TG DOST Admission 2025- Click Here TS SSC Suplementary Exams 2025 Time table TGSWREIS TG Social Welfare Junior College Admissions 2025

Search This Blog

Monday, October 5, 2015

AP transfer

PAATASHAALA.IN
����వెబ్ఆప్షన్ ఇచ్చేటప్పడు చాలా ముందుచూపుతో చేయాలని విజ్ఞప్తి.
ముందుగానే మీరు ఇష్టపడే ఖాళీలను list out చేసుకొనండి, అలాకాక నెట్ ఓపెన్ చేసి, ఖాళీలను వెతుకుంటావుంటే తికమక పడేదానికి అవకాశం వుంటుంది. పొరపాటున ఏదో ఒకటి ఆప్షన్ ఇస్తాములే, అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.

��ఇప్పటికి బదిలీ నుండి విరమించుకున్న (కన్ఫర్మేషన్ ఇవ్వని వారు )వారి పేర్లు సీనియారిటీ జాబితా నుండి తొలగించి ఈ రోజు సాయంత్రము ఎవరైతే బదిలీ కోరుకుంటున్నారో వారి జాబితానే వెబ్సైటు లో ఉంచడము జరిగింది.ఇక పై బదిలీ జాబితా లో మార్పులు చాలావరకు వుండవు .కావున బదిలీ జాబితా లో మీ సీనియారిటీ నెంబర్ ఇక పై మారకపోవచ్చు.వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రక్రియ ఏ క్షణము నుండయినా మొదలవవచ్చు .కావున మీరు  ఎంచుకోబోయే పాఠశాలల వివరాలతో జాబితా తో సిద్దముగా వుండండి.

��వెబ్ ఆప్షన్స్ లో ప్రస్తుతము ఖాళీగా చూపబడిన పాఠశాలల  తో పాటు ప్రస్తుతము బదిలీ ప్రక్రియలో ఉన్న వారి పాఠశాలలను  కూడా arising  vacancies గా చూపించాలి.
మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు క్లియర్ vacancies తో పాటు arising vacancies కూడా కలిపి ఆప్షన్ ఇచ్చుకోవచ్చు .కొంత మంది క్లియర్ vacancies కి మొదట ఆప్షన్ ఇచ్చి తరువాత బదిలీ కి దరఖాస్తు చేసినవారి పాఠశాల  కు ఆప్షన్ ఇచ్చే అవకాశము  వుంది .అలా చేస్తే మీరు నష్టపోయే అవకాశము వుంది .

��బదిలీ కి ఆప్షన్ ఇచ్చే పాఠశాల  ప్రస్తుత రోల్ తెలుసుకోండి .
బదిలీకి దరఖాస్తు చేసుకొన్న వారు కనీసము రెండు ఆప్షన్స్ ఇవాలి (మొదట మీకు నచ్చిన పాఠశాల  ..రెండవది మీరు పని చేస్తున్నది .మీరు మొదట ఆప్షన్ ఇచ్చిన పాఠశాల  రాకపోతే మీరు ఎక్కడకి బదిలీ కారు )బదిలీ కోరుకొనే వారు గరిష్టముగా199 ఆప్షన్స్ ఇవ్వవచ్చు.

��5/8 మరియు  హేతుబద్దికరణ లో ఉన్న ఉపాధ్యాయులు గరిష్టముగా ఆప్షన్స్ ఇవ్వాలి .

��వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు పాఠశాల కోడ్ చూసుకోండి .

��వెబ్ ఆప్షన్స్ ఇచ్చేముందు మీకు వచ్చే paasword ఇతరులకు చెప్పకండి.