Tuesday, May 4, 2021

How To Know your nearest vaccination centres through Whatsapp

How To Know your nearest vaccination centres through Whatsapp

The corona second wave in the country is in full swing. More than three lakh cases are being registered every day. With this, the Center has intensified the issue of vaccination and asked to register at cowin.gov.in for that. Registration is also possible through Arogya Setu and Umang apps. The government has set up a WhatsApp bot to provide details if you want to be vaccinated. That bot will give you the details of the vaccination. What to do for it?   

How To Know your nearest vaccination centres through Whatsapp


1. First save the number 9013151515 on your smartphone. Then go to WhatsApp and search for the number with the name you saved.

2. Send the message Namaste to the number that came up in the search. The bot for the MyGov Corona  Helpdesk will be activated immediately.



3. Then you will get the above message. From there you have to select the number you want and send it back. For example, if you want the details of nearby vaccination centers, you should reply '1'.

4. Then it asks to reply with 1 for covid centers information. You will  be asked to enter your pin code as soon as you reply.

5. After entering the six digit pin code, it will take some time for the details of the covid vaccination centres near that pin code and the availability of vaccination slots there.

6. Along with the details of the vaccination centres, there is also a link to apply for vaccination.

7. As mentioned earlier, this bot comes not only with details of vaccination centres but also more details like corona updates, success stories, Fact check, corona features. If you send Namaste or hi again for this you will get the list. If you select the number you want and reply, the information will come.

8. However, this bot only works in English. The bot does not respond to any message in Telugu. The answer comes that I was asked for information beyond my level. 

Apart from WhatsApp, you can also look for nearby vaccination centres through the MapmyIndia platform or even the CoWIN platform

WhatsApp: వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. దాని కోసం ఏం చేయాలంటే?

 తొలుత మీ స్మార్ట్‌ ఫోన్‌లో +919013151515 నెంబరును సేవ్‌ చేసుకోండి. ఆ తర్వాత వాట్సాప్‌లోకి వెళ్లి మీరు సేవ్‌ చేసిన పేరుతో నెంబరును వెతకండి.

 సెర్చ్‌లో వచ్చిన నెంబరుకు Namaste అని మెసేజ్‌ పంపండి. (నమస్తే అనే కాదు, ఇంగ్లిష్‌లో ఏ పదం మెసేజ్‌గా పంపినా ఓకే) వెంటనే  MyGov Corona Helpdeskకు సంబంధించిన బాట్‌ యాక్టివ్‌ అవుతుంది.

అప్పుడు మీకు పై మెసేజ్‌ వస్తుంది. అందుంలోంచి మీకు కావాల్సిన నెంబరును ఎంచుకొని తిరిగి పంపాలి. ఉదాహరణకు మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు కావాలంటే ‘1’ అని రిప్లై ఇవ్వాలి.

ఆ తర్వాత  కొవిడ్‌ సెంటర్స్‌ సమాచారం కోసం ‘1’ అని రిప్లై ఇవ్వమని అడుగుతుంది. మీరు అలా రిప్లై ఇవ్వగానే మీ పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేయమని అడుగుతుంది.

ఆరు అంకెల పిన్‌ కోడ్‌ను ఎంటర్‌ చేసిన తర్వాత.. కొంచెం సమయం తీసుకొని ఆ పిన్‌ కోడ్‌కు దగ్గరలో ఉన్న కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు, అక్కడ ఉన్న వ్యాక్సినేషన్ స్లాట్స్‌ అవైలబిటీ వివరాలు తెలియజే స్తుంది.

వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలతోపాటు వ్యాక్సినేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్‌ కూడా వస్తుంది.

ముందుగా చెప్పుకున్నట్లు ఈ బాట్‌లో  వ్యాక్సినేషన్‌ సెంటర్ల వివరాలు మాత్రమే కాకుండా కరోనా అప్‌డేట్స్‌, సక్సెస్‌ స్టోరీస్‌, ఫాక్ట్‌ చెక్‌, కరోనా లక్షణాలు లాంటి మరిన్ని వివరాలు కూడా వస్తాయి. దీని కోసం మరోసారి Namaste అనో లేక Hello అనో ఏదో ఒకటి పంపిస్తే మీకు లిస్ట్‌ వస్తుంది. అందులోంచి మీకు కావాల్సిన నెంబరు ఎంచుకొని రిప్లై ఇస్తే ఆ సమాచారం వస్తుంది.

 అయితే ఈ బాట్‌ ఆంగ్లంలో మాత్రమే పని చేస్తుంది. తెలుగులో ఏ మెసేజ్‌ పెట్టినా బాట్‌ స్పందించదు. నా స్థాయికి మించి సమాచారం అడిగారు అని సమాధానం వస్తుంది.