Tuesday, January 8, 2019

పి ఆర్ సి అంటే ఏమిటి.. ఎన్ని సంవత్సరాలు ప్రాతపదికన ఇస్తారు .. ఫిట్ మెంట్ ఏ విధంగా లెక్కిస్తారు తదితర వివరాలు మీ కోసం

PRC 2018 Expected Basic Pays and Recommenations know here
రాష్ట్ర వ్యాప్తo గా పి.ఆర్ సీ.. ఐఆర్ కోసం.. ఉద్యోగలందరూ  నిరసనలు తెలియజేస్తున్న నేపధ్యంలో.. అసలు పి ఆర్ సి అంటే ఏమిటి.. ఎన్ని సంవత్సరాలు ప్రాతపదికన ఇస్తారు. ఫిట్ మెంట్ ఏ విధంగా లెక్కిస్తారు తదితర వివరాలు మీ కోసం
Telangana PRC Recommendations Complete Details
PRC for State Govt Employees | Anouncement of Pay Revision Commission | PRC terminologies IR Interim Relief Fitment Master Scales Notional Increments DA Dearness Ratio RPS Revision of Pay Scales PRC Pay Revision Commission will study everything at ground level cost of living of the employees Education Hospital Expenditures Savings. Based on the findings Committee will recomond New Pay Scales Allownaces to Employees according to the need to employees. AP and telangana Govts are likely going to anounce IR for their Employees in July 2018 
PRC COMMITTEE 2018 Recommendations:
  1. 28 or 29 December Report Submission to CS.
  2. CM meeting with Employees Unions on 30th December. 
  3. PRC new SALARY from 1st April 2021.
  4. 1st July 2018 to 31st March 2021 only NOTIONAL paper benefits no cash no Arrears
  5. Minimum Salary 20,000 .
  6. Fitment recommend 33%.
  7. AAS Increment 5yrs,10yrs,15yrs,20yrs & 25yrs. At Present it is 6,12,18 & 24.
  8. GRATUITY Increased from 12 LAKHS to 18LAKHS
  9. For full Pension Quantum of Service 33 yrs to Reduced 31yrs.
  10. Minimum Pension Increased from Rs 6,500 to Rs 10,000.
  11. No Slab Changes in HRA. CITY HRA 30%, DIST 20%, Mandal Level 15%.
  12. 3% INCREMENT Rate in master scales.
  13. Next time PRC Will be 10yrs gap
  14. DA will be Equal to Central Govt Announcement. 
  15. Retirement age Increased will be decided after April 2021.
పీఆర్సీ విధులు, విధానాలు
పీఆర్‌సీని ఆంగ్లంలో PAY REVISION COMMITTEE (వేతన సవరణ సంఘం) అని పిలుస్తారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్‌ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేత నాలుగా కూర్పు చేసేదే పీఆర్‌సీ. తాజా మాస్టర్‌ స్కేలు, ఇంక్రిమెంట్లు, కరువు భత్యంలను ప్రతిపాదించేదే పీఆర్‌సీ. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పీఆర్‌సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయం గా తాజా మూల వేతానాలను ప్రతిపాదిస్తుంది.
మధ్యంతర భృతి(ఐఆర్‌) 
ప్రతీ పీఆర్‌సీ కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పీఆర్‌సీ అముల్లోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ రద్దవుతుంది.
PRC 2018 / RPS 2021 Expected Basic Pays and Recommendations Click Here

ఫిట్‌మెంట్‌ 
తాజా ద్రవ్యోల్బణం ధరల సూచికను ఆధారం చేసుకొని మూల వేతనాలను పెంచాల్సిన స్థితిశాతాన్ని ప్రభుత్వం నిర్ధారించి పీఆర్‌సీలో ప్రకటించేదే ఫిట్‌మెంట్‌ అంటారు. అయిదేళ్ల కాలంలో పెరిగిన ధరల స్థితిని సమన్వయ పరిచి ఉద్యోగి జీతాన్ని ఫిట్‌మెంట్‌ ద్వారా పెంచుతారు. ప్రారంభ డీఏ, పీఆర్‌సీ జరిగిన 
వెంటనే గత కరువు భత్యం విలువ రద్దయి వెంటనే తాజాగా ప్రకటించే కరువు భత్యాన్ని ప్రారంభ డీఏ అంటారు. డీఏ కలపడంలో వేతన స్థిరీకరణ జరిగే తేదీ నాటికి ఉన్న డీఏను మూల వేతనంలో కలుపడాన్ని డీఏ మెర్జ్‌ అంటారు.
మాస్టర్‌ స్కేల్‌ :
మూత వేతనాల శ్రేణినే మాస్టర్‌ స్కేల్‌ అంటారు. పాత మూల వేతనాలు, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను సమన్వయ పరిచి తాజా ధరల స్థితిని బేరీజు వేసి ఇంక్రిమెంట్ల కూర్పులో నూతన మూల వేతనాల శ్రేణిని కమిటీకి నివేదిస్తారు. కొత్త మూల వేతనాలు, మాస్టర్‌ స్కేల్‌ను బట్టి నిర్ణయిస్తారు. మాస్టర్‌ 
స్కేల్‌లో మూల వేతనాల ప్రతి సంవత్సరం పెరిగే ఇంక్రిమెంట్‌ విలువలు పొందు పరుస్తారు. వేతన స్థిరీకరణలను మాస్టర్‌ స్కేల్‌ ప్రకారం జరుపుతారు.
నోషనల్‌ ఫిక్సేషన్‌ :
పీఆర్‌సీ అమలైన తేదీ నుంచి ఆర్థిక లాభాలు నగదుగా చెల్లించే తేదీకి మధ్య గల కాలాన్ని నోషనల్‌ పిరియడ్‌ అంటారు. ఈ పీరియడ్‌లో జరిగే స్థిరీకరణనే నోషనల్‌ ఫిక్సేషన్‌ అంటారు. ప్రభుత్వం పీఆర్‌సీని సకాలంలో జరపకపోవడం వల్ల నోషనల్‌ పిరియడ్‌ వస్తుంది. నోషనల్‌ కాలంలో పెరిగిన వేతనాలను 
ప్రభుత్వం చెల్లించేందుకు ఈ కాలంలో పదవీ విరమణ చేసిన వారికి గ్రాడ్యూటీ, పెరిగిన మూల వేతనాలకు చెల్లించరు. ఈ కాలంలో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు.
నైష్పత్తిక డీఏ :
ప్రతీ పీఆర్‌సీలో డీఏ విలువను మార్పు చేస్తారు. కేంద్రం ప్రకటించే ప్రతి ఒక్క శాతం డీఏకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే డీఏను నైష్పత్తిక డీఏ అంటారు.
Click Here to Download
Latest Information on PRC
33 % ఫిట్‌మెంట్‌తో త్వరలో పిఆర్‌సి?
రిటైర్మెంట్ వయసు మీద కూడా నిర్ణయం ప్రకటించే అవకాశం
నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం ?
పిఆర్‌సితో పాటు ఉద్యోగుల పదవీ విరమణపై చర్చించే అవకాశం
ఫిట్‌మెంట్ 33 శాతంగా ప్రకటించనున్న ప్రభుత్వం !
ఈనెల 28 లేదా 29వ తేదీన సిఎస్‌కు పిఆర్‌సికి నివేదిక అందించనున్న చైర్మన్ బిస్వాల్
ఉద్యోగులకు మేలు చేసేలా నివేదిక
మనతెలంగాణ
త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులతో పాటు పింఛనర్లకు నూతన సంవత్సర కానుకను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈనెలాఖరులోగా పిఆర్సీ కమిషన్ పదవీకాలం పూర్తికానున్న ఈ నేపథ్యంలో సకల హంగులతో ఉద్యోగులకు మేలు చేసేలా పిఆర్‌సి నివేదిక సిద్ధమయినట్టుగా సమాచారం. గతంలో 9 పిఆర్‌సి అమల్లోకి వచ్చే ముందు 22 శాతం ఐఆర్ ఇవ్వగా, 38 శాతం ఫిట్‌మెంట్, 10 పిఆర్‌సి అమల్లోకి వచ్చే ముందు 27 శాతం ఐఆర్ ఇవ్వగా, 43 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా బిస్వాల్ కమిటీ నేతృత్వంలో 2018 మే 18వ తేదీన పిఆర్‌సి కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిషన్‌లో సభ్యులుగా ఐఏఎస్ అధికారి బిస్వాల్ చైర్మన్‌గా, విశ్రాంత ఐఏఎస్‌లు ఉమా మహేశ్వరరావు, మహ్మద్ అలీరఫత్‌లు సభ్యులుగా నియమితుల య్యారు. ప్రస్తుతం ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగుస్తోంది. అయితే ఈ కమిషన్ ఉద్యోగులకు 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సూచించినట్టుగా తెలిసింది.*
ఈనెల 28 లేదా 29వ తేదీ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నివేదికను పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ అందజేయనున్నట్టుగా సమాచారం. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూలవేతనం, గరిష్ట వేతనాలు, అలవెన్స్‌లను నివేదికలో పొందుపరిచేలా బిస్వాల్ కమిటీ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు ఇప్పటికే మంజూరు చేసిన డిఏను కలిపి కొత్త పిఆర్‌సి అంచనాలను ఈ కమిషన్ రూపొందించినట్టుగా తెలిసింది.*
పదవీ విరమణ వయస్సు పెంపుపై కూడా….*
ఈ నేపథ్యంలోనే 
ఉద్యోగసంఘాలతో సిఎం కెసిఆర్ సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి పిఆర్సీపై ప్రకటనతో పాటు పదవీ విరమణ వయస్సు పెంపుపై కూడా ఓ ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఏప్రిల్ 2021 నుంచి ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలను నగదు రూపంలో చెల్లించడంతో పాటు పదవీ విరమణ వయస్సుపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూలై 2018 మార్చి నుంచి 2021 వరకు నోషనల్‌గా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కేంద్రం డిఏను ప్రకటించగానే వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు దానిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. పిఆర్‌సి తుదినివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ సైతం జీతభత్యాల పెంపుదలపై ప్రభావం ఎంత, ఏ మేరకు ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత భరించాల్సి ఉంటుందన్న అంశాలపై గణాంకాలను సిద్ధం చేసినట్టుగా అధికారికవర్గాలు పేర్కొన్నాయి.```
పిఆర్సీ నివేదికలో పేర్కొన్న అంశాలు ఇలా..!
అయితే 33 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు ఇవ్వాలని పిఆర్‌సి కమిషన్ ఆ నివేదికలో సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు కనీస పింఛన్‌ను రూ.6,500ల నుంచి రూ.10 వేల వరకు, ఉద్యోగుల కనీస వేతనాన్ని కూడా రూ.20 వేల వరకు పెంచాలని పిఆర్సీ నివేదికలో పేర్కొన్నట్టుగా సమాచారం. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లను యధాతథంగా అమలు చేయడంతో పాటు, రిటైర్‌మెంట్ గ్రాట్యుటీని రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచాలని, పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు 30 శాతం, జిల్లా స్థాయిలో పనిచేసే వారికి 20 శాతం, మండల స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు 15 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇవ్వాలని బిస్వాల్ కమిటీ ఈ నివేదికలో సూచించినట్టుగా సమాచారం. దీంతోపాటు ఉద్యోగి యొక్క ఇంక్రిమెంట్ 3 శాతంగా కొనసాగించడంతో పాటు పూర్తి పింఛన్‌కు అర్హత కలిగిన సర్వీస్ 33 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలకు కుదించాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం (ఏఏఎస్‌ను 5,10,15,20,25)గా ఇవ్వాలని కమిషన్ సూచించినట్టుగా తెలిసింది. ఇక నుంచి పదేళ్లకు ఒకసారి ఉద్యోగుల జీతభత్యాలపై సమీక్ష జరపాలని ఈ కమిషన్ సూచించినట్టుగా తెలుస్తోంది.