడం లేదు. అయినప్పటికీ ప్రాథమికంగా ఎంతమంది నిరుద్యోగులు ఉంటారో తెలుసుకోవడం కోసం ఉపాధి కల్పన శాఖ నుంచి వివరాలను సేకరిస్తున్నారు. నిరుద్యోగభృతికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ వారిలో కొందరు తమ కుటుంబం గడిచేలా ఏదో ఒకరకమైన ఉద్యోగం చేస్తుంటారని కాబట్టి నిరుద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 1నిరుద్యోగభృతి పొందాలంటే తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వారి వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. వారు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేయరాదు. ప్రభుత్వంలోని ఏ శాఖలో కూడా కాంట్రాక్ట్‌గానీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేయరాదు. నిరుద్యోగి కుటుంబానికి 3 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. నిరుద్యోగులుగా ఉన్న ఎటువంటి వ్యాపారం చేయకూడదు.. వాటితోపాటు నిరుద్యోగి కుటుంబంలోని వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం పొంది ఉండకూడదు. ఇటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని సర్కార్‌ ఆలోచిస్తోంది. వీటితోపాటు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న నిరుద్యోగ భృతి విధానాలను పరిశీలించనున్నారు. వారు రూపొందించిన విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగభృతి రూ. 1000 ఇస్తున్నందున వారు ఎలాంటి విధివిధానాలు రూపొందించారో కూడా సేకరిస్తున్నారు. వీటన్నింటీ ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలుకు విధివిధానాలను రూపొందించనున్నారు...


టీఎస్‌పీఎస్సీ ఓటీఆర్‌లో 24.54 లక్షల మంది నమోదు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉద్యోగాల కోసం సుమారు 24.54 లక్షల మంది నిరుద్యోగులు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను నిర్వహిస్తున్నవారు ఉన్నారు. గ్రూప్‌-4 ఉద్యోగం చేస్తూ గ్రూప్‌-2, గ్రూప్‌-1 ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కూడా ఓటీఆర్‌లో నమోదు చేసుకున్నారు. అలాగే వివిధ ప్రైవేటు స్కూల్స్‌తోపాటు, ప్రైవేటు కాలేజీల్లోనూ ఉపాధ్యాయులుగా ఉంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు ఉన్నారు. ఓటీఆర్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, గెస్టు లెక్చరర్లూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాలను పూర్తిస్థాయిలో సేకరించి విధి విధానాలను రూపొందించనున్నారు


5 లక్షల మందికి నిరుద్యోగ భృతి..

రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం నిరుద్యోగభృతిని ఎంత మందికి ఇస్తారో చెప్పాలని ప్రతిపక్షాలు శాసనసభతోపాటు శాసనమండలిలోనూ ప్రశ్నించాయి. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తారా? అని ప్రశ్నించారు. అందుకు సర్కార్‌ సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ భృతి ఇవ్వబోమని.. అందుకు సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. సర్కార్‌ నిరుద్యోగ భృతి కోసం రూ. 1810 కోట్లను కేటాయించింది. దీనినిబట్టి చూస్తే 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ. 3016 చొప్పున ఇస్తే నెలకు రూ. 150 కోట్ల 80 లక్షలు అవుతుంది. అదే ఏడాదికి రూ. 1809 కోట్ల 60 లక్షలు అవుతుంది. దీనిని బట్టి సర్కార్‌ సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.*


జూన్‌ నుంచి అమలు:
ఎన్నికల సందర్భంగా సీఎ కేసీఆర్‌ నిరుద్యోగులకు ఏప్రిల్‌ నుంచే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పినప్పటికీ విధి విధానాల రూపకల్పనతోపాటు నిరుద్యోగుల వివరాలు సేకరణ కోసం సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 2న జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన ప్రకటన చేసి … అదే నెల నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.*
నిరుద్యోగభృతిపై కసరత్తు

భరోసా.. ఆత్మగౌరవం లక్ష్యం
పక్కాగా, పారదర్శకంగా విధానం

మన తెలంగాణ /హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతీ నెలా భృతి ఇచ్చే హామీని అమలుచేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు రాష్ట్రా ల్లో ఈ పథకం అమలవుతున్న తీరు, రూపొ ందించిన మార్గదర్శకాలు, చెల్లిస్తున్న భృతి, ప్రభుత్వంపై పడే భారం తదితర పలు అంశాలను సంబంధిత అధికారులు అధ్యయనం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ హామీని ఇవ్వడం, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపర్చినందున హామీలను అమలు చే యడంపై ఇప్పటికే దృష్టి పెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు కూడా పూర్తి కాక ముందే దీనిపై దృష్టి పెట్టడం, అధికారులతో చర్చించడం, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును అధ్యయ నం చేయాల్సిందిగా ఆదేశించడం గమనార్హం.


నిరుద్యోగభృతిపై కసరత్తుtelangana-ts-nirudyoga-bruthi-scheme-registration-www.telangana.gov.in-government-focused-on-implementing-promise-of-unemployment

సిఎం ఆదేశించడమే తరువాయి అధికారులు కూడా అంతే వేగంగా చత్తీస్‌గడ్, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తీరుపై అధ్యయనం ప్రారంభించా రు. ఆయా రాష్ట్రాల నుంచి వివరాలను కూడా తె ప్పించుకున్నారు. ఆ రాష్ట్రాలు ఏ తరహాలో మార్గదర్శకాలను రూపొందించారు, వాటి వలన ఎంత సంఖ్యలో నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతోంది, లక్షం ఏ మేరకు ఫలిస్తోంది, ఈ భృతితో వారికి కలుగుతున్న ప్రయోజనం, ఉపాధి కల్పనకు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలు తదితరాలన్నింటిపై రాష్ట్ర ప్ఱభుత్వం అధ్యయనం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర స్వభావానికి, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్రం అమలుచేస్తున్న విధానం సహేతుకంగా ఉంటుందో, ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రయోజనం కలుగుతుందో రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు.


ఒకవేళ పదవ తరగతిని కనీస విద్యార్హతగా తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఎంత మంది నిరుద్యోగులు ఉంటారు, ఇంటర్ నుంచి ప్రారంభిస్తే ఎంత మంది ఉంటారు, గరిష్ట వయో పరిమితిని ఎక్కడి వరకు నిర్ణయించవచ్చు తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. నిరుద్యోగులకు అసంతృప్తి లేకుండా ఉండాలని, వీలైనంత ఎక్కువ మంది లబ్ది పొందేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినందున వయసును, విద్యార్హతను, కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని, ఇటీవలి కాలంలో ప్రైవేటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నందున మార్గదర్శకాల్లో వాటిని ఏ మేరకు ప్రస్తావించవచ్చు, ఉపాధి కల్పనా సంస్థ (ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్)లో పేరు నమోదు చేసుకోవడం తప్పనిసరిగా ఉండాలా అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలా ఎక్ఛేంజ్‌లో పేర్లు నమోదు చేసుకున్నవారు ఎంత మంది ఉంటారు, ఇంకా నమోదు చేసుకోవాల్సివారు ఎంత మంది ఉండే అవకాశం ఉంది తదితరాలపై కూడా అధ్యయనం జరుగుతోంది.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిర్వచనం
నిరుద్యోగులంటే ఎవరో నిర్వచించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న విధాన నిర్ణయం ఒక్కో తీరులో ఉంది. ఉదాహరణకు చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం 18 ఏళ్ళు నిండి 35 ఏళ్ళ లోపు ఉన్న పన్నెండవ తరగతిలో ఉత్తీర్ణులై వార్షికాదాయం రెండు లక్షల రూపాయలు దాటని ఉపాధి లేనివారందరినీ నిరుద్యోగులుగా పరిగణించింది. వీరికి ప్రతీ నెలా వెయ్యి రూపాయ ల చొప్పున ‘నిరుద్యోగ భృతి’ని అందిస్తోంది. యాభై శాతం లేదా అంతకంటే ఎక్కువ అంగవైకల్యంతో బాధపడుతున్న యువత అయినట్లయితే రూ. 1500గా అమలుచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వంసైతం ఇంతే మొత్తంలో నిరుద్యోగ భృతిని అందిస్తున్నప్పటికీ కనీస వయసును మాత్రం ఇరవై సంవత్సరాలుగా నిర్ణయించింది. కానీ హర్యానా ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా భిన్నమైన తీరులో అమలుచేస్తోంది. ఉత్తీర్ణులైతే నెలకు రూ. 100, పన్నెండవ తరగతి పాసైతే రూ. 900, గ్రాడ్యుయేషన్ పూర్తయితే రూ. 1500, పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తయితే రూ. 3000 చొప్పున వయసు 35ఏళ్ళు పూర్తయ్యేంత వరకు వర్తించేలా అమలుచేస్తోంది. వార్షిక ఆదా యం మాత్రం అన్నిరాష్ట్రాల తరహాలోనే రెండు లక్షలకు పరిమితం చేసింది.
రాష్ట్రాలు, నిరుద్యోగ భృతి అమలు
చత్తీస్‌ఘడ్ : 18 35 ఏళ్ళు, పన్నెండవ తరగతి ఉత్తీర్ణం, వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయలు; నిరుద్యోగ భృతి నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ. 1500
హిమాచల్‌ప్రదేశ్ : 20 35 ఏళ్ళు, పన్నెండవ తరగతి ఉత్తీర్ణం, వార్షిక ఆదాయం రెండు లక్షల రూపాయలు; నిరుద్యోగ భృతి నెలకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు రూ. 1500
కేరళ : 18 35 ఏళ్ళు, తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి. మూడేళ్ళ తర్వాత మూడు సంవత్సరాల సీనియారిటీ వర్తింపు; నెలకు రూ. 120 చొప్పున నిరుద్యోగ భృతి
మధ్యప్రదేశ్ : 22 35 ఏళ్ళ మధ్య యువత, పన్నెండవ తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి, వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు; నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 చొప్పున నిరుద్యోగ భృతి.
రాజస్థాన్ : 21 35 ఏళ్ళ మధ్య యువత, పన్నెండవ తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలి, వార్షికాదాయం రూ. 3 లక్షలు మించరాదు; పురుషులకు నెలకు రూ. 650, మహిళలకు రూ. 750 నిరుద్యోగ భృతి
హర్యానా : పదవ తరగతి పాసైంది మొదలు గరిష్టంగా 35 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు యువతకు నిరుద్యోగ భృతి పొందే అర్హత ఉంటుంది. వార్షికాదాయం మాత్రం రూ. 2 లక్షలు మించరాదు. పదవ తరగతి పాసైనవారికి నెలకు రూ. 100, పన్నెండవ తరగతి పాసైనవారికి రూ. 900, గ్రాడ్యుయేషన్ పూర్తయినవారికి రూ. 1500, పోస్టు గ్రాడ్యుయేషన్ పాసైనవారికి రూ. 3000 చొప్పున ప్రతీ నెలా నిరుద్యోగ భృతి చెల్లింపు
ఆంధ్రప్రదేశ్ : 22 35 ఏళ్ళ మధ్య యువత, గ్రాడ్యుయేషన్ లేదా రెండేళ్ళ డిప్లొమా పాసైనవారందరికీ, వార్షికాదాయం రెండు లక్షలు దాటరాదు; ప్రతీ నెలా వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.