TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Sunday, October 28, 2018

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?



1. ఎప్పుడైనా ఛార్జింగ్ 96% కంటే ఎక్కువ అవ్వనివ్వద్దు. 20% కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి.

2. మీ మొబైల్ పౌచ్ ఉంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టండి.

3. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు  హీట్ గా ఉంటే 5 లేదా 10 నిమిషాలు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టండి.

4. మొబైల్ ఛార్జింగ్ లో వున్నప్పుడు  wifi , hot spot, songs, net, calls, games use చేయకండి.

5. మొబైల్ కి వచ్చిన చార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ చార్జర్ ని కొనుక్కొని వాడండి, 100 Rs cheap చార్జర్ అస్సలు వాడకూడదు.

6. మీకు అవసరం లేని applications వెంటనే తీసేయ్యండి, కొన్ని games, applications వల్ల  మీ మొబైల్ విపరీతంగా హీట్ అవుతుంది. వాటిని uninstall చెయ్యండి.

7. మొబైల్ ఛార్జింగ్ ఐయినా వెంటనే వీడియో కాల్ , హెవీ గేమ్స్ అస్సలు ఆడకూడదు, ఛార్జింగ్ ఐనా తర్వాత మొబైల్ హీట్ ఉంటే 5 min. వరకు మొబైల్ ని పట్టుకోకుండా, ఫాంట్ జాబులో పెట్టుకోకుండా ఉంటే మంచిది.

8. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లేదా airoplane mode on చేసి ఛార్జింగ్ పెట్టడానికే ఎక్కువ  ప్రయత్నించండి. ఇలా చెయ్యడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది మీరూ safe.

9.మొబైల్ హీట్ గా వున్నప్పుడు తడి చేతులతో అస్సలు పట్టుకోకూడదు.

10. మొబైల్ ఛార్జింగ్ లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్ లో మొబైల్ ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఎక్కువ. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అవుతే వెంటనే స్విచ్ ఆఫ్ చేసి చల్లబడ్డాక on చెయ్యండి.

మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి?/2018/10/mobile-cell-phones-burst-precautions-to-take.html


11. మీ మొబైల్ బ్యాటరీ లైఫ్ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరీ తీసుకొని మార్చండి.

12.కొంతమంది ఛార్జింగ్ పెట్టి ear phones లో సాంగ్స్ వింటూంటారు .అలా చెయ్యడం  చాలా risk,  ఇప్పుడికే ముగ్గురు చనిపోయారు.

ఒకటే గుర్తుపెట్టుకొండి. Redmi ఒక్కటే కాదు Phone 6 , Samsung edge, Oppo, Vivo, Lenovo, Cool pad mobiles కూడా కొన్ని పేలాయి . ఇండియాలో Redmi మొబైల్స్ sales ఎక్కువ కాబట్టి ఎక్కువ అవే పేలుతున్నాయి అనిపించడం సహజం .

మనం మొబైల్  వాడే విధానాన్ని బట్టే మనకు Risk వుంటుంది.. Mobile company బట్టి కాదు,  మొబైల్ లో చెత్త applications , heavy గేమ్స్ ని వాడకూడదు.