Friday, August 4, 2017

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వగృహం!

Latest News

*బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు విక్రయం*

*బండ్ల గూడలో మొత్తం 1501 ఫ్లాట్లు  విక్రయానికి సిద్దంగా ఉండగా.. అందులో వర్క్స్ పూర్తి స్థాయిలో ఉన్నవి 419 ఫ్లాట్లు చ. అడుగు 3వేల రూ.చొప్పున,*

*కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 1082 ప్లాట్లు చ.అడుగు 2750 రూ. చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.*

*పోచారంలో 1328 ఫ్లాట్లు 2500 రూ.చొప్పున,*

*కొద్ది స్థాయిలో అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లు 2250 రూ. చొప్పున విక్రయం*

*బండ్ల గూడలో* 

*3BHK డీలక్స్ 345 ఫ్లాట్లు,*

*3BHK 444 ఫ్లాట్లు,*

*2BHK 712 ప్లాట్లు..*

*పోచారంలో..*

*3BHK డీలక్స్ 91ఫ్లాట్లు,*

*3BHK 53 ఫ్లాట్లు,*

*2BHK 884 ఫ్లాట్లు,*

*1BHK 442 ఫ్లాట్లు విక్రయానికి సిద్దంగా ఉన్నాయి*

*3BHK డీలక్స్ ఫ్లాట్ లో ఒక హల్, 3 బెడ్రూంలు, 3 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్, పూజ రూమ్, బాల్కనీ సౌకర్యాలుంటాయన్నారు.*

*3BHK ఫ్లాట్లో ఒక హాల్, 3బెడ్రూం, 2 అటాచ్డ్ టాయిలెట్స్, కిచెన్, పూజ రూమ్, బాల్కనీ...*

*2BHK ఫ్లాట్లో హాల్ విత్ కిచెన్, 2 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ..*

*1BHKఫ్లాట్లు హాల్ విత్ కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూం, బాల్కనీ ఉంటాయని చెప్పారు.*

*సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు ఆసక్తి కలిగిన వారు మీ సేవా ద్వారా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దీనికి సంంధించి ప్రత్యక యాప్ కూడా అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు.*

*అర్హులైన వారికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది*

www.swagruha.telangana.gov.in సైట్ ను *పేపర్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 30 రోజుల  వరకు విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చని తెలిపారు.*

*ఆసక్తికలిగిన కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారం లో 6 చొప్పున మోడల్ హౌస్ లు ఏర్పాటు చేశామని, వాటిని సందర్శించవచ్చన్నారు. ఆసక్తి కలిగిన వారి కోసం అక్కడికక్కడే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఏర్పాట్లు.*

*అప్లికేషన్ ఫీజు 1000 రూ.(నాన్ రిఫండబుల్)...*

*లబ్దిదారుల ఎంపిక లాటరీ పద్ధతిలో ఉంటుంది*



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
2017 News
*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వగృహం!*

*డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్ల విక్రయానికి సర్కారు నిర్ణయం*

*బండ్లగూడ, పోచారంలలో 3,200 రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లు*

*మునిసిపల్‌ ఎన్నికల తర్వాత అమ్మకానికి యోచన*

*'ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌' పద్ధతిలో అందజేత*

*ఒక్కోటీ రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షలు*

*వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు*


Telangana State to auction Rajiv Swagruha flats Online Rajiv Swagruha flats online auction from month-end | Rajiv Swagruha flats in city to be sold online to government employees | Govt. fixes price for Bandlaguda, Pocharam Rajiv Swagruha flats | Rajiv Swagruha flats to govt. staff at concessional price | Flats at 50% discount for government staff The State Government has decided to sell 3,719 flats constructed under Rajiv Swagruha Scheme at Bandlaguda and Pocharam to Government Employees through Online Auction./2017/08/telangana-state-to-auction-rajiv-swagruha-corporation-flats-online-booking-open-pocharam-bandlaguda-flats-to-government-employees.html

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గృహ యోగం పట్టనుంది. అద్దె ఇళ్లలో ఉంటున్న మధ్యతరగతి ఉద్యోగులకు త్వరలో 'సొంతింటి కల' నెరవేరబోతోంది.



రోడ్లు, డ్రైనేజీ వంటి అన్ని వసతులతో కూడిన రెండు పడక గదుల ఇళ్లను రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షలకే ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో వారికి విక్రయించనుంది.

 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ నిర్మించిన ఇళ్లను ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని గతంలోనే తీసుకుని జీవో కూడా జారీ చేసినా.. ఇప్పుడు అమల్లో పెట్టబోతోంది. 'ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌' పద్ధతిన ఈ ఇళ్లను కేటాయిస్తుంది.

ఇందుకు బండ్లగూడ, పోచారంలలో 3,200 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. సకల హంగులతో గృహ ప్రవేశాలే ఆలస్యమన్నట్లు సిద్ధమయ్యాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మునిసిపల్‌ ఎన్నికల తర్వాత ఉద్యోగులు కొత్త ఇళ్లను పొందే అవకాశముంది. పట్టణాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో గృహాలను అందించాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా హైదరాబాద్‌ శివార్లతోపాటు వివిధ జిల్లాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. మొత్తం 32 ప్రాజెక్టుల ద్వారా 46,565 యూనిట్ల (అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు)ను నిర్మించాలని తలచింది. దాదాపు రూ.8504 కోట్ల అంచనా వ్యయంతో 4కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఫ్లాట్ల నిర్మా ణం చేపట్టింది. ఈ ప్రాజెక్టుల్లో కొన్ని పూర్తి కాగా.. మరికొన్ని వివిధ దశల్లో ఉండిపోయాయి.

 ఇందులో భాగంగా *నాగోల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని బండ్లగూడలో 316 ఫినిష్డ్‌, 1,929 సెమీ ఫిని్‌ష్డతో కలిపి మొత్తం 2,245 ఫ్లాట్లను నిర్మించింది.*


 ఇక్కడ ఇతర మౌలిక సదుపాయాలు కూడా పూర్తయ్యాయి. నగర శివారులోని పోచారం ప్రాజెక్టులో 969 ఫినిష్డ్‌, 505 సెమీ ఫిని్‌ష్డతో కలిపి మొత్తం 1,474 ఫ్లాట్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది.

రెండు ప్రాజెక్టుల్లోని మొత్తం 3,719 ఫ్లాట్లలో కొన్ని సింగిల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూం ఫ్లాట్లు అమ్ముడుపోగా.. 3,200 డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వీటినే ఉద్యోగులకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

 నిజానికి, ఈ ఫ్లాట్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తామం టూ 2016లోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 21.12.2016న జీవో నంబర్‌ 201ను జారీ చేసింది. అప్పటి సీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ సిఫారసుల మేరకు ధరను కూడా నిర్ణయించింది.

*ఫినిష్డ్‌ ఫ్లాట్లకు బండ్లగూడలో చదరపు అడుగుకు రూ.1900, పోచారంలో రూ.1700, సెమీ-ఫినిష్డ్‌ ఫ్లాట్లకు బండ్లగూడలో రూ.1700, పోచారంలో రూ.1500 చొప్పున నిర్ణయించింది.*

 మొదట దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు మొదట ఇళ్లను కేటాయిస్తామంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది. *మొదట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డుల ఉద్యోగులకు, వర్సిటీలు, సొసైటీల ఉద్యోగులకు ఇళ్లను విక్రయిస్తామని పేర్కొంది.*


 *లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి గృహ రుణాలు ఇప్పించడంలో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ సహకరిస్తుందని తెలిపింది.*

 వాయిదాల పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చని సూచించింది. అప్పట్లో ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ.. అనివార్య కారణాలతో ఫ్లాట్ల విక్రయం జరగలేదు.


*మునిసిపల్‌ ఎన్నికల తర్వాత..*


రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్లను విక్రయించడానికి ఇప్పుడు ప్రభుత్వమే అత్యంత ఆసక్తితో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వీటిని విక్రయించాలని ఇటీవలే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీనికి ఉన్న ప్రతిబంధకాలను క్రమంగా తొలగిస్తోంది. 2016లో జారీ చేసిన 201 జీవో మార్గదర్శకాల ప్రకారం వీటిని కేటాయించాలని నిర్ణయించింది. మునిసిపల్‌ ఎన్నికల తర్వాత ఈ ఫ్లాట్ల విక్రయాలను చేపడతామని రాష్ట్రమంత్రి ఒకరు తెలిపారు.



*ఒక్కో డబుల్‌ బెడ్‌రూం ఫ్లాటు ధర 22 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు*.

విక్రయ ప్రక్రియను చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.100 కోట్లను కేటాయించింది. బ్యాంకుల నుంచి ఉన్న ప్రతిబంధకాన్ని కూడా ప్రభుత్వం తొలగించేసింది.

.....................…...…………...………………………...……………………………………………….
    







Telangana State to auction Rajiv Swagruha flats Online


Rajiv Swagruha flats online auction from month-end | Rajiv Swagruha flats in city to be sold online to government employees | Govt. fixes price for Bandlaguda, Pocharam Rajiv Swagruha flats | Rajiv Swagruha flats to govt. staff at concessional price | Flats at 50% discount for government staff

The State Government has decided to sell 3,719 flats constructed under Rajiv Swagruha Scheme at Bandlaguda and Pocharam to Government Employees through Online Auction.


Telangana State to auction Rajiv Swagruha flats Online Rajiv Swagruha flats online auction from month-end | Rajiv Swagruha flats in city to be sold online to government employees | Govt. fixes price for Bandlaguda, Pocharam Rajiv Swagruha flats | Rajiv Swagruha flats to govt. staff at concessional price | Flats at 50% discount for government staff The State Government has decided to sell 3,719 flats constructed under Rajiv Swagruha Scheme at Bandlaguda and Pocharam to Government Employees through Online Auction./2017/08/telangana-state-to-auction-rajiv-swagruha-corporation-flats-online-booking-open-pocharam-bandlaguda-flats-to-government-employees.html
Telangana State to auction Rajiv Swagruha flats Online
At Bandlaguda and Pocharam Under a Scheme of Rajiv Swagruha 3,719 flats were constructed to sell to  Government Employees .The Auction process would commence from August last week through open booking online.The Govenment aims to generate Rs 545 crores through the sale of these flats .
2,245 flats at Bandlaguda and 1,474 flats at Pocharam are likely to go under the hammer under the firsthe first phase.
Out of 2,245 flats at Bandlaguda ,316 flats are ready for occupying and the rest 1,929 flats require minor works.Auctioneers who bag the flas will have to take up the minor works on their own.
In the same way 1,474 flats at Pocharam, 969 flats are ready to occupy and the rest 505 flats require minor works.

The Government has fixed the prices in this way:
  1. Bandlaguda-Rs 1,900 per square feet for the flats which are ready to occupy.
  2. Bandlaguda -Rs 1,700 per square feet for semi-finished flats.
  3. Pocharam--Rs 1,700 per square feet for the flats which are ready to occupy.
  4. Pocahram -Rs 1,500 per square feet for semi-finished flats.
Housing Minister Indarakaran Reddy here on Thursday had said that to ensure transparency in transactions and selling the flats, an exclusive website is being prepared on behalf of Rajiv Swagruha Corporation.
 The previous Government had constructed these flats without clearly estimating the market demand. They have invested heavily on these flats. Despite most of the flats being ready to occupy , they did not get buyers. This apart, the government also failed to pay interests on the loans obtained from different banks, the Minister said. This resulted in an additional financial burden on the Telangana Rajiv Swagruha Corporation.
After bifurcation, Telanagana Government had to bear Rs 1,069 crore and of these, our C.M
K. Chandrashekar Rao had permitted clearing Rs 820 crore. The rest Rs 259 crore too would be cleared at the earliest and all measures were being taken accordingly,said Reddy.
After a series of meetings held by the senior authorites with the bank Officials and assured to clear the loans, the financial institutions have approved the online auction of the flats ,said a press release.
Click Here for


Open booking online( August Last week..  )