Wednesday, February 22, 2017

TS SSC/10th Public Exams Instructions to Invigilators

SSC Invigilator లకు సూచనలు

Please read this instructions carefully

 Invigilators ఎవరు కూడా examination centre కు cell phone  తీసుకురావద్దు.

1. ఇన్విజిలేటర్ లందరూ 1st రోజు నుంచి  8:30 సెంటర్ లో ఉండాలి.

2. అమ్మాయిలకి చెక్ చేయడానికి ప్రత్యేక కౌంటర్(మహిళ ఉపాధ్యాయులు) నిర్వహించాలి

3. ఇన్విజిలేటర్ల ని లాటరీ ద్వారా రూమ్ కేటాయించడం జరుగుతుంది

4.ఇన్విజిలేటర్ అందరు కూడా 9.15am లోగా మీకు కేటాయించిన హాల్ లోకి వెళ్లి పోవాలి

5. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లే ముందు తప్పకుండా ఐడెంటిటీ కార్డు ధరించాలి

6. విద్యార్థుల దగ్గర ఇతరత్రా పేపర్ ఏవి లేకుండా చూసుకోవాలి


7.OMR Sheet లను విద్యార్థులకు ఇచ్చేటప్పుడు వారి పేర్లు బిగ్గరగా చదువుతు ఇవ్వాలి

8.Main Answer Sheet లపై SNo ఉందా లేదా చెక్ చేసుకోవాలి

9. అలాగే ఎడిషనల్ సీట్ పైన నంబర్స్ ఉన్నాయా అది సీరియల్ లోనే ఉన్నాయా చూసుకోవాలి

10. విద్యార్థుల సమక్షంలోనే OMR పై, మెయిన్ ఆన్సర్ షీట్ పై సంతకం చేయాలి

11.9.30am లోగా స్టిక్కర్స్ వేయడం సైన్  చేయడం అయిపోవాలి

12. సంతకం చేసే ముందు వారి హాల్ టికెట్లను చెక్ చేయాలి.

13 OMR షీట్ పైన, అడిషనల్ షీట్ పైన Main Answer Sheet నంబర్ వేయించాలి

14 ఎక్కడ కూడా హాల్ టికెట్ నంబర్ రాయవద్దు క్వశ్చన్ పేపర్ పైన మాత్రమే ప్రతి పేజీలో HT No. వేయమని చెప్పాలి.

15.స్టూడెంట్స్ దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్ లు, సెల్ ఫోన్లు లేకుండా చూసుకోవాలి

16.ఎడిషనల్ షీట్, పార్ట్-బి పైన, గ్రాఫ్ పైన ఇన్విజిలేటర్ సంతకం చేయాలి

17. విద్యార్థులకు ఎడిషనల్ ఇచ్చేటప్పుడు మీకు ఇవ్వబడిన ప్రొఫార్మా లో ఆ విద్యార్థికి ఇచ్చిన ఎడిషనల్ సీట్ నెంబర్ ని ఆ విద్యార్ధి హాల్ టికెట్ నెంబర్ ఎదురుగా ఎంటర్ చేయాలి.

18ఒక్కో విద్యార్థికి ఎడిషనల్ షీట్ ఎన్ని సప్లై చేయబడ్డాయి పూర్తి సమాచారం ఉండాలి.

19 ఎగ్జామ్ రాయడం పూర్తి అయిన తర్వాత చివరి పేజీలో విద్యార్థుల చేత THE END అని రాయించి invigilator సంతకం చేయాలి

20.విద్యార్థులను బయటకి మాటిమాటికి పంపవద్దు ఒకవేళ వాటర్, టాయిలెట్ పంపించ గలిగితే వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి.

21 ఎగ్జామ్ అయిపోయే వరకు విద్యార్థులను బయటకు పంపించ కూడదు.

22. ఎగ్జామ్ టైమ్ పూర్తి అయిపోయాక విద్యార్థుల నుంచి ఆన్సర్ షీట్ అందరి వద్ద నుండి తీసుకునీ ఒకసారి నెంబర్ చెక్ చేసుకుని విద్యార్థులందరినీ ఒకేసారి బయటికి పంపించాలి

 23.విద్యార్థులు ఎడిషనల్ షీట్ తీసుకునేటప్పుడు వారు తీసుకున్న క్రమంలో కుడి వైపు పై భాగంలో సీరియల్ నంబర్ వేయమని చెప్పాలి

 24.విద్యార్థులు ఆన్సర్ పేపర్స్ ని tag చేసేటప్పుడు ఎడిషనల్ షీట్ సీరియల్ గా ఉండేలా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అలాగే బిట్ పేపర్ ని చివరగా tag చేయమని చెప్పాలి కొంతమంది విద్యార్థులు తెలియక Part-B బదులు క్వశ్చన్ పేపర్ ని టైప్ చేసి బిట్ పేపర్ ని ఇంటికి తీసుకెళ్లి ప్రమాదం ఉంది దాన్ని తప్పకుండా గమనించాలి.

25.స్టూడెంట్స్ దగ్గరినుండి ఆన్సర్ షీట్ తీసుకున్నాక అవి వరుసక్రమంలో పెట్టాలి.

 26.ఆన్సర్ సీట్లను సంబంధిత వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి

 27.ఆన్సర్ షీట్స్ బండిల్ ప్యాక్ అయ్యేంతవరకు సహకరించాలి

28. ఇతర వ్యక్తులను ఎగ్జామ్ హాల్ లోనికి రానివ్వకూడదు

29.ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లను మారకూడదు

30 ఏదైనా నా అవసరమై బయటికి వెళ్లాల్సి ఉంటే రిలీవర్ను పెట్టి వెళ్లాలి

31.ఇన్విజిలేటర్ దగ్గర సెల్ఫోన్ ఉండకూడదు

32 గ్రౌండ్ లెవెల్ లో ఇన్విజిలేటర్ మెయిన్ కాబట్టి ఎగ్జామ్ సంతృప్తికరంగా నడపగలిగితే సెంటర్ మంచిగా ఉంటుంది

 33.మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ ని సీరియల్గా ఉండేలా చూసుకోవాలి

34. ప్రశ్నా పత్రములు అదే రోజున కు సంబంధించినవా? కావా? సబ్జెక్టు డినామినేషన్, మీడియం, కోడ్ లను చూసుకోవాలి

 35.రాంగ్ క్యూస్షన్ పేపర్ వస్తే CS లేదా DO లకు రిటర్న్ చేయాలి

36. ఇన్విజిలేటర్ సీటింగ్ అరేంజ్మెంట్ ను మార్చకూడదు

37.ఒకే స్కూల్ పిల్లలు వరుసగా వస్తే సి ఎస్ తెలియజేయాలి

38. ఫోటో అటెండెన్స్ షీట్ పై విద్యార్థులు సంతకం చేయించాలి తర్వాత ప్రతి పేజీలో invigilater సంతకం చేయాలి

39. విద్యార్థులు ఎగ్జామ్ ముగిసిన పిదప వారు ఎన్ని ఎడిషనల్ షీట్ ఉపయోగించారో ఓఎంఆర్ మరియు మెయిన్ ఆన్సర్ షీట్ పై వేయించాలి

 40.ఎవరైనా విద్యార్థులు ఒకరి బదులు మరొకరి పరీక్ష రాస్తూ నట్లు గమనిస్తే సి CS, DO లకు తెలియజేయాలి

41. దారములు కట్టేటప్పుడు జారుడు ముడి లేకుండా చూసుకోవాలి

42 ఎవరైనా విద్యార్థి మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ కి కట్టాల్సిన వాటిని టాప్ చెయ్యకపోతే ఒక రిటన్ రిపోర్ట్ ను సి ఎస్ కు ఇవ్వాలి

43. మాల్ ప్రాక్టీస్ విషయంలో అడిగిన వివరాలను ఇన్విజిలేటర్ ఇవ్వాల్సి ఉంటుంది

44. పరీక్ష ముగియడానికి పది నిమిషాల ముందు విద్యార్థులచే tag చేయించాలి

45.OMR పై బార్ కోడ్ డిస్టర్బ్ చేయకుండా చూడాలి

46. ఆబ్సెంట్ విద్యార్థుల విషయంలో ఓ ఎం ఆర్ ను రెడ్ ఇంక్ తో క్యాన్సిల్ చేసి కొట్టి వేయాలి బార్కోడ్ డిస్ట్రబ్ చేయరాదు

47. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ షీట్ లోని వైట్ స్పేస్ ను లేదా మిగిలిన పేజీలను స్ట్రైక్ చేయాలి

48.సమాధాన పత్రాలు తీసుకునే ముందు అన్ని వివరాలు OMR లోని పార్ట్ 1,2 లలో అన్ని వివరాలు వ్రాయబడినవా?లేదా? అని పరిశీలించాలి

49. ఆన్సర్ షీట్ ను పరస్పరం మార్చుకోకుండా చూడాలి. ఈ పరిస్థితులలో మాల్ ప్రాక్టీస్ వర్తిస్తుంది

50. ఇన్విజిలేటర్లు మెయిన్ ఆన్సర్ బుక్ లెట్, ఎడిషనల్ లపై పూర్తి సంతకం చేయాలి గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్ లపై ఇనిషియల్ సరిపోతుంది




TS SSC/10th Public Exams Instructions to Invigilators and Seating Order for Students 2017


TS SSC/10th Public Exams Instructions to Invigilators and Seating Order for Students Instructions on Conducting SSC Public Examination to invigilators about their job chart at the centre These instructions are divided into two Parts. Part-Ideals with General Instructions applicable to all papers. TS SSC/10th Public Examinations March 23017 Instructions to Invigilators Download |  Read all the Instruction scarefully and incase of any doubt,please discuss with the Chief Superintendent and the Departmental Officer. Any lapse on his/her part  wil lcaus eirrevocable damage to the candidates.  APPOINTMENT ORDER REPORTING FOR DUTY.  RECEIPT OF QUESTION PAPERS: ts-ssc-10th-public-examinations-march-instructions-to-invigilators-download The Invigilators are informed that Codingis being implemented for all the subjects of SSC,OSSC and Vocational Public Examinations,March,2017also.Detailed instructions to be followed while conducting examinations are given in the Part- II of these instructions.Any deviation/mistake /lapse on the partofthe invigilator will lead to severe consequences such as with hold in  the results of the candidates in his room,non identification of the answerscripts of the candidate and severe disciplinary action against the invigilator concerned.


Download SSC Invigilation Instructions