Tuesday, December 25, 2018

10వ తరగతి విద్యార్థులకు సూచనలు in English Subject

10వ తరగతి విద్యార్థులకు సూచనలు in  English Subject



10వ తరగతి విద్యార్థులకు సూచనలు in English Subject/2018/12/ssc-10th-class-instructions-to-students-to-get-good-marks-in-english.html



  1. ఆంగ్లం పరీక్ష అంటేనే తెలుగు మాధ్యమంలో చదివే చాలా మంది విద్యార్థులకు భయం. మాకు ఆంగ్లం రాదు అన్న అపోహే దీనికి కారణం. రోజువారీ తెలుగు పద ప్రయోగంలోనే చాలా వరకు ఆంగ్లపదాలు దొర్లుతుంటాయి. అవే పదాలను సరైన క్రమంలో సందర్భానుసారంగా వాక్యరూపంలో వినియోగిస్తే ఆంగ్ల భాషపై పట్టు సాధించినట్లే.
  2. పదో తరగతి పరీక్షల్లో ఆంగ్లం పేపర్‌లో మూడు భాగాలుంటాయి. రీడ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి రోజుకు రెండు లేదా మూడు పారాగ్రాఫ్‌లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ పారాలో ఉన్న పాత్రల ప్రవర్తన అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీలైతే రోజూ ఒక కథ చదవడం అవసరం. ఇది పేపర్‌-2లో మంచి మార్కులు సాధించడానికి దోహదపడుతుంది.
  3. వొకాబులరీ అండ్‌ గ్రామర్‌(పదజాలం, వ్యాకరణం) పరంగా తీసుకుంటే.. చదివిన కథలో పదాలను గుర్తించి వాటి అర్థం మారకుండా వేరే పదాలని వాడటం నేర్చుకోవాలి. వీలైతే గుర్తించిన పదాలకు వ్యతిరేక పదాలను, అర్థాలను, క్రియాపదాల వివిధ వాడుక రూపాలను నేర్చుకుంటే చాలా వరకు పదజాలం వచ్చినట్లే. వ్యాకరణంలో యాక్టివ్‌ వాయిస్‌ నుంచి ప్యాసివ్‌ వాయిస్‌, డైరెక్ట్‌ నుంచి ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, డిఫైనింగ్‌, నాన్‌ డిఫైనింగ్‌ రిలేటివ్‌ క్లాజ్‌ లాంటివి ఎక్కువగా నేర్చుకోవాలి.
  4. క్రియేటివ్‌ రైటింగ్‌ (సృజనాత్మకంగా రాయడం) విషయానికొస్తే ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రశ్నలో ఇచ్చిన ఆధారాలను సరిగ్గా ఉపయోగించి ఏదైనా విషయాన్ని కళ్లకు కట్టినట్లు సొంతంగా రాయడం అవసరం. ముందుగా ఇచ్చిన ప్రశ్నను చదివి దానికి మైండ్‌ మ్యాప్‌ను తయారుచేసుకోవాలి. రాయాల్సిన సమాచారాన్ని వరుస క్రమంలో పెట్టుకుని అప్పుడు రాయడం ఆరంభించేలా సాధన చేయాలి.
  5. ఆంగ్ల పరీక్ష సాధనకు సంబంధించి 19 అంశాలపై దృష్టి సారించాలి. న్యారేటివ్‌ రాయడం బాగా నేర్చుకుంటే స్టోరీ రైటింగ్‌, డిస్క్రిప్షన్‌, డ్రామా, కన్వర్జేషన్‌ సులభంగా వస్తుంది. వ్యాసం రాయడం నేర్చుకుంటే స్పీచ్‌ లెటర్‌ రాయడం వస్తుంది.* *వీటన్నింటికీ దేని నిబంధనలు దానికి పాటించాలి.